www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

పోషక విలువల తోటకూర

ఉపయోగాలు:

గుండె జబ్బులు ఉన్నవారు తోటకూరను ఉడకబెట్టి తినడం ద్వారా గుండెజబ్బుల నుండి దూరంగా ఉండవచ్చు. కాల్షియం లోపం ఉన్నప్పుడు ఎవరికైనా గోర్లు పెరగవు. పళ్లమీద పచ్చని పొరలు ఏర్పడుతుంటాయి. కాబట్టి నిత్యం ఆహారంలో తోటకూరను తీసుకోవడం వలన వీటన్నింటిని నివారించుకోవచ్చు, రక్తంలోని హిమోగ్లోబిన్‌లో ఐరన్ లోపించిన వారు రక్తహీనతలకు లోనవుతూ ఉంటారు. ఇటువంటి వారు ఎక్కువగా పెసరపప్పు, తోటకూర కలిపి వండినటువంటి కూరలను తినడం ద్వారా ఎంతోమంచి జరుగుతుంది. తోటకూరలో ఉండేటటువంటి కాల్షియం, ఐరన్‌లు బాలింతలకు, గర్భవతులకు, పిల్లలకు పోషక విలువలు అందజేస్తాయని వైద్యశాస్త్రం సూచిస్తుంది.

తోటకూర తేలికగా జీర్ణమవుతుంది. కాబట్టి లివర్ సంబంధిత రోగులు కూడా దీనిని వాడుకోవచ్చు. రక్తమొలలతో బాధపడేవారు తోటకూరను పెరుగు పచ్చడిగా చేసుకొని తింటే ఉపశమనం కలుగుతుంది. కడుపులో నులి పురుగులు ఉన్నట్లయితే కూడా తోటకూర కషాయాన్ని కాచుకొని పరగడుపున తాగితే అవి పోతాయి. విరేచనం సాఫీగా లేని వారు ప్రతిరోజూ రాత్రిపూట తోటకూరను తినడం వలన విరేచనం తేలికగా అవుతుంది. గర్భిణీలు కాళ్లు వాపులు వస్తే తోటకూర రసంలో నిమ్మరసం కలుపుకొని తాగితే వాపులు తగ్గిపోతాయి. శరీరం తేలిక అవుతుంది.

 


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in