|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
పిల్లల పాటలు (కొన్ని)
వచ్చిపోవే, వచ్చిపోవే
పిచ్చుకమ్మా వచ్చిపోవే
కొయ్య ముక్కలు గూడు చేశా
రేకు ముక్కను తలుపు చేశా
మెత్త మెత్తని ఈకలెన్నో
గూటి నిండా పరచి ఉంచా.
గ్రుడ్ల నిక్కడ పెట్టుకుంటే
పొదిగి పిల్లల చేసుకుంటే
కాకి పోరూ గ్రద్ద పోరూ
పిల్లి పోరూ ఉండ వింకా
ఈగ నైనా వాల నీయను
దోమనైనా దూర నీయను
నచ్చితేనే, మెచ్చితేనే
వచ్చి గూట్లో ఉండి పోవే
పిల్లి పిల్ల వచ్చింది - ఉట్టి పైకెగిరింది
కావలున్న ముసలవ్వ - కర్రతీసి విసిరింది
పాలకుండ పగిలింది - పిల్లి పారిపోయింది
అవ్వ అందుకేడ్వటం - తాత చూసి నవ్వటం
పగటికి దీపం సూర్యుడు
రాత్రికి దీపం చంద్రుడు
జాతికి దీపం సుపుత్రుడు
త్రిలోక దీపం పవిత్రుడు
పాపా పాపా అలిగా వేలా!
అమ్మ అప్పచ్చి యివ్వలేదుగా
పాపా పాపా పకపక లేలా!
అమ్మ అప్పచ్చి యిచ్చినారుగా
ఎందుకు పాపా ఏడుపు మరలా?
అప్పచ్చి కాకీ తన్నుకెళ్ళెగా.
అమ్మమాట చద్దన్నం మూట
నాన్నమాట కంచుకోట
గురువు మాట గులాబీల తోట
తాతగారి మాట తారంగం ఆట
చెడ్డవారి మాట మంచి నీళ్ళ మూట
రాజుగారి మాట రత్నాల మూట
బామ్మమాట బంగారు బాట
మనందరి మాట మల్లెపూల బాట
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in