www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

తిండి కాదు... బరువు తగ్గాలి

టీనేజ్ నుంచి మధ్య వయస్కుల వరకు వయసుతో నిమిత్తం లేకుండా దాదాపు అందరూ నాజూగ్గా ఉండాలనే కోరుకుంటారు . అందుకు డైటింగ్, యోగా, వ్యాయామం... ఇలా ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటారు. కానీ ఎంత వ్యవధిలో ఎంత బరువు తగ్గాలనుకుంటున్నారో షెడ్యుల్ తయారుచేసుకోనే ముందు వయసు, శరీరాకృతి, ఆరోగ్య పరిస్థితి... ఇలా ఎన్నో విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. లేదంటే  బరువు తగ్గే మాట అటుంచి లేనిపోని సమస్యలు వచ్చి పడతాయి.

ఒకేసారి డైటింగ్ చేసి అంటే పూర్తిగా బోజనం తగ్గించేసి అతి తక్కువ కాలంలో బరువు తగ్గాలనుకుంటారు  చాలా మంది, ఇది పొరబాటు. ఇలా చేయడం వల్ల  జీవక్రియలు దెబ్బతింటాయి. చర్మం మెరుపు కోల్పోతుంది.   వ్యార్ధకపు చయలు కనిపిస్తాయి. అందుకే బరువు  తగ్గాలనుకునే వారు కూడా తమ ఆహారంలో క్యాల్షియం , ఇనుము, విటమిన్ - ఎ,ఇ,సి,బి కాంప్లెక్స్‌లు వంటి సూక్ష్మపోషకాలు తప్పనిసరి ఉండేలా చూసుకోవాలి . సంపూర్ణంగా ఆరోగ్యంతో ఉండాలనే ...మాంసకృత్తులు అధికంగా ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి.

ఆహారంలో జాగ్రత్తలు

సమతులాహారం, వ్యాయామం, జీవనవిధానం... వీటన్నింటితో కూడి ఉండాలని  మీ బరువు తగ్గే ప్రణాలిక, సరైన సత్ఫలితాలు సాధించాలంటే... శరీరాకృతి, ఆహారపుటలవాట్లు  ఆధారంగా  అత్యవసరమైన  పోషకాలు సరైన  సమయంలో తీసుకోవాలి. అందులో ఏమేమి ఉండాలంటే...

ఇలా తగ్గాలి...

డైటింగ్ విషషయంలో పక్కన బెడితే ఒకటి రెండు వారాల్లో అధిక బరువు పూర్తిగా తగ్గిపోవడమనేది  సరైన ఆలోచన కాదు. మూడు నెలల కాల వ్యవధిలో దాదాపు పన్నెండు నుంచి పదిహేను కిలోల  బరువు తగ్గేలా ఉండాలి ప్రణాలిక . మూడు నెలల తర్వాత మీరెంత బరువున్నారో మీకు తెలుస్తుంది. మరో ప్రణాలిక రూపొందించుకునేవరకు మీరు అంతే బరువు ఉండాలి .


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in