www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

హాస్య సంపద

[ వెనుకకు ] [ ముందుకు ]

మంచితనం

స్నిగ్దను శరత్ ప్రేమిస్తున్నాడు. ఆమె పుట్టినరోజు కానుకగా ఇద్దామని ఫ్లవరిస్ట్ దగ్గరికి వెళ్ళి 21 పూలతో బొకే చేయమన్నాడు. నీకెన్ని ఏళ్ళో ఈ బొకేలో అన్ని పూలు అని రాసి, పంపాల్సిన అడ్రసు ఇచ్చి వచ్చాడు.

తెల తెలవారకముందే ఆ అందమైన బహుమతి అందుకున్న స్నిగ్ద ముఖం కోపంతో ఎర్రబారింది. ఎందుకు అంటే శరత్ రెగ్యులర్ కస్టమర్ కదా అని ఆ షాపతను అరడజను పూలు ఎక్కువేసి బొకే కట్టాడు. అదీ సంగతి!

ఫ్రీ

లక్ష్మణ్ ఓ పదేళ్ళ కర్రాడితో సెలూన్ కు వెళ్ళాడు. తను హెయిర్ కట్, డై, మాలిష్ చేయించుకున్నాడు. పిల్లాడిని క్షవరం కోసం కూర్చోబెట్టి... కటింగ్ చేయించుకుంటూ ఉండు, చాక్లెట్లు తీసుకొస్తాను అని చెప్పి డబ్బులియ్యకుండానే వెళ్ళిపోయాడు.

ఎంతసేపటికీ లక్ష్మణ్ రాకపోవడంతో బాబూ మీ నాన్న ఎక్కడికి వెళ్ళినట్లు అడిగాడు షాపతను.

ఆయన మా నాన్న కాదు చెప్పాడు పిల్లాడు.

మరి ఆయనతో ఎందుకొచ్చావు?

నీకు ఫ్రీగా కటింగ్ చేయిస్తాను అని చెప్పి ఆయనే తీసుకొచ్చాడు.

అబద్ధం

అతి వేగంగా కారునడుపుతున్న గిరిని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపాడు.

ఏదీ నీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించు కానిస్టేబుల్ కోపంగా అన్నాడు.

లేదు నిర్లక్ష్యంగా చెప్పాడు గిరి.

ఈ కారు నీదేనా?

కాదు దొంగతనం చేశాను.

దొంగతనమా ఎందుకు?

ఓ శవాన్ని పారేయడానికి.

గిరి సమాధానాలతో కానిస్టేబుల్‌కు మతిపోయింది. వెంటనే ఇన్‌స్పెక్టర్‌ను తీసుకువచ్చాడు.

డిక్కీ తెరువు? ఆర్డరు వేశాడు ఇన్‌స్పెక్టర్. అందులో శవంలేదు.

మరి లైసెన్సు లేకుండా కారెందుకు నడుపుతున్నావ్?

గిరి జేబులో నుంచి తీసి లైసెన్స్ చూపించాడు.

మరి నువ్వు ఎవరినో చంపేశావని చెప్పాడు మా కానిస్టేబుల్ విసుగ్గా అన్నాడు ఇన్‌స్పెక్టర్.

డబ్బులివ్వకపోతే అలాగే చెబుతానన్నాడు. నేను వేగంగా కారు నడిపానని కూడా చెప్పి ఉంటాడు కదా సార్ అన్నాడు గిరి.

డూప్

ఓ సినీనటుడు రాత్రంతా తాగి ఓ హొటల్లో పడుకున్నాడు. తెల్లారి అతడికి మెలకువ వచ్చేసరికి తనంతే ఒడ్డూపొడవూ ఉన్న వ్యక్తి అక్కడే ఓ కుర్చీలో కూర్చొని కనిపించాడు.

ఎవరు నువ్వు అడిగాడు నటుడు.

మీ డూప్ గా నాకు అవకాశమివ్వండి సార్ ఎంత రిస్కున్న ఫైటయినా ధైర్యంగా చేసిపెడతాను అర్థించాడా వ్యక్తి.

ఊఁ... అలాగైతే... ఇప్పుడు నువ్వు మా ఆవిడ దగ్గరికి వెళ్లి రాత్రి హొటల్లో గడిపివచ్చానని చెప్పగలవా? ప్రశ్నించాడు నటుడు.

నాకెందుకు?

బైక్ కొందామని షోరూంకు వెళ్ళాడు వెంగళప్ప.

బాగా స్పీడుగా వెళ్ళే మోడల్ చూపించు సేల్స్‌మెన్‌తో అన్నాడతను.

ఇది చూడండి సార్ పికప్ బాగుంటుంది. పెట్రోల్ ఖర్చూ తక్కువే చెప్పాడు సేల్స్‌మెన్.

ఇదేనా ఇప్పుడున్న అన్నింట్లోకి వేగవంతమైంది?

అవును సార్ ఇక్కడ పొద్దున ఐదింటికి బండెక్కితే ఏడింటికల్లా హైదరాబాదులో ఉంటారు.

అయితే ఈ బండి నాకొద్దులే.

ఏం సార్?

అంత ఉదయాన్నే హైదరాబాద్‌కు పోయే పని నాకేముంటుంది చెప్పు?

భరించలేను

మూడేళ్ళు రాగానే శశిగాడిని బడిలో వేశారు. వాడి అల్లరి భరించలేను మీ సాయం కావాలి అంటూ వాళ్ళమ్మకు స్కూల్ టీచర్ ఓ ఉత్తరం రాసింది.

దానికి వాళ్ళమ్మ ఇలా బదులిచ్చింది. ఈ మూడేళ్ళూ వాడిని నేను ఒక్కదాన్నే చూసుకున్నాను. ఎప్పుడైనా మీ సాయం అడిగానా?

నాకు తెలుసు

ఆరేళ్ళయినా బబ్లూకు నోట్లో వేలు పెట్టుకునే అలవాటు పోలేదు. ఈ పాడు అలవాటు మానలేదంటే నువ్వు బాగా లావెక్కుతావు ముందే చెబుతున్నా ఓరోజు హెచ్చరించింది వాళ్ళమ్మ.

ఆ సాయంత్రమే వాళ్ళింటికి నలుగురు స్త్రీలు వచ్చారు. అందులో ఒకావిడ గర్భిణి.

బబ్లూ ఆమె దగ్గరకు వెళ్ళి అంటీ మీరు ఏం చేశారో నాకు తెలుసు! అన్నాడు.

వాస్తవంలోకి రా

ఇద్దరు శాస్త్రవేత్తలు ఓ పరిశోధన కోసం అడవికి వెళ్ళారు. రాత్రి ఓ చోట పడుకున్నారు. హఠాత్తుగా ఇద్దరికీ అర్థరాత్రి మెలకువ వచ్చింది.

ఆకాశాన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుంది? అడిగాడు ఒకతను.

ఊఁ... ఖగోళశాస్త్రం ప్రకారం చెప్పాలంటే ఎన్ని పాలపుంతలు, ఎన్ని నక్షత్రాలు, ఎంత అద్భుతమో కదా అనిపిస్తుంది. అదే జ్యోతిషశాస్త్రం ప్రకారం రాశుల కూటములు, అరుంధతి... ఆహా అనిపిస్తుంది. ఇక వాతావరణశాస్త్రం ప్రకారం రేపు వర్షం కురిసే సూచనలు కనబడుతున్నాయి... ఇంతకీ నీకు ఏమనిపిస్తుంది?

మన టెంట్ ఎవరో ఎత్తుకు పోయారనిపిస్తుంది.

ఒకే దెబ్బకు

పేపర్లో తన అభిమాన సినీనటి పెళ్ళికి సంబంధించిన వార్త చదువుతున్నాడు ప్రకాశ్.

ఆమె చేసుకోబోయే వ్యక్తి మీద అతడికి పెద్ద సదభిప్రాయం లేదు. పక్కనే ఉన్న వాళ్లావిడతో నాకు అర్థంకాక అడుగుతాను... ఎందుకూ పనికిరాని వాళ్లకే అందమైన అమ్మాయిలు భార్యలుగా వస్తారా ఏమిటి? అన్నాడు.

ధాంక్యూ డియర్. ఎన్నాళ్లకో నిజం ఒప్పుకున్నావ్! వెంటనే అన్నదామె.

బహుమతి

డేవిడ్ నిక్కచ్చి మనిషి. ఏ ఖర్చు చేసినా దానికో ప్రయోజనం ఉండాలంటాడు. ఆఖరికి భార్యకు పుట్టినరోజు బహుమతి తెచ్చినా అలంకరణ వస్తువు తేడు. ఏ కుక్కరో, గ్రైండరో పట్టుకొస్తాడు. వాళ్ళావిడ కాపురానికొచ్చినప్పటి నుంచి తనకో నక్లెస్ కొనిపెట్టమని అడుగుతుంది. అయినా తీసుకురాలేదు. చూస్తుండగానే వాళ్ళు ముసలి వాళ్ళైపోయారు. అందుకని డేవిడ్ ఓ ఏడాది శవపేటికను బహుమతిగా తెచ్చాడు. మరో ఏడాది గడిచింది.

ఈసారైనా నాకు నెక్లెస్ కొనిపెట్టరూ అడిగింది ముసలావిడ. ఇదుగో ఇలా డబ్బులు వృథా చేయడం నాకు ఇష్టం ఉండదు. గత ఏడాది కొన్నదే నువ్వు ఇంతవరకూ వాడలేదు. విసుగ్గా అన్నాడు డేవిడ్.

వస్తాడు

భార్య సమాధి దగ్గర పుష్ప గుఛ్చం ఉంచడానికి ఓ ముసలాయన శ్మశానానికి వెళ్ళాడు. అక్కడో యువకుడు ఓ సమాధి దగ్గర బీరు సీసా పెట్టడం గమనించాడు. ఏంటి బాబు! ఇలా చేస్తున్నావ్? ఆశ్చర్యంగా అడిగాడు పెద్దాయన.

నా స్నేహితుడికి బీరు అంటే ప్రాణమండీ అందుకని

అయితే ఇది తాగడానికి నీ ఫ్రెండు బయటకి ఎప్పుడొస్తాడంటావూ... హాస్యమాడాడు వృద్ధుడు.

మీరు పెట్టిన పూల వాసన చూడ్డానికి మీ ఆవిడ వచ్చినప్పుడు టక్కున చెప్పాడు యువకుడు.

అదే శాస్తి

రైలుబోగీలో ఇద్దరు స్త్రీల మధ్య కిటికీ విషయంలో తీవ్రమైన వాగ్వాదం జరుగుతుంది.

ఇదుగో! ఆ కిటికీ తెరవడానికి వీల్లేదు. చల్లగాలికి నాకు జ్వరం వచ్చి చచ్చిపోతాను. గట్టిగా అరిచింది మోదటి మహిళ.

కిటికీ మూసి ఉంచి, ఈ ఉక్కపోతలో చావడానికి నేను సిద్ధంగా లేను అంతకంటే బిగ్గరగా చెప్పింది రెండో మహిళ.

అప్పుడే అటుగా టీసీ వచ్చాడు. వాళ్ళ గొడవంతా విని ఏమీ చేయలేక అయోమయంలో పడ్డాడాయన.

ఆ బోగీలోనే ప్రయాణిస్తున్న ఒకాయన టీసీతో ఇలా చెప్పాడు. ముందు కాసేపు కిటికీ తెరిచి పెడదాం. మొదటామె చచ్చిపోతుంది. తర్వాత మూద్దాం. రెండో ఆవిడాపోతుంది. అప్పుడు మనం ప్రశాంతంగా ప్రయాణం చేయ్యొచ్చు.

నిశ్శబ్దం

శ్రీపతి దంపతులు ఎగ్జిబిషన్‌కు వెళ్ళారు. అక్కడ ఓ చిన్న సైజు విమానం కనబడింది. దాన్ని ఎక్కుదామా లేదా అని వారు సందేహిస్తుంటే ఎవరైనా దాన్ని నడపొచ్చు. కాకపోతే చార్జి వెయ్యి రూపాయలు.

తాను అంత  పెట్టలేనని తటపటాయించాడు శ్రీపతి.

మీరు ఏ మాత్రం అరవకుండా దాన్ని మీరు నడపగలిగితే గనుక నేను డబ్బుతీసుకోను. చెప్పాడు నిర్వాహకుడు. సరేనన్నాడు శ్రీపతి.

మళ్ళీ విమానం కిందికి దిగాక... 'నిజంగా మిమ్మల్ని చూస్తుంటే అనుభవమున్న ఫైలట్ లా కనబడుతున్నారు. నేను మీ పక్కనే గాని లేకపోయుంటే మీరు ఒక్కసారి కూడా అరవలేదంటే నేను నమ్మేవాడినే కాదు' అభినందనగా అన్నాడు నిర్వాహకుడు.

నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకున్నాననుకున్నారు... మధ్యలో నా భార్య పడిపోయినప్పుడు ఇక అరిచేస్తాననుకున్నాను. గర్వంగా చెప్పాడు శ్రీపతి.

[ వెనుకకు ]  [ ముందుకు ]


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 24-05-2008 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in