www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

పిల్లల ఆటలు (కొన్ని)

జంతువుల పేర్లు పేర్చడం

ఎంతమంది ఆడవచ్చు

:

 ఆరుగురు.

కావలసిన వస్తువులు

:

పేపరు అట్టలు.

ఆడే స్థలం

:

ఆరుబయట.

ఈ ఆటలో కనీసం 4 గురు పాల్గొనవచ్చు. 'ఎ' నుంచి 'జెడ్' దాకా ఇంగ్లీషు అక్షరాలను నాల్గు సెట్లుగా విడివిడిగా కార్డులపై అంటే 'ఎ' లు నాలుగు, 'బి' లు నాలుగు, 'సి' లు నాలుగు, ఇలా 'జడ్' దాకా రాయాలి. మొత్తాన్ని నేలపై కుప్పగా పోసి విజిల్ వేయాలి. వెంటనే ఆటగాళ్ళు వాటిని గబగబా ఏరి తాము పేర్చగలిగినన్ని జంతువుల పేర్లను పేర్చగలగాలి. Cow, Ant, Pig.

(ఆటగాళ్ళు వాటిని మూడు అక్షరాలకు మించకుండా ఉన్న జంతువులు పేర్లను పేర్చగలిగితే ఎక్కువ జంతువుల పేర్లు పేర్చవచ్చు.) తొందరగా ఎక్కువ పేర్లను ఎవరు పేర్చగలిగితే వారు విజేత. ఇలా సినిమా హీరోల పేర్లు, హీరోయిన్ల పేర్లు పేర్చవచ్చు, నగరాల పేర్లు, దేశాల పేర్లు పేర్చవచ్చు, దేశ నాయకుల పేర్లు పేర్చవచ్చు, శాస్త్రజ్ఞుల పేర్లు పేర్చవచ్చు, పండ్ల పేర్లు పేర్చవచ్చు. 

[ వెనుకకు ]

అక్షరాలతో ఆట

ఎంతమంది ఆడవచ్చు

:

ఇద్దరి నుంచి ఎంతమందైనా.

కావలసిన వస్తువులు

:

పేపరు, పెన్ను.

ఆడే స్థలం

:

ఆరుబయట, ఇంట్లో.

ఈ క్రింది ఖాళీలను పూరించడం ద్వారా అక్షరాలతో ఆట ఆడవచ్చు. పిల్లలకు భలే ఆనందంగా ఉంటుందో. ఇద్దరి నుంచి ఎంతమందైనా ఈ ఆటలో పాల్గొనవచ్చు.

'రా' తో

1

తగ్గింపు, మినహాయింపు

:

రా - - (3).

2

మరొకరి

:

- రా -  (3).

3

రాయితో గుర్రానికి అలంకారం

:

- రా -  (3).

'టు' తో

1

ప్రమాదం

:

 - టు (2).

2

బరువుపని

:

- టు - - (4).

3

సరాసరి

:

టు - -  (3).

'న' తో

1

తొమ్మిదిరత్నాలు

:

న - - - -  (5).

2

బరువుపని

:

-  - న (2).

3

అడ్వాన్స్

:

-  - న (2).

ఎవరు ముందుగా వాటిని పూరిస్తే వారు విజేతలు.

జవాబులు

(రా) రాయితీ, పరాయి, తురాయి.

(టు) చేటు, మోటుపని, సగటు.

(న) నవరత్నాలు, ప్రతిన, బయానా.

[ వెనుకకు ]

బొమ్మల మాయ

ఎంతమంది ఆడవచ్చు

:

నలుగురు.

కావలసిన వస్తువులు

:

ఒకేలా ఉండే రెండు బొమ్మల పేపర్స్.

ఆడే స్థలం

:

ఇంట్లో.

నాలుగు రంగుల బొమ్మలను ముక్కలుగా కట్ చేసి కుప్పగా వేయాలి. అవి సరిగ్గా జతచేయాలి. ఎవరు ముందుగా జత చేయగలరో వారు విజేత. అలాగే ఒక బొమ్మ అనుబంధంగా నాలుగు చిన్న బొమ్మలను ఉంచి వాటిని చిన్న భాగాలుగా వేరు చేయాలి. పెద్ద బొమ్మ అలాగే వుంటుంది. పెద్ద బొమ్మకు సరిపడా చిన్న బొమ్మలను కరెక్టుగా వెదికి జతచేయాలి. ఈ ఆటను ఇద్దరు ఆడవచ్చు. ఎవరు కరెక్టుగా, ముందుగా చేస్తే వారు విజేతలు. 

[ వెనుకకు ]

మూడుకాళ్ళ పరుగు

ఎంతమంది ఆడవచ్చు

:

ఎనిమిది మంది.

కావలసిన వస్తువులు

:

కర్చీఫ్‌లు - 4.

ఆడే స్థలం

:

ఆరుబయట.

ఆటగాళ్ళ వయసు

:

7 నుండి 8 సంవత్సరాల మధ్య.

ఆటగాళ్ళు జంటలుగా విడిపోయి ఒకరి భుజాలపై ఇంకొకరు చేతులు వేసి నిలబడతారు. ఒక ఆటగాడి కుడి కాలిని ఇంకొక ఆటగాడి ఎడమకాలిని కలిపి కర్చీఫ్ తో కట్టాలి. ఇలా 4 జంటలు కట్టుకొని నిలబడ్డాక 25 అడుగుల దూరంలో ఒక టార్గెట్‌ను నిర్ణయించాలి. లీడర్ విజిల్ వేశాక జంట ఆటగాళ్ళు స్పీడుగా నడవగలగాలి. అంటే ఇప్పుడు వాళ్ళు మూడు కాళ్ళతో నడుస్తారన్నమాట. ఏ జంటకూడా నేల మీద పడిపోకూడదు. పడిపోతే వారు ఓడిపోయినట్టే. ఎవరు తొందరగా టార్గెట్ చేరితే ఆ జంట విజేత.

[ వెనుకకు ]

బెలూన్స్ రేస్

ఎంతమంది ఆడవచ్చు

:

ఎంతమందైనా.

కావలసిన వస్తువులు

:

బెలూన్స్, దారం.

ఆడే స్థలం

:

ఆరుబయట.

ఈ ఆటంటే పిల్లలకు చాలా ఇష్టం. ఎంతమందైనా ఆడవచ్చు. ఎదురు ఎదురుగా పది అడుగుల దూరంలో రెండు గీతలు గీయాలి. ముందుగా ఒక్కొక్కరు రెండు బెలూన్స్ తీసుకొని అందరూ ఒక గీత మీద పెట్టాలి. అక్కడే దారం కూడా పెట్టాలి. అందరినీ పది అడుగుల దూరంలో ఇంకొక గీత మీద నుంచో బెట్టాలి. లీడర్ విజిల్ వేయగానే అందరూ పరిగెత్తి గబగబ బెలూన్‌లను చేరుకోవాలి. వాటిలో గాలిని వూది దారం కట్టాలి. మరల నిల్చున్న ప్రదేశానికి పరిగెత్తుకొని రావాలి. ఎవరు ముందుగా వస్తే వారు విజేత.

[ వెనుకకు ]

అల్లావుద్దీన్ నడక

ఎంతమంది ఆడవచ్చు

:

ఆరుగురు.

కావలసిన వస్తువులు

:

టవల్స్ లేదా గోనె సంచులు 12.

ఆడే స్థలం

:

ఆరుబయట.

పిల్లలందరికి ఒక్కొక్కరికి రెండేసి టవల్స్ లేదా గోనె సంచులు ఇవ్వాలి. 20 మీటర్ల టార్గెట్ నిర్ణయించాలి. ఆటగాళ్ళు నేల మీద కాళ్ళతో నడవకుండా  టార్గెట్‌ను  చేరాలి. అది నిబంధన. అందుకు గానూ వారు టవల్స్‌ను గాని గోనె సంచులనుగాని ఉపయోగించాలి. ముందుగా ఒక టవల్ నేల మీద పరచి దాని మీద నుంచోవాలి. టవల్ కొసదాకా నడచి రెండవ టవల్‌ను దాని ముందు పరచి, దాని మీదకు చేరుకున్నాక వెనుక ఉన్న టవల్‌ను తీసి మరల ముందుకు వేయాలి. ఇలా కాలు నేల మీద పడకుండా నడవాలి. ఎవరు ముందు టార్గెట్‌ను చేరతారో వారు విజేత. కాలు నేల మీద ఎవరు పెట్టేస్తారో వారు ఓడిపోయినట్లు.

[ వెనుకకు ]

తింగర పదాలు

ఎంతమంది ఆడవచ్చు

:

నలుగురు.

కావలసిన వస్తువులు

:

పేపరు, పెన్ను.

ఆడే స్థలం

:

ఆరుబయట.

పిల్లలు తేలికగా గుర్తుపట్టే వస్తువుల అక్షరాలు క్రమం మార్చి ఇచ్చాము. వాటిని సులభంగా పిల్లలు కనుక్కొని మరల రాయాలి.

ఉదా:

నీమంరుచి

మంచి నీరు.

కూన్నంఅర

అన్నం కూర.

లబపం - కపల

పలక - బలపము.

కపుస్తము

పుస్తకము.

చమంము

మంచము.

మానిహాసిలు

సినిమాహాలు.

వీటీ

టీవీ.

కిలుసై

సైకిలు.

ఎవరు తప్పులు లేకుండా ఎక్కువ పదాలకు సమాధానము రాయగలరో వారు విజేత. 

[ వెనుకకు ]

తెలుగు పదాల మాటలు

ఎంతమంది ఆడవచ్చు

:

నలుగురు.

ఆడే స్థలం

:

ఆరుబయటగాని, ఇంట్లోగాని.

ప్రతి ఒక్కరు ఒక పది లైన్ల మాటలు మాట్లాడాలి. అయితే నిబంధన ఏమిటంటే ఈ 10 లైన్లలో అన్నీ తెలుగు పదాలే ఉండాలి. ఒక్క ఇంగ్లీషు పదం గాని అక్షరంగాని ఉండకూడదు.

ఉదా : నేను 'కారు' కొన్నాను అనకూడదు.  కారు అన్నది ఇక్కడ ఇంగ్లీషు పదం. కారుని యంత్ర శకటం అనాలి.

ఇలా అందరిలో ఎవరు ఎక్కువ ఇంగ్లీషు పదాలు లేకుండా కేవలం తెలుగునే ఉపయోగించి మాట్లాడతారో వారు విజేతలు.

[ వెనుకకు ]

తడిమి కనిపెట్టడం

ఎంతమంది ఆడవచ్చు

:

ఎంతమందైనా.

కావలసిన వస్తువులు

:

పెన్సిలు, రుమాలు ఇలా చిన్న చిన్న వస్తువులు, ఒక సంచి.

ఆడే స్థలం

:

ఆరుబయటగాని, ఇంట్లోగాని.

ఒక సంచిలోరకరకాల వస్తువులు వేయాలి. అవి ఉంగరం, పెన్సిల్, పెన్ను, బలపం, రూపాయి బిళ్ళ, రబ్బరు, రుమాలు, టోపి, బెల్టు లాంటివి ఉంచాలి. ఆటగాళ్ళ కళ్ళకు గంతలు కట్టి సంచిలోని వస్తువు తడిమి అది ఏ వస్తువో చెప్పాలి. ఎవరు ఎక్కువ వస్తువులను సరిగ్గా చెప్పగలరో వారు విజేత.

[ వెనుకకు ]

రుచి కనుక్కోవడం

ఎంతమంది ఆడవచ్చు

:

నలుగురు.

కావలసిన వస్తువులు

:

తినుబండారాలు.

ఆడే స్థలం

:

ఆరుబయట.

స్వీట్లు, ఉప్పు, ఆపిల్ పండు, మిరపకాయ, టమోటా, చింతపండు, బత్తాయి, పంచదార, తేనె, లంవంగ, ఎండుఖర్జూర పండు మొదలగునవి ఒక పళ్ళెంలో పెట్టాలి. పిల్లల కళ్ళకి గంతలు కట్టాలి. రకరకాల రుచికరమైన పదార్థాల దగ్గరకు వారిని తీసుకురావాలి. ఇవి పిల్లలకు రుచి చూపిస్తే అవి ఏమిటో పిల్లలు చెప్పాలి. ఎవరు ఎక్కువ రుచులు సరిగ్గా చెప్పగలుగుతారో వారు విజేతలు.

[ వెనుకకు ]

లెక్కల హీరో

ఎంతమంది ఆడవచ్చు

:

ఎంతమందైనా.

కావలసిన వస్తువులు

:

పెన్సిలు, పుస్తకము.

ఆడే స్థలం

:

ఆరుబయటగాని, ఇంట్లోగాని.

ఒక గదిలో పిల్లలంతా కూర్చోవాలి. వీళ్ళకొక లీడర్ ఉండాలి. పిల్లలకు పలక బలపం లేదా పుస్తకం పెన్సిల్ ఇవ్వాలి. లీడర్ నాలుగు నెంబర్లు చెప్పగానే అవి మొత్తం కూడి ఎవరు ముందుగా చెబితే వారు విజేత అవుతారు.

ఉదా:  4256 ఈ నెంబరు లీడర్ చెప్పగానే పిల్లలు తమ పలకలు లేదా పేపర్ల పై ఇలా కూడాలి.

4+2+5+6=17

17 అని ఎవరు ముందుగా రాసి చెబితే వారు విజేత. ఇలా అరగంటసేపు 10 సార్లు పరీక్ష పెట్టి అందరిలో ఎవరు ఎక్కువసేపు తొందరగా కరెక్టు జవాబు చెబుతారో వారికి లెక్కల హీరో అని బిరుదునివ్వాలి.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in