telugudanam.co.in

      telugudanam.co.in


రాబోవు కార్యక్రమాలు
     
19937 (ఈ వారానికి పదాల సంఖ్య)

సామెత: ఇంటి కళ ఇల్లాలే చెబుతుంది.

మంచిమాట: చేటు కాలమునకు చెడు బుద్ది పుట్టును.

నీతి కథ : దుంపకోసం ఎలుక సాయం [ వివరాలకు... ]

మహనీయ వ్యక్తి: బిపిన్ చంద్రపాల్ [ వివరాలకు... ]

ఆట : బొమ్మల మాయ [ వివరాలకు... ]

తెలుగు సైటు: వెబ్ ప్రపంచం [ వివరాలకు... ]
తెలుగుదనం విషయ సూచిక


సంస్కృతి, సాంప్రదాయాలు


సాహిత్యం


చిన్నపిల్లల కోసం


వనితల కోసం


అందరి కోసం


 

తెలుగుదనము తీయదనము

తెనుగుదనము వంటి తీయదనము లేదు
తెనుగు కవులవంటి ఘనులు లేరు
తెనుగుతల్లి సాధుజన కల్పవల్లి రా
లలిత సుగుణజాల! తెలుగు బాల!
కష్టబెట్టబోకు కన్నతల్లి మనస్సు
నష్టబెట్టబోకు నాన్న పనులు
తల్లిదండ్రులన్న దైవ సన్నిధులురా
లలిత సుగుణజాల! తెలుగు బాల!
బడికి నడువలేడు; పాఠాలు వినలేడు;
చిన్న పద్య మప్పజెప్పలేడు
రాజరాజు బిడ్డరా నేటి విద్యార్థి!
లలిత సుగుణజాల! తెలుగుబాల!
బ్రతికినన్ని నాళ్ళు ఫలములిచ్చుటెగాదు
చచ్చికూడ చీల్చి యిచ్చు తనువు
త్యాగభావమునకు తరుపులే గురువులు!
లలిత సుగుణజాల! తెలుగుబాల!
దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు;
భాత్ర్పజనము వచ్చి పంచుకోరు
విశ్వవర్ధనంబు విద్యా ధనంబురా
లలిత సుగుణజాల! తెలుగుబాల!
Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: