www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

హాస్య సంపద

[ వెనుకకు ]  [ ముందుకు ]

సోము : నువ్వు పిచ్చివాడివా?

రాము : నో

సోము : నీకు పిచ్చిపట్టిందా?

రాము : నో

సోము : నీకు పిచ్చి తగ్గిందా?

రాము : .............

***

తెలుసు

టీచర్ : పైనాపిల్‌ గురించి ఎవరికైనా తెలుసా?

స్టూడెంట్ : నాకు తెలుసు టీచర్. పైన్‌ అనే చెట్టుకు కాసిన యాపిల్‌ను పైనాపిల్ అంటారు.

క్యాన్సిల్

గోపి : ఒరేయ్ రాజా, నీ దగ్గర రెండు సెల్‌ఫోన్సు ఉన్నాయనుకో నాకొకటి ఇస్తావా

రాజు : అదేంట్రా అలా అడుగుతావ్‌. నా దగ్గరుంటే నీకివ్వనా ఏంటి!

గోపి : నీకు రెండు ఇళ్ళున్నాయనుకో, నాకొకటి ఇస్తావా

రాజు : ఇద్దరం కలిసి పెరిగాం, నీకు ఉండటానికి ఇల్లు లేకపోతే చూస్తూ ఊరుకుంటానా, తప్పకుండా ఇస్తాను

గోపి : నీకు రెండు కార్లున్నా కూడా ఒకటిస్తావా

రాజు : ఏరా నీకింకా నమ్మకం కలగలేదా,

గోపి : రెండు కలర్ టీవీలుంటే...

రాజు : నా దగ్గర రెండు కలర్ టీవీలున్నాయని తెలిసే అడుగుతున్నావ్ కదూ. ఈ ప్రశ్న క్యాన్సిల్

గోపి : ఆ ...!

ఇంగ్లీష్‌ రాదా!

" వాటీజ్‌ యువర్ నేమ్‌ " అడిగాడు ఇంటర్వ్యూ చేసే అధికారి.

" మేరా నామ్‌ సూరజ్ ప్రకాశ్‌ హై "

" ఇంగ్లీష్‌లో అడిగితే హిందీలో చెప్తావే. ఇంగ్లీష్‌ రాదా "

" ఎందుకు రాదు. మై నేమ్‌ ఈజ్‌ సన్‌లైట్ "

అంతే!

రవి : మీ నాన్నగారి వయసెంతరా

వాసు : నా వయసెంతో అంతే.

రవి : అదెలా

వాసు : నేను పుట్టినప్పుడే ఆయన నాన్నయ్యారు.

ఎక్కడ రాయాలి!

టీచర్ : రమేశ్‌, బోర్డుమీద యాభై ఐదు వెయ్యి

రమేశ్ : ఎలా రాయాలి టీచర్

టీచర్ : ఐదు వెయ్యి. దాని పక్కన మరో ఐదు వెయ్యి

రమేశ్‌ ఒక ఐదు వేసి ఆగిపోయాడు.

టీచర్ : ఏమైంది, ఇంకో ఐదు వెయ్యవే

రమేశ్ : ఆ ఐదుని ఈ ఐదుకు ఏ పక్కన వేయాలా అని ఆలోచిస్తున్నాను టీచర్ .

నిద్ర

నాన్న : ఇంకా నిద్రపోతావేంటి లే, తెల్లారి ఆరు గంటలకే సూర్యుడు వచ్చేశాడు.

కిట్టు : అయితే ... సాయంత్రం ఆరుకే సూర్యుడు వెళ్లి పోతున్నాడు. నేను రాత్రి తొమ్మిది గంటలకి నిద్రపోతున్నాను కదా!

చరిత్ర

టీచర్ : రామూ ... మొఘలాయిల పాలన ఎక్కడ్నుంచి మొదలై, ఎక్కడ పూర్తయింది?

రాము : 150వ పేజీలో మొదలై 200 లో ముగిసింది టీచర్.

తెలుసా?

' నాకు టెన్నిస్ గురించి అంతా తెలుసు ' కాస్త గొప్పగా చెప్పాడు చంటి వాళ్ల స్నేహితుడితో.

' ఓహో ... అయితే టెన్నిస్ బ్యాట్ నెట్‌లో ఎన్ని రంధ్రాలుంటాయో కాస్త చెప్పు?' అడిగాడా స్నేహితుడు.

సాధించా

' అమ్మా... అసాధ్యాన్ని సాధ్యం చేయడం ఎలాగో కనిపెట్టేశా! ' అంది పింకీ. ' ఎలా?' అడిగింది వాళ్లమ్మ. ' ఆ పదంలో ముందు ' అ ' తీసేస్తే సరి!'

భారమే

టీచర్ : మూడో ప్రపంచ యుద్దం మొదలైతే ఏమౌతుంది?

వెంకట్ : అమ్మో ... నాకు చాలా భయంగా ఉంది.

టీచర్ : ఎందుకు?

వెంకట్ : మన చరిత్ర పుస్తకంలో మరో చాప్టర్ పెరుగుతుంది కదా టీచర్!

దూరం

టీచర్ : రామూ ... ఇంగ్లీష్‌లో అతి పెద్ద పదం ఏదైనా చెప్పు?

రాము : SMILE

టీచర్ : ఎలా?

రాము : ఈ పదంలో MILE దూరం ఉంది కదా టీచర్!

అవును, చిత్రమే

టీచర్ : చింటూ, నీ సాక్సులు విచిత్రంగా ఉన్నాయే. ఒకటి తెలుపు, మరోటి నలుపు?

చింటూ : అవును టీచర్, ఇలాంటిదే మరో జత కూడా ఉంది నాకు.

నాకొద్దులే

భర్త ఆఫీసు నుంచి ఫోన్‌ చేశాడు.

" ఈ రోజు ఏం వండావ్ " అడిగాడు.

" విషం " చెప్పింది గయ్యాళి భార్య.

" నువ్వు తినేసి పడుకో. నేను రావటం ఆలస్యమవుతుంది ".

[ వెనుకకు ]  [ ముందుకు ]


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 24-05-2008 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in