www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

ఊగండి... తగ్గండి

ఉయ్యాల ఊగడాన్ని పిల్లలు ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఎంతసేపు ఊగినా బోర్ అనేది  ఉండదు వాళ్లకి. ఇంకా పైకి ఊపు అంటూ అమ్మని అడుగుతూ ఎత్తుకు వెళ్లినకొద్దీ ఆనందంతో కేరింతలు కొడుతుంటారు. ఉయ్యాల ఊగడం పసిపిల్లల ఆటగానే ఇన్నాళ్లూ భావించాం. కాని రోజూ ఉయ్యాల ఊగడం శరీర ఫిట్ నెస్ కి ఎక్సర్ సైజుగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు.

ఉయ్యాల ఊగడం పసిపిల్లల ఆట అనే అభిప్రాయానికి కాలం చెల్లింది. ఇది పెద్దలకు, పిన్నలకూ కూడా మంచి వ్యాయామం కాగలదని ఫిట్ నెస్ నిపుణులు అంటున్నారు. ఊయలను ఊబకాయ సమస్యకు పరిష్కార మార్గంగా పేరొంటున్నారు. అరగంటసేపు ఉయ్యాలలో ఊగుతూ, వంగుతూ శరీరానికి వ్యాయామం ఇస్తే కొన్ని వారాలకే ఆరోగ్యకరంగా, ఉత్సాహంగా, తేలిగ్గా తయారవుతుందిట.

ఉయ్యాల బల్ల మీద కూర్చుని ఒక కాలు ముందుకు, మరొక కాలు వెనక్కిపెట్టి ఊగాలి. పొట్టభాగాన్ని లోపలికి పోనిచ్చి తాడుకు మోచేతులను ఆన్చాలి. తాడుపట్టుకుని కొద్దిగా వెనక్కి వెళ్ళి మోచేతులతో ఒత్తిడిని ప్రయోగిస్తూ తాడు సహాయంతో ముందుకు ఊగాలి. శరీరాన్ని సరైన భంగిమలో ఉంచి ఇలా పది నిమిషాలపాటు క్రమపద్ధతిలో ఊగితే 42 కేలరీలవరకూ కరుగుతాయి. శరీర బరువునంతటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వేగంగా ఊగడంవల్ల నడుము కింది భాగం దృఢపడుతుంది. ఇలా చేసేటప్పుడు వీపుని సీదాగా పెట్టి కొద్దిగా వెనక్కి వెళ్ళి ఆ తర్వాత ముందుకు గట్టిగా ఊగాలి.

వేగంగా ఊగుతూ బాగా పైకి వెళ్లడం ఎంతో ధ్రిల్లింగ్ గా ఉండటమే కాదు దీనివల్ల శరీర కండరాలన్నిటిపైనా ఒత్తిడి బాగా పడుతుంది. ఇలా పది నిమిషాలు చేస్తే మంచి ఫలితాలు పొందుతాం. ఉయ్యాలపై సవ్య, అపసవ్యదిశల్లో ఊగితే సంభవించే శరీర కదలికలతో శరీరంలో కేలరీలు తగ్గుతాయి.

ఊగేప్పుడు వేగంగా ఎత్తుకుపోకూడదు. కళ్లు తిరిగినట్టవుతుంది. మధ్యమధ్యలో ఊగే దిశలను మార్చుతుండాలి. పరిగెత్తినపుడు కాళ్లకు ఎలాంటి వ్యాయమం అవుతుందో ఊగడం వల్ల కూడా అదే ఫలితం ఉంటుంది. ఉయ్యాలను ముంజేతులతో తోస్తూ ఊగితే పుషప్స్ చేసినట్టు అన్నమాట.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in