|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
మహమ్మదు ప్రవక్త సూక్తులు
ప్రేమించు-ప్రేమింపజేసుకో-ఇదే జీవిత ముఖ్య లక్ష్యం.
పరస్పానురాగాలతో ప్రవృద్ధి పొందే వారిని స్వర్గం ఆహ్వానిస్తుంది. పరస్పర ద్వేషులకు నరకమే ప్రాప్తి.
వివేకాన్ని మించిన అమూల్య వస్తువు లేదు.
ధర్మ మార్గంలో చింతించు, ఇదే మంచి మానవుని లక్షణం. ధర్మ మార్గంలో నడుచుకో, అదే దివ్య లక్షణం.
ఆపేక్షించే గర్భదరిద్రులకు గుప్తంగా సహకరించి ఆదుకో. బహిరంగంగా నీతులు బోధించడం నేర్చుకో.
సత్యవాదికి ధర్మ దూషణ పనికిరాదు.
ఆమరణాంతం ఉత్తమ జ్ఞానాన్ని వృద్ధి పెంపొందించుకో.
సంతాన హీనులకు చింత ఎందుకు?సమ్రక్షించి పెంచగలిగితే అనాధుని దత్తు చేసుకో.
కన్న తల్లిదండ్రులే పిల్లలకు మొదటి ఉత్తమ గురువులు. చాకచక్యంతో, నేర్పుతో, అనురాగంతో ఉపదేశించు.
విద్యాభూషణమే ఉత్తమ భూషణము. విద్యాశయం వ్యాపారం కాకూడదు. మంచిని పెంచేదే విద్య. నవనాగరీకంగా ఉండాలి. నిష్ఫలమైనదిగా ఉండకూడదు.
సంపద కలిగినపుడు భగవంతుని అభినందించు. కష్టాలు కలిగితే శరణు వేడుకో. ఎవరి ముక్తి మార్గం వారే చూసుకోవాలి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in