|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
పిల్లల పాటలు (కొన్ని)
తప్పెట్లోయ్ తాళాలోయ్
దేవుడి గుళ్ళో బాజాలోయ్
పప్పు బెల్లం దేవుడికోయ్
పాలు నెయ్యి పాపడికోయ్.
పిల్లలం బడిపిల్లలం
తెల్లని మల్లెలపూవులం
బాగుగ ఆటలు ఆడెదం
చక్కగా చదువులు చదివెదం
గురువులనెంతో కొలిచెదం
జ్ఞానమునెంతో నేర్చెదం
నీతిగ మేము నడిచెదం
జాతికి వన్నెను తెచ్చెదం.
తెల్లవారక ముందె నిదుర లేవాలి
తెల్లగా మీ పండ్లు తోము కోవాలి
చలియనక గిలియనక స్నానాలు చేయాలి
చలువ బట్టలు తీసి వేసుకోవాలి
అమ్మ పెట్టిన తిండి ఆరగించాలి
చక్కగా బడికెళ్ళి చదువుకోవాలి.
చిట్టి చిలకమ్మ
అమ్మ కొట్టిందా?
తోట కెళ్ళావా?
పండు తెచ్చావా?
గూట్లో పెట్టావా?
గుటుక్కున మింగావా?
ఒప్పులకుప్పా ఒయ్యారి భామ
మినపా పప్పు మెంతీ పిండి
తాటీ బెల్లం తవ్వెడు నేయి
గుప్పెడు తింటే కులుకూలాడి
నడుమ గట్టె నామాటె చిట్టీ
దూదూ పుల్ల దురాయ్ పుల్ల
చూడకుండా జాడా తీయ్
ఊదకుండా పుల్లా తీయ్
దాగుడుమూత దండాకోర్
పిల్లీ వచ్చే ఎలుకా భద్రం
ఎక్కడి దొంగలక్కడే గప్ చిప్
చెన్నాపట్నం - చెరుకూముక్క
నీకో ముక్క - నాకో ముక్క
భీమునిపట్నం - బిందెల జోడు
నీకో బిందె - నాకో బిందె
కాశీపట్నం - కాసుల పేరు
నీకో కాసు - నాకోకాసు
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in