www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

పుదీనాతో వైద్యం

వికారం మటుమాయం:

చక్కని సువాసనను ఇచ్చే పుదీనా ఆకులు వంటలలో ఎంతో ప్రాచుర్యాన్ని పొందాయి.చాలా రకాల కూరల్లో పోపుల్లో కూడా ఈ పుదీనా ఆకుల్ని వేస్తారు.కడుపులో వికారం వున్నప్పుడు పుదీనా వాసన చూస్తే ఆ వికారం మాయం అవుతుంది. పుదీనాను టూత్ పేస్ట్ పిప్పర్ మెంట్లు, చూయింగ్ గమ్ మెంథాల్‌తో పాటు అనేక మందుల్లో వాడుతున్నారు.

ఉపయోగాలు:

వాంతులు  వికారంతో ఇబ్బంది పడేవారు పుదీనా పచ్చడి తినడం వలన ఆ వికారం తగ్గుతుంది. గర్భిణీ స్త్రీలకు ఇది ఎంతో మంచిది. పుదీనా ఆకుల రసం ముక్కులో పిండితే అపస్మారకం నుండి రోగికి తెలివి వస్తుంది అని వైద్యులు చెబుతున్నారు. కడుపులో బద్దె పురుగులు, ఏలికపాము వంటివి పుదీనా రసం పరకడుపున తీసుకోవడం ద్వారా మలముద్వారా అవి బయటపడిపోతాయి. కడుపు ఉబ్బరానికి కడుపు నొప్పులకి పుదీనా మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. పుదీనా రసాన్ని దగ్గు, తుమ్ము, ఆయాసం కలవారికి వాడితే ఉపసమనం కలుగుతుంది. నోటి దుర్వాసనకు పుదీనా రసాన్ని నీటిలో కలిపి పుక్కిలించడం ద్వారా క్రిములను దూరంగా ఉంచి దుర్వాసనను పోగొట్టవచ్చు. అంతేకాక ఇది నోటిలోని పుండులను కూడా తగ్గిస్తుంది. ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే మజ్జిగలో పుదీనా ఆకులను కలిపి తాగాలి. పుదీనా నుండి మెంథాల్ తయారు చేస్తున్నారు. అది జలుబును తగ్గించి శ్వాస బాగా ఆడేట్లు చేస్తుంది. జలుబు చేసినప్పుడు మరిగే నీటిలో కాస్త పసుపు మెంథాల్ వేసి ఆవిరిపడితే జలుబు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. కీళ్ళ నొప్పులతో బాదపదేవారు తరచూ పుదీనా తింటే ఎంతో మంచిది.

పిల్లలకు:

చిన్న పిల్లలు కడుపునొప్పి ఉప్పరంతో బాధపడుతుంటే గోరువేచ్చని నీటిలో ఐదు ఆరుచుక్కలు పుదీనా రసం కాచి తాగించడం వలన కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి తగ్గుతుంది. చిన్న పిల్లలకు జలుబు చేస్తే పుదీనా నుండి తయారయ్యే మెంథాల్ ముద్ద కర్పూరాన్ని కొబ్బరినూనెను కొంచెం తీసుకొని మిశ్రమం చేసి ఛాతికీ వీపునకు రాస్తే జలుబు తగ్గుతుందని ఆయుర్వేద వేద్యం సూచిస్తోంది. పుదీనా ఆకులను టీతో కలిపి తాగితే రుచుగా ఉండడామే కాక కంఠస్వరం బాగుంటుంది. గాయకులు, డబ్బింగ్ చెప్పేవారు పుదీనా రసం తాగితే కంఠస్వరం మృధువుగా మధురంగా తయారవుతుంది.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in