telugudanam.co.in

మా అనుబంధ వెబ్‌సైట్...

telugudukanam.co.in

పాడవోయి భారతీయుడా

పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతికా

నేడే స్వాతంత్ర్యదినం - వీరుల త్యాగఫలం ||2||

నేడే నవోదయం - నేడే ఆనందం ||పాడవోయి||

స్వాతంత్ర్యం వచ్చెనని సభలే చేసి సంబర పడగానే సరిపోదోయీ ||2||

సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయ మనుకుంటే పొరపాటోయి

ఆగవోయి భారతీయుడా కదలి సాగవోయి ప్రగతి దారులా ||ఆగవోయి||

ఆకాశం అందుకునే ధరలొక వైపు అదుపు లేని నిరుద్యోగు లింకొక వైపు ||2||

అవినీతి బంధుప్రీతి చీకటి బజారు అలుముకొన్న నీ దేశం ఎటు దిగజారు

కాంచవోయి నేటి దుస్ధితి ఎదిరించవోయి ఈ పరిస్ధితి ||కాంచవోయి||

పదవీ వ్యామోహాలు, కులమత బేధాలు, భాషా ద్వేషాలూ చెలరేగేనేడు ||2||

ప్రతి మనిషి మరి యొకని దోచుకొనే వాడే తన సౌక్యం, తన స్వార్ధం చూసుకునేవాడే ||పాడవోయి||

నవ సమాజ నిర్మాణమే నీ ధ్యేయం సకల జనుల సౌభాగ్యమే నీ లక్ష్యం ||2||

ఏక దీక్షతో గమ్యం చేరిన వాడే లోకానికి మన భారతదేశం

అందించునులే శుభ సందేశం పాడవోయి భారతీయుడా!!

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం