Telugudanam.co.in
telugudanam.co.in

మా అనుబంధ వెబ్‌సైట్...

telugudukanam.co.in

హాస్య సంపద

[ ముందుకు ]

నిద్రాభంగం

"నాన్నా! ఈ రోజు మా ఇంగ్లీషు సార్, క్లాసు తీసుకోకుండా ఆఫీసు రూం లో హాయిగా నిద్రపోయారు."

"మరి మీరంతా ఏం చేస్తున్నారు? మీక్లాసు లీడర్‌ని తీసుకుని వెళ్ళి హెడ్‌మాష్టారు గారికి రిపోర్టు చెయ్యలేకపోయారా?"

"అదీ అయింది. ఆయన అందర్ని బాదేశాడు."

"చిత్రంగా ఉందే! ఎందుకని?"

"ఆయనకు మేమంతా నిద్రాభంగం కలిగించినందుకు."


***


జీవిత భీమ

కొడుకు : అమ్మ! నేను ఈదడానికి వెళ్ళనా?

తల్లి : వద్దు నాన్నా! ఈతరాని వాళ్ళు వెళ్ళకూడదు.

కొడుకు : మరి... డాడీకి మాత్రం వచ్చా? ఆయన ఎలా వెళ్ళారు? ప్రమాదం కాదా?

తల్లి : ఆయన అంటే... జీవిత భీమా చేసుకున్నారు.


***


రవి : మా నాన్న కింద కొన్ని వందల మంది పని చేస్తారు తెలుసా?

కృష్ణ : అలాగా? ఇంతకీ మీ నాన్న ఎక్కడ పనిచేస్తాడు?

రవి : టాప్‌ ఫ్లోర్ లో


***


“ఏరా? కిషోర్‌…నువ్వు రోజురోజుకీ మందెక్కువ కొడుతున్నావు? ఇంట్లో మి ఆవిడ నిన్ను తిట్టదా? “అని అడిగాడు

“తిట్టడం ఏంటి? ఏకంగా కొడుతుంది. ఆ దెబ్బలకు తట్టుకోలేక మళ్ళీ మందు కొడుతున్నాను" అన్నాడు కిషోర్‌ తన మిత్రునితో…


***


గురువు : నాయనా! అరగంట సేపు ధ్యానంచేశావుకదా! నీకేమనిపించింది?

శిష్యుడు : ఆహా… పరుపు, మంచం, లేకుండానే కూర్చుని కూడా ఇంత బాగా నిద్రపోవచ్చని తెలిసింది గురువుగారూ…


[ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం