|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
పిల్లల పాటలు (కొన్ని)
పలక నీది నల్లన
పైన రాతి తెల్లన
అ ఆ ఇ ఈ రాశారు
అమ్మ ముందు పెట్టారు
అమ్మ లడ్డు ఇచ్చింది.
ఆనందంగా తిన్నారు.
[ వెనుకకు ]
ఒకటి ఒకటి ఒప్పులకుప్ప
రెండు రెండు రెక్కల పక్షి
మూడు మూడు ముక్కాలి పీట
నాలుగు నాలుగు మా ఆవు కాళ్ళు
అయిదు అయిదు నా చేతి వేళ్ళు.
[ వెనుకకు ]
అమ్మకు జేజే
నాన్నకు జేజే
బంగరు భారత భూమికి జేజే.
చదువులు నేర్పే గురువుకు జేజే.
[ వెనుకకు ]
చుక్ చుక్ రైలు వస్తోంది.
దూరం దూరం జరగండి.
ఆగగానే ఎక్కండి.
జోజో పాపా ఏడవకు
నాన్నగారు వస్తారు
లడ్డు మిఠాయి తెస్తారు
నీకు నాకు ఇస్తారు.
[ వెనుకకు ]
ఇళ్ళల్లోకల్ల ఏ ఇల్లు మేలు
శ్రీ లక్ష్మి నివసించు మా ఇల్లు మేలు
వీధులలో కెల్ల ఏ వీధి మేలు?
విద్వాంసులున్నట్టి మా వీధి మేలు
అరుగుల్లోకెల్ల ఏ అరుగు మేలు?
పండితులు కూర్చునే మా అరుగు మేలు
తోటలలోకెల్ల ఏ తోట మేలు?
మామిడి చెట్లున్న మా తోట మేలు.
[ వెనుకకు ]
గంధం మెడకు పూసుకొని
పసుపు కుంకుమ రాసుకొని
కంటికి కాటుక పెట్టుకొని
ఆడవే ఆడవే అమ్మణ్ణి
పువ్వులు తలలో ముడుచుకొని
తిలకం నుదుట దిద్దుకొని
బుగ్గను చుక్కా పెట్టుకొని
ఆడవే ఆడవే అమ్మణ్ణి
[ వెనుకకు ]
పక్షులు పక్షులు - రంగుల పక్షులు
పూవులు పూవులు - హంగుల పూవులు
బాలల ఊహలు - రంగుల పక్షులు
బాలల ఊసులు - హంగుల పూవులు
నక్షత్రాలు నక్షత్రాలు - మెరిసే నక్షత్రాలు
బాలల కన్నులు - విరిసే పువ్వులు
బాలల పన్నులు - మెరిసే నక్షత్రాలు
[ వెనుకకు ]
మబ్బులోయ్ మబ్బులు!
ఎండవేడిమికి మబ్బులు
నీటి ఆవిరితో మబ్బులు
నింగికి ఎగసే మబ్బులు
నల్లగ మారిన మబ్బులు
మెల్లగ తెరిగే మబ్బులు
చల్లని గాలికి మబ్బులు
చిటపట చినుకుల మబ్బులు
వానలు కురిసే మబ్బులు
చెరువులు నింపే మబ్బులు
పంటలనిచ్చే మబ్బులు
పొట్టలనింపే మబ్బులు
[ వెనుకకు ]
పండ్లండీ పండ్లు!
సీతాఫలం! రామాఫలం
నాగపూరు కమలాలు
సిమ్‌లా ఆపిల్స్
మజా మజా మామిడి పండ్లు
బెజవాడ జామపండ్లు
రాజమండ్రి రేగుపండ్లు
బిలాస్‌పూర్ బొప్పాయిలు
తాటిపూడి సపోటాలు
దబ్బ, నారింజ పండ్లు
నిమ్మ, దనిమ్మ పండ్లు
అందరు మెచ్చు అరటిపండ్లు
మా అంగడిలో దొరుకుచుండు
విటమిన్లు ఉండే పండ్లు
ఆరోగ్యమిచ్చు పండ్లు!
[ వెనుకకు ]
అడవిలోన తిరిగినాము
తేనె మేము తెచ్చినాము
చెట్టుచెట్టు వెదకినాము
పూలు మేము తెచ్చినాము
ఆటనేర్చి, పాటనేర్చి
ఆడ, పాడ వచ్చినాము
తీపి మనసు కలవారికి
తేనె మేము పంచుతాము
న్యాయబుద్ధి కలవారికి
పూలమాల వేసెదము
మీరు రండి చూడరండి
ఆడుదాము, పాడుదాము
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in