|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
పిల్లల పాటలు (కొన్ని)
వానల్లు కురవాలి - వానదేవుడా
వరిచేలు పండాలి - వానదేవుడా
నల్లని మేఘాలు - వానదేవుడా
చల్లగా కురవాలి - వానదేవుడా
మాఊరి చెరువంత - వానదేవుడా
ముంచెత్తి పోవాలి - వానదేవుడా
కప్పలకు పెండ్లిండ్లు - వానదేవుడా
గొప్పగా చేస్తాము - వానదేవుడా
పచ్చగా చేలంత - వానదేవుడా
పంటల్లు పండాలి - వానదేవుడా
వానల్లు కురవాలి - వానదేవుడా
వరిచేలు పండాలి - వానదేవుడా
గోరు గోరు ముద్ద
కాకమ్మ ముద్ద
చందమమ ముద్ద
చక్కనైన ముద్ద
పాపాయి ముద్ద
పానకాల ముద్ద
ఆ....ఆ....
ఆసి బూసి నోట్లోముద్ద
గుటుక్కున మింగూ........
ఏడవకు ఏడవకు వెర్రి పాపాయి
ఏడిస్తే నీ కళ్ళ నీలాలుకారు
నీలాలు కారితే నేచూడలేను
పాలైన కారవే బంగారు కళ్ళ
బాలలం, బాలలం మేమంత బాలలం
కన్న తల్లిదండ్రులకు - కదలాడే బొమ్మలం
భరతమాత పెంచుతున్న - భావి మావి కొమ్మలం
చదువుకునే దీపాలం - సమత నాత రూపాలం
నవ భారత మందిరాన - నవ జీవన శిల్పాలం
బాలలం మేం బాలలం
భావితరానికి దివ్వెలం
నవనాగరికత వెలుగులం
సమసమాజ నిర్మాతలం
మానవతకు వెలుగులం
మహోన్నతికి రూపాలం
వినయానికి సంపన్నులం
ఐక్యమత్య ప్రభోధకులం
దూదుపుల్ల దురాయ్‌పుల్ల
చూడకుండా జాడ తీయ్
ఊదకుండా పుల్ల తీయ్
నారాయణ నారాయణ నక్క తోక
నా మొగుడు తెచ్చాడు కొత్త కోక
నేనెందుకుంటాను కట్టుకోక
ఎన్నాళ్ళు ఉంటుంది చినిగిపోక
మా అత్త వుంటుందా మొత్తుకోక.
ఇంతింత దీపమ్ము ఇల్లెల్ల వెలుగు
మాడంత దీపమ్ము మేడలకు వెలుగు
గోరంత దీపమ్ము కొండంత వెలుగు
గోపాలకృష్ణయ్య గోకులము వెలుగు
ఈశ్వరుని జాబిల్లి జగమెల్ల వెలుగు
మాచిట్టి అబ్బాయి మాకళ్ళ వెలుగు
చిట్టి చిట్టి మిరియాలు
చెట్టూకింద పోసి
పుట్టమన్ను తెచ్చి
బొమ్మరిల్లు కడితె
బొమ్మరింట్లో పాప పుట్టె
తాతా తాతా తైతక్కలాట
నువ్వుందేమో సామర్లకోట
కోట కింద బొమ్మలాట
కూచుందేమో కుర్చీపీట
పీట కింద బంగారు మూట
ఆ మూట నాకిస్తే
నీ మాట నేవింట.
చల్ చల్ గుర్రం
చలాకి గుర్రం
కర్రతో చేసిన
గజ్జెల గుర్రం
మువ్వలు మెడలో
ముద్దుగ గట్టీ
రంగుల హంగుల
సింగారించి
వీపుకు జీను
సాపుగ వేసి
వదిలేస్తే సరి
పరుగుడు గుర్రం
కళ్ళెం చేత్తో
గట్టిగ బట్టి
గుర్రం మీద
కూర్చొని యుండీ
చల్ చల్ చల్‌మని
తోలుచు వుంటే
గంతులు వేయుచు
పరుగిడు గుర్రం
చల్ చల్ గుర్రం
చలాకి గుర్రం
చీమ ఎంతో చిన్నది
పనిలో ఎంతో మిన్నది
ముందుచూపు వున్నది
పొదుపులోన మిన్నది
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in