|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
ఫర్నీచర్ కొనేముందు...
ఇల్లు అందంగా పెట్టుకోవాలని ఎవరికైనా ఉంటుంది. కాని అస్తమానం కొత్తవి కొనాలంటే సాధ్యం కాదు కదా. చిన్న చిన్న వస్తువులు కొని ఇంటికి డిఫరెంట్ లుక్ తెచ్చుకోవడం బెస్ట్. ఆ ఆసక్తి ఉన్నవారికి కొన్ని సూచనలు-
ప్రాంతీయ, జాతీయ స్థాయిలో ఫర్నీచర్ రిటైలర్‌లకి ఉండే అవుట్‌లెట్‌లకు వీలున్నప్పుడల్లా వెళ్తుండండి. మీకు నచ్చిన ఫర్నీచర్ దొరికే అవకాశం ఉంది. నెట్ చూస్తుండండి. నెట్‌లో బొమ్మలతో డిస్‌ప్లే చూస్తారు కాబట్టి మీ ఇంట్లో ఆ వస్తువులను పెడితే ఎలా ఉంటుందో ఐడియా వస్తుంది. దీనివల్ల షాపుల్లోకి వెళ్లి గంటలు గంటలు ఈ టేబుల్‌ను ఇంట్లో హాల్లో పెడితే ఎలా ఉంటుందని ఊహించుకునే పని తప్పుతుంది. ఒక షాపులో నచ్చకపోతే మరో షాపుకి తిరుగుతూ సమయం వృధా చేయకుండా ఉండొచ్చు. ఒకసారి మీకు ఎలాంటివి నచ్చుతాయనే విషయంపై స్పష్టమైన అవగాహన వస్తే షాపింగ్ చేయడం సులభమవుతుంది.
ఒక సారి వాడిన వస్తువులను కొనడమేమిటని తేలికగా కొట్టిపారేయొద్దు. కొన్నిసార్లు అవే ఇంటికి రెట్టింపు శోభను ఇస్తాయి. అయితే ఇలాంటివి కొనేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తగా గమనించుకుని కొనాలి.
బడ్జెట్ ప్లానింగ్
మీరు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారో ముందుగానే నిర్ణయించుకోండి. వస్తువులు కొనేటప్పుడు ఆ లిమిట్ దాటిపోవద్దు. అందుకే ఫ్యాక్టరీ అవుట్‌లెట్స్‌లో కొనండి. అక్కడ చాలాసార్లు వస్తువులు డిస్కౌంటు ధరలకి లభిస్తుంటాయి. సేల్స్, ఎగ్జిబిషన్‌లలో కూడా మీకు నచ్చిన వస్తువులు తక్కువ ధరకు దొరుకుతాయి.
వస్తువు నాణ్యత విషయంలో దాని గురించిన అవగాహన ఉన్న కుటుంబ సభ్యులు, స్నేహితుల సలహాలు తీసుకోండి. కొనేముందు వస్తువు నాణ్యత, మన్నికలు ఒకటికి రెండుసార్లు గమనించండి.
వస్తువు ఖరీదుపై వాట్ వంటి అదనపు ఖర్చు, డెలివరీ రుసుము అన్నీ కలుపుకుని ఎంతవుతుందో ముందుగానే లెక్కేసుకోండి. రశీదులను జాగ్రత్త పరచుకోండి. ఒకవేళ కొన్న వస్తువు మీకు తృప్తిగా అనిపించకపోతే రశీదు వస్తువును మార్చుకోవచ్చు. ధర తక్కువగా వస్తుందని కొనేయకుండా వస్తువు నాణ్యతను గమనించుకోవాలి.
మూలం: ఆంధ్రజ్యోతి దినపత్రిక (నవ్య) శనివారం, నవంబరు 25, 2006.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in