|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
సోఫా కొనేముందు...
ఫర్నీచరు కొనేటప్పుడు చాలామంది చేసే పొరపాటు పైపై మెరుగులు చూసి కొనేయడం. డబ్బు పెట్టి కొనే వస్తువు అందం ఎంత ముఖ్యమో నాణ్యతా అంతే ముఖ్యం. అందుకని నచ్చిన మోడల్ ఎంచుకున్నాక వెంటనే డబ్బు చెల్లించకండి. ముందుగా దాని నాణ్యతా ప్రమాణాలపై దృష్టిపెట్టండి. సోఫా ఈ రోజుల్లో అందరి డ్రాయింగ్ రూముల్లో తప్పనిసరి ఫర్నీచరు అయ్యింది. కాబట్టి అది కొనేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో చూద్దాం.
ఎంచుకున్న సోఫా మీద కనీసం పదినిమిషాలు కూర్చోండి. సౌకర్యంగా ఉందీ లేనిదీ తెలుస్తుంది.
చేతులు పెట్టుకునే చోట, కింద, వెనక వైపున అంతా సమంగా మెత్తగా ఉందా లేక ఎక్కడైనా గట్టిగా ఫ్రేమ్ తగుల్తుందా గమనించండి.
దాని మీద కూర్చొని అటూ ఇటూ కదలండి. కీచుమని ధ్వని రాకుండా ఉంటేనే సరిగా ఉన్నట్లు.
వెనుక వైపున ఉండే బ్యాక్ రెస్ట్ మీ నడుం కింది భాగానికి దన్నుగా ఉండాలి. కాళ్ళు నేలమీద ఆని సౌకర్యంగా కూర్చున్నట్లు కూర్చున్నవారికీ అనిపించాలి. చూస్తున్నవారికీ అనిపించాలి.
కూర్చున్నప్పుడు సోఫా సీటు లోపలికి వెళ్తుంది కదా. అలా వెళ్ళడం పది సెంటీమీటర్ల కన్నా ఎక్కువగా ఉండకూడదు.
అతుకుల్లాంటివి ఉన్నచోట కాస్త జాగ్రత్తగా గమనించాలి. కుట్లు పటిష్ఠంగా ఉందీ లేనిదీ చూసుకోవాలి.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిపే బ్రోచర్ తీసుకోవడం మరువవద్దు.
చివరిదైనా ముఖ్యమైనది ఇంకోటుంది. అసలు మీరు ఎంచుకున్న సోఫా మీ హాలులో ఎక్కడ వేయాలో అక్కడ అది పడుతుందో లేదో గది గుమ్మంలోంచి లోపలికి తీసుకెళ్ళడం వీలవుతుందో లేదో దాని రంగు మీ ఇతర ఫర్నీచర్లకు నప్పుతుందో లేదో తదితరాలన్నీ చూసుకోవాలి.
మూలం: ఈనాడు దినపత్రిక వసుంధర 30-6-2006.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in