|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
చెప్పుల్ని కొనేముందు ...
చెప్పులే కదా! అనో లేకపోతే స్టయిల్ గా కనిపించాయనో ఎలాపడితే అలా పాదరక్షలను కొనకూడదు. వాటిని కొనడానికి ఒక టైం ఉంటుందని తెలుసా మీకు. అలాగే చెప్పులు కొనేటప్పుడు తీసుకోవాల్సిన, గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్తలు కూడా కొన్ని ఉన్నాయి. అవేమిటంటే -
రెండు పాదాలు ఒకే సైజులో ఉండవనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కొత్త చెప్పులు, షూ, శాండల్ ఏవి కొంటున్నా రెండు పాదాలకు వేసుకుని సైజు చూసుకోవాలి. వేసుకున్నప్పుడు కొంచెం అసౌకర్యంగా అనిపిస్తే కొన్నాళ్లు వేసుకుంటే సాగుతాయిలే అని తీసుకోవద్దు. బ్రాండ్ సైజుల బట్టి కొనొద్దు. స్టయిల్ ను బట్టి సైజులు మారుతుంటాయి. అందుకని పాదరక్షలు కొనే ప్రతిసారి రెండు పాదాలకు వేసుకుని గమనించి కొనుక్కోవాలి. కాలి వెనుక భాగం షూలో సరిగా కూర్చోవాలి. అలా ఉంటే కాలి వేళ్లను సులువుగా కదిలించొచ్చు. కాలిని సులభంగా బయటకి తీయొచ్చు.
రోజులో ఎక్కువ సేపు కూర్చొని, నిల్చోని ఉండడం వల్ల కాళ్లు వాస్తాయి. అందుకని సాయంత్రాలు మాత్రమే కొత్త చెప్పులు కొనుక్కోవాలి. అధ్లెటిక్ షూ కొనేటప్పుడు ఆటల్లో వేసుకునే సాక్స్‌నే వేసుకోవాలి. వర్కవుట్ చేసిన తర్వాతో, రన్నింగ్ చేసిన తర్వాతో కొనుక్కోవాలి. వారానికి మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు ఆటల్లో పాల్గొనే వాళ్లు స్పోర్ట్స్ కోసం ప్రత్యేక షూ కొనుక్కోవాలి. వాకింగ్ కు వేరుగా వాడాలి.
వెన్ను, ఆర్ధోపెడిక్ సమస్యలు ఉన్న వాళ్లు డాక్టర్ని సంప్రదించి షూ, హైహీల్స్, ఫ్యాన్సీ సోల్స్ వంటివి కొనుక్కోవాలి. షూ కొనేముందు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది పాదాలకు సౌకర్యంగా ఉండాలనే విషయాన్ని.
మూలం: ఈనాడు దినపత్రిక (సిరి)
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in