|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
లాలి పాటలు (కొన్ని)
చందమామ రావే - జాబిల్లి రావే!
బండిమీద రావే - బంతి పూలు తేవే
పల్లకిలో రావే - పంచదార తేవే
సైకిలెక్కిరావే - చాక్లెట్లు తేవే
పడవమీద రావే - పట్టు తేనె తేవే
మారుతిలో రావే - మంచి బుక్సు తేవే
పెందలాడే రావే - పాలు పెరుగు తేవే
మంచి మనసుతో రావే - ముద్దులిచ్చిపోవే
అన్నియును తేవే - మా అబ్బాయికీయవే
తారంగం తారంగం - తాండవ కృష్ణా తారంగం
తారంగం తారంగం - తాండవ కృష్ణా తారంగం
అల్లరి కృష్ణా తారంగం - పిల్లల కీష్ణా తారంగం
ముద్దుల కీష్ణా తారంగం - మురిపాల కృష్ణా తారంగం
మాధవ కృష్ణా తారంగం - యశోధకృష్ణా తారంగం
వేణునాధా తారంగం - వెంకట రమణా తారంగం
రాధా కృష్ణా తారంగం - రమణీయ కీష్ణా తారంగం
గోపాల కృష్ణా తారంగం - గోకుల నాధ తారంగం
వెన్నల దొంగ తారంగం - చిన్ని కృష్ణా తారాంగం
చిన్మయ రూపా తారంగం - చిద్విలాస తారంగం
విశ్వమంతయు తారంగం - నీవేనయ్యా తారంగం
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in