|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
ఎందుకు, ఏమిటి, ఎలా ...
దువ్వెనల గురించి మీకెంత తెలుసు!
సాధారణంగా శిరోజాల సంరక్షణకు వాడాల్సిన షాంపూ, కండీషనర్, చివర్లు చిట్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఆలోచిస్తాం. జుట్టును అందంగా తయారుచేయడానికి దువ్వెనలు, బ్రష్‌లు ఎంతో దోహదపడతాయి. మరి అటువంటి వాటి గురించి తెలుసుకోకపోతే ఎలా...
వెడల్పాటి పళ్లున్న దువ్వెన తడితలకు కోసం వాడవచ్చు. జుట్టురాలిపోదు. చిక్కులు ఏర్పడవు.
ఉంగరాల జుట్టుకు మరీ వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెన చక్కగా ఉపయోగపడుతుంది.
ఇక, కురులను నేరుగా దువ్వుకోవడానికి ఎంతో అనువుగా ఉంటుంది. మౌసే కోంబ్ దీనిలో బ్రిజిల్స్ రెండు వరసల్లో ఉంటాయి.
శిరోజాలను చక్కగా గ్రూమ్ చేసుకోవడానికి వాడే టెయిల్కోంబ్ ప్రత్యేకతే వేరు. దీనికుండే సన్నని బ్రిజిల్స్‌తో జుట్టును తీరుగా తీర్చిదిద్దుకోవచ్చు.
ఇక, ఆఫ్రోకోంబ్ రకం దువ్వెనలకు వెడల్పు పొడవాటి బ్రిజిల్స్ ఉంటాయి. బాగా నిడుపాటి కురులను చిక్కులు పడకుండా చకచకా దువ్వుకోవచ్చు ఈ దువ్వెనతో...
దువ్వెనల్లో ఎక్కువ మట్టి చేరకుండా ఉండాలంటే వారానికి ఒకసారి శుభ్రం చేయాలి.
వీటి పళ్లమధ్యలో పేరుకుపోయిన మలినాలను తొలగించడానికి పాత టూత్‌బ్రష్‌ను ఉపయొగించవచ్చు.
సబ్బునీటిలో కొన్ని చుక్కల డెటాల్ వేసి దువ్వెనలను కాసేపు నాననిచ్చి శుభ్రం చేస్తే చుండ్రు సమస్యల్లాంటివి మన దరికిరావు.
కొన్ని రకాలదువ్వెనలకు బ్రిజిల్స్ గరుకుగా ఉండి గుచ్చుకున్నట్లవుతాయి. అలాంటి దువ్వెనలు మృదువైన శిరోజాలను దెబ్బతీస్తాయి. అందుకే అలాంటివాటిని వాడకండి.
బ్రష్‌లు
పొడవాటి, నైలాన్, ప్లాస్టిక్, మెటల్‌ల సమ్మిళిత మైన బ్రిసిల్స్ ఉన్న బ్రష్‌లు ఇప్పుడు లభ్యమవుతున్నాయి. చెక్క, ప్లాస్టిక్, రబ్బర్ హ్యాండిల్స్‌తో ఈ బ్రష్‌ల అందమే వేరుగా ఉంటుంది. ఇకమీరు బ్రష్‌ను కొనేముందు వెడల్పాటి బ్రిసిల్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. వీటి నాణ్యతను తెలుసుకోవాలంటే కొనేముందు అరచేతికి నొక్కిచూసుకోవాలి. గుచ్చుకుంటే ఇక వాటిని కొనకపోవడం మంచిది.
గ్రూమింగ్ బ్రష్‌లకు ఉండే బ్రిసిల్స్ ఎటుపడితే అటువంచడానికి వీలుగా ఉంటాయి. జుట్టును ఇబ్బంది పెట్టవు.
రేడియల్ లేదా సర్కులర్ బ్రష్‌లు గుండ్రంగా ఉంటాయి. జుట్టును రింగులుగా తీర్చిదిద్దుకోవడానికి ఈ బ్రష్‌లు బాగా ఉపయోగపడతాయి.
పెడల్ బ్రష్‌లు చతురస్రాకారంలో ఉంటాయి. పొడవాటి జుట్టుకు ఇవి ఎంతో శ్రేయస్కరం.
వెంట్బ్రష్లను ప్రత్యేకంగా డ్రైయింగ్కోసం వాడతారు.
చూశారుగా... బ్రష్‌లు...దువ్వెనల రకాలు... మీకేం కావాలో ఎంచుకోండి. మీ శిరోజాలను చక్కగా సంరక్షించుకోండి. అందంగా తీర్చిదిద్దుకోండి. చక్కని శిరోజాలంకరణలు చేసుకోండి. పదిమందిలో ప్రత్యేకంగా నిలవండి.
మూలం: బుధవారం, వార్త ఏప్రిల్ 19, 2006
వంటగదిలో కత్తిపీటలకు బదులు కత్తులను ఉపయోగించడం మొదలుపెట్టి చాలా కాలమైంది. ఒక్కో కత్తి ఒక్కొక్కందుకు ఉపయోగపడుతుంది. అది తెలుసుకుని వాడితే వంట త్వరగా అయిపోతుంది. అందుకని కొనేటప్పుడు కత్తి సైజు, ఆకారం అన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలి. కత్తుల్లో కొన్ని రకాల గురించి
ఏడు అంగుళాల పొడవుతో గట్టిగా ఉన్న బ్లేడు కత్తి చేతికి సరిపడా ఉండి కోసుకునేందుకు వీలుగా ఉంటుంది. దీన్ని బుచర్ లేదా కుక్స్ నైఫ్ అంటారు.
వంట పట్ల బాగా ఆసక్తి ఉండి రకరకాల వంటలు చేసేవాళ్ల దగ్గర డబ్ల్యుఎమెఫ్, జ్విల్లింగ్, ఎస్.డిక్, ఫెలిక్స్ వంటి జర్మన్ బ్రాండ్లు ఉండడం తప్పనిసరి.
సింగిల్ బ్లేడుతో జిగ్‌జాగ్‌గా ఉండే జపాన్ బ్రాండ్ కత్తుల ధర ఎక్కువగా ఉంటుంది. కాని వీటికి పదును బాగుంటుంది. కూరగాయలు కాని మరేవైనా కాని కోసేటప్పుడు ఇబ్బంది ఉండదు.
చిన్నగా ఉండి చివర్లో పదునుగా ఉండే క్లీవర్ నైఫ్‌ను పెద్ద పెద్ద ముక్కలు కోయడానికి ఉపయోగిస్తారు.
ఫిల్లెటింగ్ నైఫ్ బ్రెడ్ కోసుకోవడానికి పనికొస్తుంది.
మన వంటకయితే ఆప్టిమా కత్తి మంచి చాయిస్. ఎక్కువ ధర పెట్టినా ఫర్వాలేదు అనుకునే వాళ్లు ఇంపోర్టెడ్ హోటల్ ఎక్విప్‌మెంట్ రవాణా చేసే పాలిమెక్ ఇంటర్నేషనల్ బ్రాండ్ జర్మన్ కత్తులు కొనుక్కోవచ్చు.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in