|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
పిల్లల ఆటలు (కొన్ని)
|
ఎంతమంది ఆడవచ్చు |
: |
8మంది (నలుగురు ఒక బ్యాచ్ చొప్పున). |
|
ఆడే స్థలం |
: |
గదిలో గాని, ఆరుబయట గాని. |
|
కావలసిన వస్తువులు |
: |
న్యూస్ పేపర్లు 2. |
|
ఆటగాళ్ల వయస్సు |
: |
7 నుండి 8 సం||రాలు మధ్య. |
ఈ ఆటలో రెండు టీమ్‌లను ఎంపికచేయాలి. రెండు ఒక దిన పత్రికలను (ఒకే రోజున) రెండు టీమ్‌ల ఆటగాళ్ళతో చదివించాలి. అనంతరం ఆ పేపర్లలో ఆ రోజు వచ్చిన వార్తలపై ప్రశ్నలు వేయాలి. ఏ టీమ్ సరైన సమాధానం చెపితే వారికి మార్కువస్తుంది. ఎక్కువ మార్కులు వచ్చిన వారు విజేతలు.
[ వెనుకకు ]
|
ఎంతమంది ఆడవచ్చు |
: |
ఎంతమంది అయినా. |
|
ఆడే స్థలం |
: |
ఖాళీ స్థలంలో. |
|
కావలసిన వస్తువులు |
: |
క్రింద ఇచ్చిన వస్తువులు. |
|
ఆటగాళ్ల వయస్సు |
: |
ఏ వయసు వారైనా. |
ఈ ఆటంటే భలే సరదా పిల్లలకు, గురిచూసి విసరడం అంటే పిల్లలకు చాలా ఇష్టం. చిన్న చిన్న రాళ్ళు గురిచూసి విసరడం వీరికి వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఈ ఆట ఆడదామంటే ఉరుకులు పరుగులతో ముందుకొస్తారు.
|
వేయాల్సినది |
- |
వేసేవి(వస్తువులు) |
|
బకెట్ |
- |
ఉండచుట్టిన పేపరు రోల్స్. |
|
ఖాళీ టూత్‌పౌడర్ డబ్బా |
- |
చిన్న రాళ్ళు. |
|
కూరగిన్నె |
- |
అర్థరూపాయి బిళ్ళలు. |
|
గ్లాసు |
- |
చింత పిక్కలు. |
|
ప్లాస్టిక్ డబ్బా |
- |
గోలీలు. |
ముందుగా ఎవరు అన్నీ వస్తువులను వాటికి కేటాయించిన డబ్బాలు, బకెట్‌లలో వేస్తారో వారు విజేతలు.
[ వెనుకకు ]
|
ఎంతమంది ఆడవచ్చు |
: |
ఎంతమంది అయినా. |
|
ఆడే స్థలం |
: |
గదిలో గాని, ఆరుబయట గాని. |
|
కావలసిన వస్తువులు |
: |
15 వస్తువులు, పేపరు ప్లేట్లు, కర్చీఫ్‌లు. |
|
ఆటగాళ్ల వయస్సు |
: |
ఏ వయసు వారైనా. |
ఈ గేమ్‌కి మొదట 10 మంది 15 వస్తువులను రెండు చొప్పున తీసుకోవాలి. ఒక్కొక్క పేపర్ ప్లేట్‌లో ఒక్కొక్క వస్తువు చొప్పున పెట్టి టేబుల్ మీద పెట్టి ఎరేంజ్ చేసి వాటిమీద కర్చీఫ్ కప్పి ఉంచాలి. ఇప్పుడు అన్ని వస్తువులు రెండింటిలో ఒకటి ప్లేట్స్‌లో ఉన్నాయి. మిగిలిన వాటిని ఒక బౌల్‌లో వేసి ప్రక్కన చైర్‌లో పెట్టండి. ఇప్పుడు ఒక్కొక్కరిని పిలిచి టేబుల్ దగ్గర నుంచోమనండి. వారిని కర్చీఫ్స్‌ని తీసి అన్ని వస్తువులను ఒక్కసారి చూపించి మళ్ళీ యధావిధిగా కర్చీఫ్స్ కప్పేయండి. వారు చేయవలసినది బౌల్‌లో ఒక వస్తువు తీసుకొని ఏ ప్లేటులో అయితే ఆ వస్తువు ఉందో గుర్తుంచుకొని ఆ ప్లేట్‌లో కర్చీఫ్ మీద పెట్టాలి. మీరు కర్చీఫ్ తీసి చూపించినప్పుడే వారికి గేమ్ చెప్పి గుర్తుంచుకోమని చెప్పాలి. ఇప్పుడు స్టార్ట్ చెప్పి వన్‌మినిట్‌లో కరెక్ట్ వస్తువులను కనిపెట్టి పెట్టమనండి. వన్‌మినిట్ తరువాత ఎన్ని కరెక్ట్‌గా పెట్టారో కౌంట్ చేసి వ్రాసుకోండి. అలా అందరి చేత ఆడించి ఎవరు ఎక్కువగా మెమరీలో ఉంచుకొని కరెక్ట్‌గా పెడితే వారే విన్నర్.
గమనిక: గేమ్ ఆడేటప్పుడు ఈ గేమ్‌ని ఆడేసిన వారిని మాత్రమే ప్రక్కన ఉంచాలి.
[ వెనుకకు ]
|
ఎంతమంది ఆడవచ్చు |
: |
ఎంతమంది అయినా. |
|
ఆడే స్థలం |
: |
గదిలో గాని, ఆరుబయట గాని. |
|
కావలసిన వస్తువులు |
: |
గుర్రం బొమ్మ ఉన్న పేపరు. |
|
ఆటగాళ్ల వయస్సు |
: |
ఏ వయసు వారైనా. |
ఈ గేమ్ నిర్వహించేవారు ముందుగానే ఒక పెద్ద పేపర్ మీద గుర్రం బొమ్మ గీసుకోవాలి లేదా ఏదేని ఫొటో తెచ్చి పెట్టి ఔట్‌లైన్ ట్రేస్ గీసుకొని తోక మాత్రం గీయకుండా ఉంచాలి. ఆ పేపర్‌ని గోడ మీద అతికించి ఉంచాలి. మెంబర్స్ అందరికీ ఆ బొమ్మ చూపించాలి. ఆ గోడకి స్ట్రయిట్‌గా కొంచెం దూరంలో గీత గీసి ఆ గీత మీద ఒక మెంబర్ నుంచోమని చెప్పాలి. వారి కళ్ళకి గంతలు కట్టి పెన్సిల్ ఇచ్చి వెళ్ళి గుర్రానికి తోక గీయమనాలి. ఇది కూడా గెస్సింగ్ గేమ్ అలా అందరి చేత గీయించి ఎవరైతే కరెక్ట్‌గా గీసారో వారిని విన్నర్‌గా ప్రకటించాలి. కరెక్ట్‌గా గీయలేకపోతే దగ్గరగా గీసిన వారే విన్నర్.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in