|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
పొడుపు కథలు
[అ నుంచి అః వరకు] [క నుంచి ఘ వరకు] [చ నుంచి జ వరకు] [ట నుంచి డ వరకు] [త నుంచి న వరకు] [ప నుంచి మ వరకు] [య నుంచి ఱ వరకు]
చ నుంచి జ వరకు
చక చక పోయేవి రెండు. గట్టెక్కి చూచేవి రెండు అంది పుచ్చుకొనేవి రెండు. ఆలకించేవి రెండు.
కాళ్ళు, కళ్ళు, చేతులు, చెవులు.
చక్కని పాపకు చుక్కల చీర!
ఆకాశము
చచ్చినోడు సంతకు పోవు!
ఎండు చేప
చాచుకొని, సావిట్లో పండుకొనే ముసలమ్మ! ముడుచుకొని, మూల నిలబడుతుంది.
చాప
చారల చారల పాము, చక్కని పాము, నూతిలోని పాము, నున్ననైన పాము!
పొట్లకాయ
చారల పాపడికి దూది కుచ్చు!
ఉడుత
చింపిరి చింపిరి గుడ్డలు! ముత్యముల వంటి బిడ్డలు!
మొక్కజొన్న
చీకటి ఇంటిలో జడల దెయ్యము!
ఉట్టి
చిక్కటి కారడవిలో చక్కని దారి!
పాపిట
చిటపట వానలు కురవంగా! సీతాదేవి పుట్టంగా! లంకా దీపము పెట్టంగా! రాముడు విల్లును విఱువంగా!
అరటి పువ్వు
చిటారు కొమ్మన మిఠాయి పొట్లము!
తేనె తుట్టె
చిటుకు లాడి! పటుకు లాడి! గోడ ఎక్కి, దుముకు లాడి!
విస్తరాకు
చిట్టి పిడతలో మూడు కూరలు!
తాంబూలము
చిన్న ఇంటి నిండా తెల్లటి పండ్లు!
నోటిలోని దంతములు
చిన్న కాయ! నీ మీదున్న కాయ!
చెమట కాయ
చిన్నచట్టిలో కమ్మటి కూర!
కిళ్ళీ
చిన్నపట్నములో చాల గదులు! గదికొక్క సిపాయి! సిపాయికొక్క తుపాకి!
తేనె పట్టు
చిన్నమిద్దెలో చింతపండు?
గుబిలి
చిన్నా, పెద్ద భేదము లేదు. "వారు వీరు" అని అసలే లేదు. ప్రతిరోజూ మూడు పూటలా సర్వ ప్రాణులకు వేసేది ఏది?
ఆకలి
చిలుకని గాని చిలుకను నేను! నేను వస్తున్నా, వెళుతున్నా... అదుగో చిలుక! ఇదుగో చిలుక! అంటారు. చిలక గాని చిలక నైన నేనెవరిని?
స్త్రీ
చూచే వారే గానీ తీసే వారు లేరు.
ఇంద్ర ధనస్సు
చూచేవి చెప్పలేవు, చెప్పేది చూడ లేదు.
కండ్లు, నోరు
చూడబోతే చిన్న ముండ! విప్పుతుంటే ఎన్ని చీరలైనా వస్తాయి.
నీరు ఉల్లిపాయ
చూస్తే ఒకటి, చేస్తే రెండు, తలకూ, తోకకూ, ఒకటే టోపి చెప్పండి. ఇది చెప్పండి.
కలరు
చెక్కని స్తంభం చేతికందదూ, చెయ్యని కుండా పొయ్యని నీళ్ళు చెయ్య సున్నం - తియ్యని బెల్లం
కొబ్బరి
చెట్టు కొడితే పిట్ట లేచి పోయె!
పేడు
చెట్టు చూడు. చెట్టందం చూడు. చిత్రమైన చిగురాకును చూడు. పూసిందంటే ఒకటే పూవు చూడు. కాసిందంటే గంపెడు కాయలు చూడు.
ఆకాశం, చంద్రుడు, చుక్కలు, వెన్నెల
చెయ్యని కుండ! పొయ్యని నీరు! వెయ్యని సున్నము! తియ్యగ నుండు!
కొబ్బరికాయ
జామ చెట్టు క్రింద జానమ్మా ఎంత గుంజినా రాదమ్మా
నీడ
జల్లు పడగానే, జండా లేస్తుంది.
పుట్ట గొడుగు
జాజికాయ కొట్లాడుతుంది ఎలక్కాయ విడిపిస్తుంది.
తాళంచెవి
జాబు గాని జాబు ఏమి జాబు?
పంజాబు
జింక ఉరకంగా పాలుకారంగా?
విసురు రాయి
జిత్తెడు తోకున్న జివలగిరి మేక! ఆవుల కొండెక్కి, ఆకు మేసె!
ఎలుక
జిలుగు జిలుగు నీటిలో జీలుగు పుట్టె! ఆకు పుట్టె! అంతరాల కొడుకు పుట్టె! కొడుకును కొట్టి, కోడలు ముండ మోసె!
అరటి చెట్టు
జీవం ఉంది కాని కదలలేదు
గ్రుడ్డు
జీవం లేని జంతువు ఆకుల్లేని అడవిలో వేటాడబోయింది?
దువ్వెన
జీవము లేని గరుడ పక్షి దేశ దేశములూ తిరుగుతుంది.
విమానము
జీవంలేని గుర్రాన్నెక్కి జిగటాకోల చేతబట్టి ఆకుల్లేని అడవిలోకి వేటాడబోయింది టక్కులాడి.
పడవ
జీడీ వారికి కోడలు, సిరిగల వారికి ఆడపడుచు మైనులగుల్కె వయ్యారి వైశాఖంలో వస్తుంది.
మామిడి పండు
జోడు గుఱ్ఱముల మీద ఒకడే రాజు!
పావు కోళ్ళు
సమాధానముల కొరకు ప్రశ్నలపై క్లిక్ చేయండి.
[అ నుంచి అః వరకు] [క నుంచి ఘ వరకు] [చ నుంచి జ వరకు] [ట నుంచి డ వరకు] [త నుంచి న వరకు] [ప నుంచి మ వరకు] [య నుంచి ఱ వరకు]
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in