www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

పిల్లల ఆటలు (కొన్ని)

మ్యూజికల్ మూమెంట్స్

ఎంతమంది ఆడవచ్చు

:

ఎంతమందైనా.

ఆడే స్థలం

:

 గదిలో, ఆరుబయట ఆడవచ్చు.

పోటి సమయం 

:

 2 నిమిషాలు.

కావలసిన వస్తువులు

:

 టేప్ రికార్డర్.

ఆటగాళ్ల వయస్సు

:

 5 సం|| రాల నుండి.

ఆట గాళ్ళను ఏం చెయ్యమంటే అది వాళ్ళు చెయ్యాలి. గంతులెయ్యమంటే వెయ్యాలి. చప్పట్లు కొట్టమంటే కొట్టాలి. అయితే టేప్ రికార్డర్ లోంచి మ్యూజిక్ వినిపిస్తున్నంత వరకే ఆ పని చెయ్యాలి . మ్యూజిక్ ఆగిపోగానే వాళ్ళు నిశ్చలంగా నిలవాలి. మళ్ళీ ఒంటి కాలిమీద గంతులెయ్యమనీ, పాడమనీ చెప్పి మ్యుజిక్ ఆన్ చేస్తే అది వినపడే వరకు వాళ్ళు అలా చెయ్యాలి. మ్యూజిక్ ఆన్ చేస్తే అది వినపడేవరకు వాళ్ళు అలా చెయ్యాలి. మ్యూజిక్ ఆగిపోగానే మళ్ళీ నిశ్చలంగా వుండాలి. అయితే ఆటగాళ్ళంతా మ్యూజిక్ ఆగిపోయిన వెంటనే ఆగరు. ఆ సూచనని చేస్తూనే వుంటారు. అలాంటి వాళ్ళు ఓడిపోయారు. గనుక ఆటలోంచి బయటకు తీసేసి మిగిలిన వాళ్లతో ఆటని కంటిన్యూ చెయ్యాలి. చివరకు ఎవరు మిగిలితే వాళ్లు గెలిచినట్లు.

[ వెనుకకు ]

పాస్ ది పార్సెల్

ఎంతమంది ఆడవచ్చు

:

ఎంతమందైనా.

ఆడే స్థలం

:

 గదిలో, ఆరుబయట ఆడవచ్చు.

పోటి సమయం 

:

 2 నిమిషాలు.

కావలసిన వస్తువులు

:

 చాక్లెట్ లేదా ఏదైనా బహుమతి, కాగితం, రబ్బర్, దారం, జిగురు.

ఆటగాళ్ల వయస్సు

:

 7 సం|| రాల నుండి.

ఇది బర్త్ డేలలో ఆడటానికి బావుంటుంది . చాక్లెట్ లేదా ఏదైనా బహుమతి కాని ముందు ఓ కాగితంలో చుట్టాలి. దాన్ని మళ్ళీ ఇంకో కాగితంలో  చుట్టాలి. ఇలా అనేక కాగితాలలో చుట్టి షేక్ చేయాలి. మ్యూజిక్ స్టార్ట్ అవగానే గుండ్రంగా కూర్చున్నవారు ఆ పార్శెల్ ను తమ పక్క వారికి పాస్ చేస్తూంటారు. మ్యూజిక్ ఆగగానే అది ఎవరి చేతిలో ఉంటే వారు దానికున్న ఓ కాగితాన్ని విప్పాలి. (కాగితం, రబ్బర్ బేండ్ తో కాని, దారంతో కాని , జిగురుతో కాని చుట్టవచ్చు) మళ్ళీ మ్యూజిక్ స్టార్ట్ అవగానే ఆ పార్శెల్ చేతులు మారుతూ వుంటుంది. మ్యూజిక్ ఆగగానే మొదటి కాగితం విప్పాక కింద వున్న ఇంకో కాగితం అది చేతిలో వున్నవారు విప్పుతారు. ఇలా 5-6 కాగితాలు విప్పాక ఎవరి చేతిలో ఆఖరిపొర విప్పబడితే వారికి ఆ బహుమతి/చాక్లెట్ బహుమతిగా లభిస్తుంది.

[ వెనుకకు ]

వాటర్ గేమ్

ఎంతమంది ఆడవచ్చు

:

ఎంతమందైనా.

ఆడే స్థలం

:

 గదిలో, ఆరుబయట ఆడవచ్చు.

కావలసిన వస్తువులు

:

 రెండు బక్కెట్ల నిండా నీరు, రెండు ఖాళీ  ప్లాస్టిక్  బక్కెట్లు, రెండు ప్లాస్టిక్ బాటిల్లు

ఆటగాళ్ల వయస్సు

:

 6 సం|| రాల నుండి.

రెండు పెద్ద బక్కెట్ల నిండా నీటిని వుంచాలి. ప్రక్క ప్రక్కనే వున్న ఆ రెండింటికి రెండు మీటర్లు దూరంలో అటు, ఇటూ రెండు ఖాళీ బక్కెట్లు వుంచాలి. ఆటగాళ్ళని రెండు గ్రూపులుగా విడగొట్టి ఒక్కొక్కరికి ఒక్కొ ఫ్రిజ్ లో ప్లాస్టిక్ బాటిల్ ని నీళ్ళుంచే ఇవ్వాలి. (సన్నమూతిని), 'స్టార్ట్' చెప్పగానే తమ తమ ఖాళీ బక్కెట్ల దగ్గర నిలబడ్డ పిల్లలు నీరున్న బక్కెట్ల దగ్గరకు వెళ్ళి 'ఎ ' గ్రూప్ వారు 'ఎ ' బక్కెట్లోంచి నీటిని, అలాగే 'బి 'గ్రూప్ వారు 'బి ' బక్కెట్లోంచి నీటిని సీసాల్లోకి నింపి తెచ్చి తమవైపున్న ఖాళీ బక్కెట్లోకి పోయాలి . ఎవరు ముందుగా నీరున్న బక్కెట్ ని ఖాళీ బక్కెట్లోకి నింపుతారో వారు గెలిచినట్లు.

[ వెనుకకు ]

తాబేలు రేసు

ఎంతమంది ఆడవచ్చు

:

ఎంతమందైనా.

ఆడే స్థలం

:

 గదిలో, ఆరుబయట ఆడవచ్చు.

కావలసిన వస్తువులు

:

చాక్ పీస్ , ప్లాస్టిక్ తాడు.

ఆటగాళ్ల వయస్సు

:

 7 సం|| రాల నుండి.

ఆటగాళ్ళందర్ని మోకాళ్ళు, అరచేతులమీద నించోబెట్టాలి. 'స్టార్ట్' చెప్పగానే అంతా ఫినిషింగ్ లైన్ దగ్గరకి (ఇది చాక్ పీస్ తో గీయవచ్చు, లేదా నేలమీద ప్లాస్టిక్ తాడు ఉంచవచ్చు.) ఎంత నెమ్మదిగా సాధ్యం అయితే అంత నెమ్మదిగా వెళ్ళాలి. అలా "ఆఖరుగా " ఫినిషింగ్ లైన్ చేరుకున్న వారు విజేత. కదలకుండా వున్నవారు మాత్రం ఆటలోంచి తీసేబడతారు.

[ వెనుకకు ]

టమోటా రేసు

ఎంతమంది ఆడవచ్చు

:

ఎంతమందైనా.

ఆడే స్థలం

:

 గదిలో, ఆరుబయట ఆడవచ్చు.

కావలసిన వస్తువులు

:

 "టమోటా" లేదా "బంగాళదుంప" లేదా "కోడిగుడ్డు" లేదా "బంతి".

ఆటగాళ్ల వయస్సు

:

 3 సం|| రాల నుండి.

A) పిల్లలు ఎక్కువ మంది వుంటే ఈ ఆట రక్తి కడుతుంది. పిల్లలని నేల మీద ఒకరి పక్కన మరొకర్ని కూర్చోమనాలి .వాళ్ళకి పోటీ టీంగా అదే సంఖ్య గల పిల్లల్ని వాళ్ళకి ఎదురుగా అదే పద్దతిలో కూర్చోమనాలి. అలా కూర్చున్న రెండు వరుసల్లోని పిల్లల్లో మొదట చెరో టమోటా ఇవ్వాలి. స్టార్ట్ చెప్పగానే పిల్లలు కుడినించి ఎడమకి ఆ టమోటా మారుతూ చివరకి ఆఖరిలో కూర్చున్న పిల్ల చేతికి చేరుతుంది.

రెండు టీంలలో ఎవరు ముందుగా టమోటాని మొదటి పిల్లనుంచి చివరి పిల్ల దగ్గరకి పాస్ చేయగలిగితే ఆ టీం గెలిచినట్లు అలా పాస్ చేస్తున్నప్పుడు ఓ పిల్ల చేతిలోంచి అది కిందపడితే దాన్ని ఆ పిల్ల అందుకొని తనకి ఇచ్చిన తన కుడివైపు కూర్చున్న పిల్లకి ఇవ్వాలి. తర్వాత మళ్ళీ అందుకొని పాస్ చెయ్యాలి. టమోటా చితక్కుండా, రసం కారకుండా చేరడం ముఖ్యం. పండు టమోటా బదులు పచ్చి కోడిగుడ్డుని కుడా ఈ ఆటలో ఉపయోగించవచ్చు.

B) మరీ చిన్నపిల్లలయితే బంతి లేదా బంగాళదుంప లాంటివి ఉపయోగించవచ్చు.

C) ఈ ఆటని పొడిగించాలనుకుంటే చివరకి చేరాక మళ్ళీ ఆ వస్తువుని చివరనుంచి మొదటి అమ్మాయి దాకా వెనక్కి మళ్ళీ పాస్ చేయవచ్చు అంటే రేసు టైం పెరుగుతుందన్నమాట.

[ వెనుకకు ]

సెన్సిబుల్ గేమ్

ఎంతమంది ఆడవచ్చు

:

ఎంతమందైనా.

ఆడే స్థలం

:

 గదిలో, ఆరుబయట ఆడవచ్చు.

కావలసిన వస్తువులు

:

 కాఫీ పొడి, రెండు రకాల పళ్ళముక్కలు , టీ పొడి, మట్టి, సబ్బుబిళ్ళ, ఇంకు, నిమ్మ ఆకులు, ప్లాస్టిక్, చెక్క , ఈకలు, పెన్ను, ఏనుగు బొమ్మ, కళ్ళజోడు.

ఆటగాళ్ల వయస్సు

:

 6 సం|| రాల నుండి.

ఈ ఆట ఆడటానికి మనిషి కుండే సెన్సెస్-రుచి , వాసన, స్పర్శ లని ఉపయోగించాలి . ఆటలో పాల్గొనేవారి కళ్ళకి గంతలు కట్టాలి.

1) ఇన్ స్టంట్ కాఫీ పొడి, మైదా, రెండు రకాల పళ్ళముక్కలు ఆ రోజు చేసిన పచ్చడి బీరకాయ లేదా దొండకాయ ముక్క.... ఇలా ఐదు రకాల వస్తువులని రుచి చూపించి అవేమిటో చెప్పుకోమనాలి

2) టీ పొడి, మట్టి, సబ్బుబిళ్ళ , ఇంకు , నిమ్మ ఆకులు లాంటి వస్తువులని వాసన చూపించి అవేమిటో చెప్పుకోమనాలి

3) ప్లాస్టిక్, చెక్క , ఈకలు, పెన్ను, ఏనుగు బొమ్మ, కళ్ళజోడు లాంటి వస్తువులు ముట్టుకోనిచ్చి అవేమిటో కనుక్కోమనాలి .

ఎన్ని కరక్ట్ గా కనుక్కోగలిగితే ఆటలో పాల్గొన్న వాళ్ళకి అన్ని మార్కులు ఎవరు ఎక్కువ కనుక్కోగలిగితే వాళ్ళు గెలిచినట్లు


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in