www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

హాస్య సంపద

[ వెనుకకు ]  [ ముందుక ]

పెద్ద అక్షరాలు

కొత్తగా పెళ్ళయిన సినీ హీరోయిన్ తనకు విడాకులు కావాలని లాయర్ దగ్గరకు వచ్చింది. లాయర్ ఆమెను ఈవిధంగా అడిగాడు.

లాయర్: నిన్ననే మీ వివాహం అయింది. ఇంకా హానీమూన్‌కు కూడా వెళ్ళలేదు. అప్పుడే మీ మధ్య పోట్లాట జరిగిందా? విడాకులు కావాలని వచ్చారు?

హీరోయిన్: అవును, నిన్న చర్చిలో రిజిష్టర్‌లో సంతకం చేస్తూ నా కన్నా పెద్దపెద్ద అక్షరాలతో సంతకం చేశాడు నా భర్త అందుకని.

నమ్మకం

డాక్టర్ దగ్గరకు పరీక్ష చేయించుకోవడానికి వచ్చింది అమిత. డాక్టర్ పరీక్ష చేయబోతుంటే ఈవిధంగా అంది.

అమిత: ఒక్క నిమిషం డాక్టర్! బయట కూర్చున్న నా భర్తను కూడా లోపలికి పిలవండి.

డాక్టర్: ఎందుకు? మీకు నామీద నమ్మకం లేదా?

అమిత: మీమీద నమ్మకం వుంది డాక్టర్! కానీ నా భర్తమీదే లేదు.

డాక్టర్: ఎందుకు?

అమిత: బయట నా భర్త మీ నర్స్‌తో ఒంటరిగా కూర్చుని వున్నారు.

పోరాటం

కొత్తగా ఆర్మీలో చేరిన ఇద్దరు సోల్జర్స్ ఒకరినొకరు పరిచయం చేసుకొన్నారు. వారిలో ఒక వ్యక్తి రెండో వ్యక్తిని ఈవిధంగా అడిగాడు.

మొదటివ్యక్తి: నువ్వు ఆర్మీలో ఎందుకు చేరావు?

రెండోవ్యక్తి: నేను అవివాహితుడిని. నాకు పోరాటం అంటే ఇష్టం అందుకే చేరాను. మరి నువ్వు ఎందుకు చేరావు?

మొదటి వ్యక్తి: నీకు తెలుసా! నాకు వివాహం అయింది. పోరాడటం అలవాటై ఆర్మీలో చేరాను.

ఎక్కువ జీతం

ఒక ఆఫీసుకి ఇంటర్వ్యూకి వచ్చాడు సూర్య. ఇంటర్వ్యూలో జీతం గురించి చర్చ జరుగుతోంది

సూర్య: పాత ఆఫీసులో ముగ్గురు వ్యక్తుల పనిచేస్తే ఒకళ్ళ జీతమే ఇచ్చేవారు. అందుకే ఇప్పుడు ముందుగానే మిమ్మల్ని ఎక్కువ జీతం డిమాండ్ చేస్తున్నాను.

యజమాని: అలా ఎలా కుదురుతుంది. మిగిలిన ఇద్దరిని కూడా పిలువు అప్పుడు ముగ్గురికి పే చేస్తాను.

కలిసికట్టుగా

టీచర్ క్లాసులో పాఠం చెబుతూ మధ్యలో విధ్యార్థులతో ఇలా అన్నాడు.

టీచర్: మీరందరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ఉండాలి.

కొంటె విద్యార్థి: అలా వుందామనే అనుకున్నా సార్! కానీ మీరు ఒప్పుకోలేదు కదా!

టీచర్: మధ్యలో నేనేం చేశానురా?

కొంటె విద్యార్థి: మొన్న జరిగిన పరీక్షల్లో అందరం ఒకచోట కలిసికట్టుగా కూర్చుని రాస్తుంటే మీరే కదా మమ్మల్ని విడదీశారు.

తలకాయకి స్కానింగ్

"నువ్వు ఎప్పుడైనా నీ తలని స్కానింగ్ చేయించావా" అడిగాడు విష్ణు.

"మానాన్నగారు నా చిన్నప్పుడు ఒకసారి చేయించారంట. అయినా అదంతా డబ్బులు అనవసరంగా ఖర్చుచేయటమే అని నా అభిప్రాయం" చెప్పాడు ఈశ్వర్.

"అలా అంటావేంటి" ఆశ్చర్యపోయాడు విష్ణు.

"నాతలలో ఏమీలేదని తేల్చేశారు డాక్టర్లు" చెప్పాడు ఈశ్వర్.

మూఢ నమ్మకం

"నాన్న, మూఢ నమ్మకం అంటే ఏమిటి?"

"అంటే.... నువ్వు ఈ సారన్నా ఆరో తరగతి పాసవుతావనేది".

మర్డర్:

రాంబాయమ్మ: మా ఆయనతో వేగలేకుండా ఉన్నాను. ఆయనను ఈ రోజు రాత్రి చట్టానికి దొరకని పద్దతిలో హత్యచేస్తాను.

గంగాబాయమ్మ: ఎలా?

రాంబాయమ్మ: నా జుట్టుకి రంగు, మేకప్ వేసుకోకుండా వెళ్ళి ఆయన ముందు నిలబడతా! పెళ్లయిన తర్వాత ఇప్పటి వరకు నన్ను మేకప్ లేకుండా చూడలేదాయన.

ఇబ్బంది

"నా ఎదుటి బెర్త్ మీద వున్న వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు" రైల్వే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది రోజా.

వెంటనే ఒక పోలీస్ లాఠీని చేత్తో పట్టుకుని ఆ బెర్త్ దగ్గరికి వచ్చాడు.

బెర్త్ మీద కూర్చుని వున్న యువకుడిని తట్టి అడిగాడు "ఎం సార్, మీరు ఈ మేడమ్ గారిని అల్లరి పెడుతున్నారంట".

"నేను అల్లరి పెట్టడమా అసలు ఇప్పటి వరకు నేను ఆవిడ వంక కన్నెత్తి కూడా చూడ లేదండీ బాబూ" భయంతో వణుకుతూ సమాధానం ఇచ్చాడు.

"అదేనండ, అదే నన్ను ఇబ్బంది పెడుతోంది" జవాబిచ్చింది రోజా.

ఫిర్యాదు

బుడుగు: మా అమ్మతో బొత్తిగా వేగలేకుండా ఉన్నానోయ్

చింటు: ఎందుకు?

బుడుగు: నిద్ర రావడం లేదు మొర్రో అంటే రాత్రి తొమ్మిదింటికల్లా పడుకోమంటుంది. ఇంకా నిద్రొస్తుందని మొత్తుకుంటున్నా సరే పొద్దున ఆరింటికల్లా లేపుతుంది!

సంగీతం

సంగీతం మాస్టారు: లలితసంగీతం అంటే ఎవరికి ఇష్టమో చేతులెత్తండి. ఏరా రాజు నీకు ఇష్టం లేదా?

సుబ్బారావు: నాకు రాధ సంగీతం అంటే ఎక్కువ ఇష్టమండీ

టోపీ

సుబ్బారావు: రాజకీయ నాయకులు టోపి ఎందుకు పెట్టుకుంటారో నీకు తెలుసా?

అప్పారావు: తెలియదు

సుబ్బారావు: మరొకడు తన నెత్తి మీద టోపి పెట్టకుండా ఉండేందుకు!

ఏమనిపిస్తుంది?

అప్పారావు: ఎట్టకేలకు పెళ్లి చేసుకున్నావు కదా! ఇప్పుడు ఏమనిపిస్తుంది?

రంగారావు: తప్పు చేసినవాడు శిక్ష అనుభవించి తీరుతాడు అనిపిస్తుంది.

ముందే తెలుసు..

సరళ: సుబ్బూ ఇక్కడ కూర్చోవద్దు పాములుంటాయి.

సుబ్బారావు: ఈ విషయం నీకెలా తెలుసు డార్లింగ్?

సరళ: నిన్న అప్పారావుతో కలిసి వచ్చినపుడు కనిపించాయిలే!

నమ్మకం

ప్రియుడు: నా మీద నమ్మకం లేదా ప్రియా! అంత దూరంగా కూర్చున్నావు?

ప్రియురాలు: నమ్మకం లేక కాదు. నా దగ్గర ఉన్న పల్లీలు అయిపోగానే నీ దగ్గరికి వస్తానులే!

వంద

గోపి: మమ్మీ! నాకు ఈ రోజు క్లాసులో నూరు మార్కులొచ్చాయి తెలుసా?

తల్లి: గుడ్ ఇంతకీ ఏ సబ్జెక్ట్‌లో?

గోపి: మ్యాథమ్యాటిక్స్‌లో 45, నేచురల్ సైన్స్‌లో 55 మొత్తం కలిపి వంద మార్కులొచ్చాయి.

డిన్నర్

అంకుల్: పాపా! మీ నాన్నగారు ఏం చేస్తున్నారు?

పాప: డిన్నర్ చేస్తున్నారు అంకుల్.

అంకుల్: తప్పమ్మా. డిన్నర్ అనకూడదు. ఉదయం కదా బ్రేక్‌ఫాస్ట్ అనాలి.

పాప: ఆ సంగతి నాకు తెలుసు. మా నాన్నగారు రాత్రి అన్నమే ఇప్పుడు తింటున్నారు. అందుకే అలా అన్నాను!

విచారణ

జడ్జి: హత్య జరిగిన స్థలానికి ఎంత దూరంలో ఉన్నావు?

రాజయ్య: పది అడుగుల రెండు అంగుళాలండి.

జడ్జి: అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు?

రాజయ్య: తర్వాత ఏ వెదవయినా అడగవచ్చునని ముందుగానే కొలిచానండి?

ఎంతకాలం?

ప్రేమికురాలు: రాజూ! ఇలా మనమిద్దరం ఎంతకాలం ప్రేమించుకుంటూ ఉంటాం.

ప్రేమికుడు: నాకు పెళ్ళయ్యేంత వరకూ..

అసలు విషయం

తండ్రి: ఈ రోజు న్యూస్ పేపర్ వచ్చిందా?

కొడుకు: వచ్చింది నాన్నా!

తండ్రి: ఏది? ఎక్కడ పెట్టావు?

కొడుకు: పేపర్‌లో వార్తలన్నీ వేడి వేడిగా ఉన్నాయి. అందుకే ఫ్రిజ్‌లో పెట్టాను!

ఉరి కాదు

అప్పుడప్పుడే దారికొస్తున్న ఓ పదిమంది పిచ్చివాళ్ళని షికారుకు తీసుకువచ్చాడు డాక్టర్ గారు. హఠాత్తుగా ఒకడు కాలు జారి కాలువలో పడ్డాడు. ఇంకో పిచ్చోడు వెంటనే దూకి అతన్ని కాపాడి పైకి తీసుకు వచ్చాడు.

'నువ్వు ఒక ప్రాణాన్ని కాపాడావు అంటే నీకు విలువలు తెలిశాయి. త్వరలో నిన్ను విడుదల చేస్తాను' అని మెచ్చుకోలుగా అన్నాడు డాక్టర్.

మర్నాడు డాక్టర్ ఆందోళనగా సుబ్బారావు దగ్గరకు వచ్చి 'సుబ్బారావు నిన్న నువ్వు కాపాడిన వాడు ఉరేసుకొని చచ్చిపోయాడు. నీ సాహసం వృధా అయిపోయింది' అని చెప్పాడు.

సుబ్బారావు నవ్వి 'భలేవారండీ ఉరి కాదు పాడు కాదు. నిన్న నీళ్ళల్లో తడిశాడు కదాని ఎండబెట్టడానికి నేనే వాడిని దూలానికి వేళ్ళాడగట్టా' అన్నాడు తాపీగ.

తెలుసు

టీచర్: అరటిపండు గురించి నీకేమైనా తెలుసా?

స్టూడెంట్: తింటే బలపడతాం. తొక్కితే జారిపడతాం.

పెళ్లి యోగం

జ్యోతిష్కుడు: అద్భుగంగా ఉందయ్యా నీ భవిష్యత్. అబ్ధుల్ కలాం, వాజ్‌పాయ్ అంతటి మహానుభావుడివి అవుతావు.

రాజు: అయ్య బాబోయ్! నాకు ఈ జన్మలో పెళ్లియోగం లేదన్నమాట!

సూక్తి

టీచర్: బ్లాక్‌బోర్డ్ తుడుస్తూ రామూ ఏదైనా ఒక సూక్తి చెప్పరా?

స్టూడెంట్: 'చెరపకురా చెడేవు'.

రెండు నిమిషాలు

పి.ఏ: బాస్ మీ ఆవిడ గారి నుంచి ఫోన్

బాస్: రెండు నిమిషాలు పట్టుకొని ఆ తరువాత ఇవ్వు

పి.ఏ: ఎందుకు సార్?

బాస్: ప్రారంభంలో రెండు నిమిషాలు తిట్టేసి గాని మా ఆవిడ అసలు విషయం ఏమిటో చెప్పదయ్యా!

శబ్దం

రాజు: అదేంటి? మీ ఇంట్లో అంత శబ్దం వస్తుంది?

గోపి: మా మమ్మి మా డాడి చొక్కాను ఉతుకుతుంది.

రాజు: చొక్కా ఉతికితే మాత్రం అంత శబ్దమా?

గోపి: ఆ చొక్కాలో మా డాడి ఉన్నాడులే!

చిటికెలో పని

పేషెంట్: మీరిచ్చిన ట్యాబ్లెట్లతో నా ఒంట్లోని నొప్పులన్నీ ఆగిపోయాయండి.

డాక్టర్: చాలా సంతోషం.

పేషెంట్: కాని శ్వాస కొంచెం ఇబ్బంది.

డాక్టర్: అదెంత పని. ఇన్ని నొప్పులు ఆపగలిగిన వాడిని నీ శ్వాస ఆపలేనా!

సరదా కోసం

టీచర్: రవీ! సరదా కోసం కొందరు కుక్కలను, పిల్లులను, పావురాలను పెంచుతూ ఉంటారు. మరి మీ ఇంట్లో వాళ్లు ఏం పెంచుతున్నారు?

స్టూడెంట్: మా నాన్నగారు మీసాలు, మా తాతయ్య గడ్డం, మా అక్కయ్య గోళ్లు, మా అన్నయ్య జులపాలు పెంచుతున్నారండి.

అసలు విషయం

జడ్జి: నువ్వేం దొంగతనం చేశావు?

దొంగ: రెండు మీటర్ల వైర్ సార్!

జడ్జి: ఇంత చిన్న విషయానికి నిన్ను అరెస్ట్ చేశారా?

దొంగ: ఆ వైర్ చివర ఒక కలర్ టీవి ఉంది సార్

ఎక్కడ?

టీచర్: రవి! గోదావరి ఎక్కడ పుట్టిందో చెప్పు?

స్టూడెంట్: మా ఇంట్లోనే పుట్టింది సార్!

టీచర్: మీ ఇంట్లో పుట్టడం ఏమిటిరా?

స్టూడెంట్: అవును సార్. మా చెల్లి గోదావరి మా ఇంట్లోనే పుట్టింది.

కారణం

సుబ్బలక్ష్మి: ఏమే సుగుణా మీ ఇంట్లో బల్లలన్నీ విరిగి ఉన్నాయేమిటి?

సుగుణ: ఏమి చెప్పమంటావే సుబ్బు. మా ఆయన ప్రతి విషయాన్ని బల్లగుద్ది మరీ చెబుతాడు.

రెక్కల కష్టం

భర్త: ఇందాకటి నుంచి నా చేత పప్పు రుబ్బిస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు లోపల?

భార్య: ఏం చేస్తున్నానా నా రెక్కల కష్టంతో నాలుగు మెతుకులు తింటున్నాను.

ఎత్తు

సుబ్బారావు: అప్పారావ్! నేను ఇంతకు ముందు రాసిన నవలలన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు రాసిన నవలలన్నీ ఒక ఎత్తు తెలుసా?

అప్పారావు: ఏమిటోయ్! అంత బాగుందేమిటి?

సుబ్బారావు: అలా కాదు. అవన్నీ కలిసి రెండు కేజీలైతే ఇదొక్కటే రెండు కేజీలని అర్ధం.

దురదృష్టం

వెంకట్రావ్: అదృష్టవంతుడివిరా నీకు చెముడు. మీ ఆవిడ తిట్టినా వినబడదు!

సుబ్బారావు: అదృష్టమా పాడా! తను తిట్టే తిట్లు నాకు వినబడడం లేదని తంతుందిరా.

 

సుబ్బారావు స్కూటర్ పక్కింటి అన్నపూర్ణ పిల్లి మీదుగా వెళ్లింది. పిల్లి చనిపోయింది. స్కూటర్ ఆపిన సుబ్బారావు భయం భయంగా అన్నపూర్ణ దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు.

'సారీ మేడమ్. నా వల్ల మీ పిల్లి చనిపోయింది. మీ కోసం నేనేమైనా చేయగలనా?

'నువ్వు మా ఇంట్లో ఎలకలను పట్టగలవా?' అని కోపంగా అడిగింది అన్నపూర్ణ.

 

కొడుకు: అమ్మా, నేను గోడకు ఉన్న నిచ్చెనను కిందికి లాగాను.

తల్లి: ఈ విషయాన్ని మీ నాన్నగారికి చెప్పు.

కొడుకు: ఈ విషయం నాన్నగారికి ముందే తెలుసు. ఆయన కప్పుకు వేలాడుతున్నారు.

 

ముగ్గురు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటున్నారు.

మొదటి స్నేహితుడు: నేను రోజూ మాంసం తింటాను. అందుకే బలంగా ఉంటాను.

రెండవ స్నేహితుడు: నేను రోజూ చేపలు తింటాను. అందుకే స్విమ్మింగ్ బాగా చేస్తాను.

మూడవ స్నేహితుడు: నేను చాలా దురదృష్టవంతున్ని రోజూ గుడ్లు తింటాను. కాని ఒక్క గుడ్డు కూడా ఎప్పుడూ పెట్టలేకపోయాను.

 

టీచర్: రాజూ మీ తాతగారు పొద్దున ఏంచేస్తారు?

రాజు: మూడు కిలోమీటర్లు జాగింగ్ చేయడానికి బయలుదేరుతారు.

టీచర్: మరి మధ్యాహ్నం ఏం చేస్తారు?

రాజు: చివరి కిలోమీటర్‌కి చేరుకుంటారు!

 

టీచర్: రామూ ముంబాయి దూరమా? చంద్రుడు దూరమా?

రాము: ముంబాయి!

టీచర్: అదెలా?

రాము: చంద్రుడు మనకు కనిపిస్తాడు. ముంబాయి కనిపించదు కదా!

 

కస్టమర్: ఈ మేక ధర ఎంత?

గొర్రెలకాపరి: 500 రూపాయలు

కస్టమర్: (ఇంకో దానివంక చూపిస్తూ) దాని ధర ఎంత?

గొర్రెలకాపరి: 600 రూపాయలు!

కస్టమర్: అదేమిటి? రెండో మేక మొదటి మేక కంటే చిన్నగా ఉంది కదా?

గొర్రెలకాపరి: నిజమే కాని రెండో మేక నా వందరూపాయల నోటును నమిలి మింగేసింది!

 

ఒక పిల్లాడు వేగంగా పోలీస్ స్టేషన్‌కు పరుగెత్తుకు వెళ్ళాడు

పిల్లవాడు: సార్, వెంటనే మా ఇంటికి రావాలి. మా నాన్న, సుబ్బారావు అనే పొరిగింటాయనతో రెండు గంటల నుంచి పోట్లాడుతున్నాడు.

ఇన్‌స్పెక్టర్: వెంటనే వస్తున్నాను. రెండు గంటల నుంచి పోట్లాడుతున్నారని చెబుతున్నావు మరి వెంటనే నా దగ్గరకు ఎందుకు రాలేదు?

పిల్లవాడు: మొదట మా నాన్నే సుబ్బారావును చితకబాదాడు. అందుకే రాలేదు. కాని ఇప్పుడు సుబ్బారావే మా నాన్నను చితకబాదుతున్నాడు. అందుకే పరుగెత్తుకు వచ్చాను!

 

పొరుగు వాడు: మీ మృదంగాన్ని కాస్త ఇవ్వాళ రాత్రికి ఇస్తారా?

మృదంగ విద్వాంసుడు:  అరే మీకు కూడా మృదంగం వాయించడం తెలుసా? ఎప్పుడూ చెప్పలేదేం

పొరుగువాడు: అదేం కాదు. ఇవ్వాళ రాత్రయినా ప్రశాంతంగా పడుకుందామని!

 

సుబ్బమ్మగారు అప్పుడే బస్సు ఎక్కారు. ఆ బస్సులో ఒక్క సీటు తప్ప అన్ని సీట్లు నిండిపోయాయి. ఖాళీగా ఉన్న సీట్లో కూర్చుండిపోయారు ఆవిడ. ఇంతలో ఒకాయన ఆమెతో తగాదాకు దిగాడు.

సుబ్బమ్మ: నేను ఈ సీటు ఖాళీ చేయాలా ఎందుకు?

వ్యక్తి: నాకు సీటు ఇవ్వక పోతే ఈ బస్సు ఇంచ్ కూడా కదలదు!

సుబ్బమ్మ: ఏం బెదిరిస్తున్నావా? నువ్వేమయినా రౌడీననుకుంటున్నావా? వి.ఐ.పిని అనుకుంటున్నావా?

వ్యక్తి: నేను ఈ బస్సుకు డ్రైవర్‌ను. మీరు కూర్చున్నది నా సీటు!

 

లింగరాజు ఇంటర్వూకు వెళ్లాడు.

ఆఫీసర్: నేను నీ చెవినొకదాన్ని కోసేస్తే ఏం జరుగుతుందో చెప్పగలవా?

లింగరాజు: నేను సరిగా వినలేను!

అఫీసర్: మరి రెండో చెవిని కోసేస్తే?

లింగరాజు: నేను సరిగా చూడలేను!

ఆఫీసర్: చెవికి, చూపుకి ఏమిటి సంబంధం?

లింగరాజు: మరి రెండు చెవులు కోసేస్తే కళ్లద్దాలు ఎలా పెట్టుకోగలను?

 

కొడుకు: నేను పరీక్ష పాసైతే ఏమిస్తావు డాడీ?

తండ్రి: సైకిల్ కొనిస్తాను!

కొడుకు: ఒకవేళ పాస్ కాకపోతే

తండ్రి: రిక్షా కొనిస్తాను!

 

తలమీద చాలా తక్కువ వెంట్రుకలు ఉన్న ఒకాయన 'హేర్ కటింగ్' చేసుకోవడానికి సెలూన్‌కి వచ్చాడు.

కస్టమర్: ఏమిటీ హేర్‌కటింగ్‌కు 20 రూపాయలా?

బార్బర్: అవును. హేర్ కటింగ్ చేయడానికి పది రూపాయలైతే. మరో పది రూపాయలు నీ తలమీద వెంట్రుకలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టడానికి!

 

ఒక డైరెక్టర్ హీరోతో ఇలా అంటున్నాడు.

'ఈ సీన్‌లో నువ్వు పది అంతస్థుల బిల్డింగ్ మీది నుంచి దూకాలి'

హీరో: నేనెలా దూకగలను? అలా చేస్తే వెంటనే చనిపోవడం ఖాయం!

డైరెక్టర్: ఫరవాలేదు. మన సినిమాలో ఇదే ఆఖరి సీన్!

 

క్రిస్మమస్ పండుగకు కొన్ని రోజుల ముందు ఒక దొంగ పట్టుబడ్డాడు.

జడ్జి: నిన్ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు?

దొంగ: అబ్బే! ఏం లేదు సార్. క్రిస్మమస్‌కు రెండు రోజుల ముందు షాపింగ్‌కు వెళ్లాను.

జడ్జి: షాపింగ్‌కు వెళ్లడం తప్పు కాదు కదా! మరి పోలిసులు ఎందుకు అరెస్ట్ చేశారు?

దొంగ: ఓపెన్ కావడానికి అయిదారు గంటలకు ముందుగానే  షాప్‌లోకి వెళ్లాను సార్! అందుకే అరెస్ట్ చేశారు.

 

ఇన్‌స్పెక్టర్: నువ్వు దొంగను ఎందుకు పట్టుకోలేక పోయావు?

కానిస్టేబుల్: సారీ సార్. కాని నేను అతని ఫింగర్ ప్రింట్స్‌ను సంపాదించగలిగాను.

ఇన్‌స్పెక్టర్: ఎక్కడ?

కానిస్టేబుల్: నా చెంప పైన!

 

రాము: ఈరోజు స్కూల్‌కి వెళ్ళబుద్ది కాకపోవడంతో టాస్ వేసుకున్నాను. బొమ్మ పడితే స్కూల్‌కి వెళ్లాలని, బొరుసు పడితే సినిమాకు వెళ్లాలనుకున్నాను.

రాజు: మరి బొమ్మ పడిందా? బొరుసా?

రాము: బొరుసే పడింది. అఫ్‌కోర్స్ పదిసార్లు టాస్ వేసాకగాని బొరుసు పడలేదనుకో!

 

టీచర్: ఈ ప్రపంచంలో అత్యంత వింతైన విషయం ఏమిటో ఎవరైనా చెప్పగలరా?

రాజు: సార్ నేను చెబుతాను. నల్లని బర్రె తెల్లని పాలు ఇవ్వడం!

 

కోతలరాయుడు: గత వారం నేను అడవికి వెళ్ళినప్పుడు ఒక పులి నాకు ఎదురయింది తెలుసా

రాము: మరి నిన్ను నువ్వు ఎలా రక్షించుకున్నావు?

కోతలరాయుడు: 'నువ్వు బట్టలు వేసుకోలేదు. షేమ్ షేమ్ పప్పి షేమ్' అని అరిచాను. ఇక అంతే అది సిగ్గుతో పారిపోయింది!

 

బంటి: 'ఫోర్డ్' అంటే ఏమిటి?

బుడుగు: అదొక కారు పేరు!

బంటి: వెరీగుడ్. మరి 'ఆక్స్‌ఫోర్డ్ ' అంటే?

బుడుగు: స్టుపిడ్. ఆ మాత్రం తెలియాదా? అదొక ఎడ్లబండి పేరు!

 

సుబ్బారావు: ఒక క్యాలెండర్ కావాలండీ

దుకాణదారుడు: ఎలాంటి క్యాలెండర్ కావాలండీ?

సుబ్బారావు: బాగా సెలవులు ఉన్న క్యాలెండర్ కావాలండీ!

 

చిన్ని: నీ గొడుగుకు రంద్రం చేసావెందుకురా?

బన్ని: మరి వర్షం తగ్గిందో లేదో ఎలా తెలుస్తుంది!

 

అమ్మ: నీ హ్యాండ్ రైటింగ్ ఏ మాత్రం బాగాలేదు. ఇలా అయితే నువ్వు భవిష్యత్‌లో ఏదీ కాలేవురా!

కొడుకు: డోన్ట్ వరి మమ్మీ. భవిష్యత్‌లో నేను టైపిస్ట్‌ను అవుతాను.

 

మిస్టర్ సుబ్బారావు: ఏమేం షాపింగ్ చేశావు?

మిసెస్ సుబ్బారావు: పెద్దోడికి బట్టలు, చిన్నోడికి బూట్లు, అమ్మాయికి గాజులు, పని అమ్మాయికి చీర తెచ్చాను

మిస్టర్ సుబ్బారావు: మరి నా కోసం ఏం తెచ్చావు?

మిసెస్ సుబ్బారావు: 5000 రూపాయల బిల్ తెచ్చాను.

 

ఒకాయన ఆత్రంగా డాక్టర్ గారికి ఫోన్ చేశాడు.

'సార్ మా అబ్బాయి నా పెన్ను మింగాడు. ఇప్పుడేం చేయాలి?'

'ఫరవాలేదు. నేను వచ్చేదాకా పెన్సిల్‌తో రాస్తూ ఉండండి' అన్నాడు డాక్టర్.

 

వెంకట్రావు: డబ్బు ఎలా సంపాదిస్తుంటారండీ మీరు?

సుబ్బారావు: ఆ ఏముంది బాగా రాస్తుంటాను!

వెంకట్రావు: అంటే మీరు రచయిత అన్నమాట. కథలు రాస్తుంటారా? నవలలు రాస్తుంటారా?

సుబ్బారావు: కథలు లేవు కాకరకాయలు లేవు. డబ్బు పంపించమని మా నాన్నకు ఉత్తరాలు రాస్తుంటాను!

 

వేగంగా పరిగెత్తుతున్న ఒక చీమను మరొక చీమ ఇలా పలకరించింది.

మొదటి చీమ: ఏమిటి? హడవిడిగా వెళుతున్నావు?

రెండో చీమ: ఏక్సిడెంట్‌లో ఏనుగు గాయపడిందంట. బ్లడ్‌డొనేట్ చేయడానికి వెళుతున్నాను.

 

మొదటి పిచ్చివాడు: నీకో రహస్యం చెబుతాను విను. ఈ ప్రపంచాన్ని అమ్మేయాలని అనుకుంటున్నాను!

రెండవ పిచ్చివాడు: సారీ మిత్రమా! ఇప్పట్లో కొనే ఉద్దేశం నాకు లేదు.

 [ వెనుకకు ]  [ ముందుక ]


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 24-05-2008 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in