|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
పొడుపు కథలు
[అ నుంచి అః వరకు] [క నుంచి ఘ వరకు] [చ నుంచి జ వరకు] [ట నుంచి డ వరకు] [త నుంచి న వరకు] [ప నుంచి మ వరకు] [య నుంచి ఱ వరకు]
ట నుంచి డ వరకు
టక్కు చూచుట కెంతో నిక్కు! జాఱి పడిందటే... పుటుక్కు!
కండ్ల జోడు
'టూరు' గాని టూరు, ఏమి టూరు?
గుంటూరు, ఇంటూరు
ట్రిక్కులు చేసే టక్కుల మారి! చెప్పకుండా పోతాడు. గల్లంతు ఔతాడు.
మోసగాడు
"టిక్కు" మనగానే మాట్లాడతాను. "టక్కు" మనగానే ఆగిపోతాను.
ఆకాశ వాణి
టిక్కు టిక్కు బండి! టక్కులాడి బండి! సాగిపోవు బండి! హాల్ట్ లేని బండి! అదేమిటి?
గడియారము
టెంకాయలో వంకాయ పోతే ఎంత?
తొమ్మిది
డబ్బుపెట్టి కొనడం ముందరగానే ఏడ్వడం.
ఉల్లిగడ్డ
డబ్బులిస్తానంటేనే దరువు వేస్తాడు.
ఒళ్ళు పట్టేవాడు
డబ్బులిస్తే చాలు గుద్దుతాడు.
ఒడ్రమంగలి
డాక్టరొచ్చారు సూది వేశారు, కాసులిస్తేను పారిపోయారు.
దోమ
'డాలు' గాని డాలు! ఏమి డాలు?
కాగడాలు, అప్పడాలు
డిల్లీలో పాటను లండన్ లో వినిపిస్తుంది. మాస్కో లో నాటకాన్ని న్యూయర్క్ లో చూపిస్తుంది.
టెలివిజన్
డొంకలో ఇంపైన మెలికల పాము.
నాలుక
డొంకలో మెలికల కఱ్ఱ?
పాము
'డ్రస్' గాని డ్రస్! ఏమి డ్రస్?
అడ్రస్
ఢాం ఢాం పలక! ఢంకా పలకా! ఎంత కొట్టినా... పగులని పలక?
భూమి
సమాధానముల కొరకు ప్రశ్నలపై క్లిక్ చేయండి.
[అ నుంచి అః వరకు] [క నుంచి ఘ వరకు] [చ నుంచి జ వరకు] [ట నుంచి డ వరకు] [త నుంచి న వరకు] [ప నుంచి మ వరకు] [య నుంచి ఱ వరకు]
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in