www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

పిల్లల పాటలు (కొన్ని)

చిలకమ్మ పెండ్లి

 చిలకమ్మ పెండ్లి - చెలికత్తెలందరూ

చెట్లు సింగారించి - చేరి కూర్చున్నారు

పందిట పిచ్చుకలు - సందడి చేయగ

కాకుల మూకలు - బాకాలూదగ

కప్పలు బెకబెక - డప్పులు కొట్టగ

కొక్కొరోకోయని - కోడి కూయగా

ఘుమ్మని తుమ్మెద - తంబుర మీటగ

కుహూ కుహూ యని - కోయిల పాడగా

పిల్ల తెమ్మరలు - వేణువూదగా

నెమలి సొగసుగా - నాట్యం చేయగా

సాళిడిచ్చిన చాపు కట్టుకుని

పెండ్లికుమారుడు బింకము చూపగా

మల్లీ మాలతి - మాధవీ లతలు

పెండ్లి కుమారుని - పెండ్లి కూతురిని

దీవిస్తూ తమ పూవులు రాల్చగా

మైనా గోరింక మంత్రము చదివెను

చిలకమ్మ మగడంత - చిరునవ్వులు నవ్వుతూ

చిలకమ్మ మెడకట్టె - చింతాకు పుస్తె

పప్పు పెట్టి పాయసం పెట్టి.....

పప్పు పెట్టి పాయసం పెట్టి

అన్నం పెట్టి అప్పచ్చి పెట్టి

కూర పెట్టి ఊరగాయ పెట్టి

నెయ్యి పోసి ముద్ద చేసి

ముద్దు చేసి తినిపించి

చేయి కడిగి న్మూతి కడిగి

తాతగారింటికీ దారేదండి

అత్తారింటికి దారేదండి

ఇట్లపోయి అట్లాపోయి

మోచేతి పాలెం ముందర నుంచి పోయి

ఇట్లపోయి అట్లాపోయి

అదిగో వచ్చాం ఇదిగో వచ్చాం

చక్కావచ్చాం చక్కగవచ్చాం

చక్కిలి గిలిగిలి చక్కిలి గిలి

దేశభక్తి

దేశమును ప్రేమించుమన్నా - మంచి అన్నది పెంచుమన్నా

వట్టి మాటలు కట్టి పెట్టోయ్ - గట్టిమేలు తలపెట్టోయ్!

పాడి పంటలు పొంగిపొర్లే - దారిలో నువు పాటు పడవోయ్

తిండి కలిగితే కండ కలదోయ్ - కండ కలవాడేను మనిషోయ్!

ఈసురోమని మనుషులుంటే - దేశమేగతి బాగుపడునోయ్

జల్దుకోని కళలెల్ల నేర్చుకు - దేశి సరుకులు నించవోయ్

అన్ని దేశల్ క్రమ్మవలె నోయి - దేశి సరుకుల నమ్మవలెపోయి

డబ్బుతేలేనట్టి నరులకు - కీర్తి సంపదలబ్బవోయ్!

వెనుక చూసిన కార్యమేమోయి - మంచి గతమునకొంచెమేనోయి

మందగించక ముందు అడుగేయి - వెనుక పడితే వెనకే నోయి!

పూను స్పర్థను విద్యలందే - వైరములు వాణిజ్యమందే

వ్యర్థకలహం పెంచబోకోయి - కత్తి వైరం కాల్చవోయి!

దేశభిమానం నాకు కద్దని - వట్టి గొప్పలు చెప్పుకోకోయి

పూని యేదైనాను వొకమేల్ - కూరి జనులకు చూపవోయి

ఓర్వ లేమి పిశాచి దేశం - మూలుగులు పీల్చేసేనోయి

ఒరుల మేలుకు సంతసిస్తూ - ఐక్యమత్యం నేర్చవోయి!


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in