|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
కండ్లను కాపాడుకోండి

ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మంచినీటితో కండ్లను శుభ్రం చేసుకోవాలి.
ముఖం కడుక్కునేటప్పుడు ఎవరి తువ్వాలును వారే ఉపయోగించాలి.
మండుటెండ, దుమ్ము, పొగనుండీ కళ్ళను కాపాడుకోవాలి. సూర్య గ్రహణాన్ని చూడాలనుకునేవారు నల్లటి కళ్ళజోడును తప్పనిసరిగా ధరించాలి.
పుస్తకం చదువుతున్నప్పుడు పుస్తకాన్ని కంటి నుండి ఒకటిన్నర అడుగు దూరం ఉంచి చదవాలి. ఎడమచేతి పక్కనుండి వెలుతురు పడేలా చూడాలి.
మసక వెలుతురులోనూ, జారగిలపడినప్పుడు, ఆనుకున్నప్పుడు పుస్తకం చదవరాదు.
తక్కువ వెలుతురులో కనీసం 10 అడుగుల దూరం నుండే టెలివిజన్ చూడాలి.
బిల్లంగూడు, విల్లు వంటి ఆటల్కు పిల్లల్ని దూరంగా ఉంచాలి.
వాడిగా ఉన్న వస్తువులైన పెన్సిల్, సూది లేదా వాడి మొన ఉన్న బొమ్మలు వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
కంటిలో నలుసు పడ్డప్పుడు కళ్ళను గట్టిగా రుద్దకండి. మంచినీటితో కళ్ళను శుభ్రంగా కడుక్కొని కంటి వైద్యుడి వద్దకు వెంటనే బయల్దేరాలి.
కంటిలో ఆంలం లేదా లవణ సారం పడ్డప్పుడు కంటిని మంచి నీటితో శుభ్రంగా కడుక్కొని కంటి డాక్టరును సంప్రదించాలి.
అతిసారంతో బాధపడుతున్న పిల్లలను గురించి ఎక్కువ జాగ్రత్త వహించాలి. దీనివల్ల విటమిన్ ఏ లోపం సంభవిస్తుంది. ఇది అంధత్వానికి లేదా కంటిలో పుండుకు దారితీస్తుంది.
ఏ-విటమిన్ పుష్కలంగా ఉన్న బచ్చలికూరలాంటి ఆకుకూరలను, ఆప్రికాట్ లాంటి రేగు పండు జాతి పండ్లనూ, కారెట్లనూ, పాలనూ, వెన్న, చేప కాలేయం నూనెనూ, గుడ్డులోని పచ్చసొననూ ఎక్కువగా వాడడం మంచిది.
ఆటలమ్మ, చిన్నమ్మలాంటి మశూచి వ్యాధి సోకినవారు కంటిలోని పుండుతో బాధపడే అవకాశం ఉంది. వెంటనే కంటి డాక్టరుని సంప్రదించండి.
కంటి చూపు తక్కువగా ఉన్న పిల్లలు కళ్ళజోడును విడవకుండా వాడాలి. అశ్రద్ధ చేసిన పక్షంలో పిల్లలకు మెల్ల కన్ను వచ్చే అవకాశం ఉంది.
పొగత్రాగడం, మద్యపానం, పొగాకును వాడడం వలన కంటి చూపుకు హాని కలిగే అవకాశం ఉంది.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in