|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
పొడుపు కథలు
[అ నుంచి అః వరకు] [క నుంచి ఘ వరకు] [చ నుంచి జ వరకు] [ట నుంచి డ వరకు] [త నుంచి న వరకు] [ప నుంచి మ వరకు] [య నుంచి ఱ వరకు]
త నుంచి న వరకు
తండ్రి గరగర! తల్లి పీచు పీచు! బిడ్డలు రత్నమాణిక్యములు!
పనస పండు
తమ్ముడు కుంటుతూ, కుంటుతూ మైలు నడిచేసరికి అన్న పరుగెత్తుకుంటూ పన్నెండు మైళ్ళు నడుస్తాడు.
గడియారములోని ముళ్ళు
తరచి తరచి చూసినా లోతు తెలియనిది?
ఆడదాని మనసు
తల కాయ వుంది. తక్కింది లేదు. ఒంటి కాలిపైన గిరగిర తిరిగే ఒయ్యారముల సింగారము!
బొంగరము
తల ఉన్నా కళ్ళు లేనిది?
గుండు సూది
తలలేని కాసురెడ్డికి వీపునే మోకాళ్ళు!
ఇంటి కప్పు
తల్లి కూర్చుండు! పిల్ల పారాడు!
కడవ చెంబు
తళుకు తళుకు నీటిలో శ్రీరాముడు పుట్టె! ఆ శ్రీరాముని కడుపులో ఒక రాముడు పుట్టె! ఆ రాముని కడుపులో వజ్రము పుట్టె!
బియ్యపు గింజ
తవ్వని కుంట కురవని నీరు?
నోరు, లాలాజలం
తాపం గాని తాపం
ప్రతాపం
తాళము గాని తాళము! ఏమి తాళము?
ఆది తాళము
తాళి గాని తాళి ఏమి తాళి?
ఎగతాళి
తీసుకునే వారి చెయ్యి పైన, ఇచ్చేవారి చెయ్యి క్రింద ఇలా ఎప్పుడుంటుంది?
బొట్టు పెట్టుకునేటప్పుడు
తీస్తే పోతుంది. తెల్లారితే వస్తుంది.
మీసము
తెల్లటోడు నల్లటోడిని తన్ను!
అగ్గిపెట్టె
తెల్లటి పొలంలో నల్లటి విత్తనాలు. చేతితో చల్లడం, నోటితో ఏరుకోవడం.
పుస్తకం
తేరు తిరుగుతుంటే, పూలు రాలతాయి.
విసురు రాయి
తొడిమ లేని పండు! ఆకు లేని పంట!
విబూది పండు,ఉప్పు పంట
తొడేవారే గాని, పోసేవారే లేరు.
బావి నీరు
తొమ్మిది రంధ్రముల బొమ్మ! ఘనమైన తోలు బొమ్మ!
మనిషి
దండ కాని దండ ?
అండదండ, కైదండ
దానము గాని దానము! ఏమి దానము?
నిదానము, మైదానము
దాని మొదలు చెరకు మొదలు. దాని ఆకు తామరాకు దాని పూత మేడి పూత దాని కాత గజ్జి కాత
ఆముదపు చెట్టు
దినమంతా నిద్రపోతుంది రాత్రంతా మేలుకుంటుంది?
దీపం
దుకాణములో కొంటారు. ముందర పెట్టుకొని ఏడుస్తారు.
ఉల్లి గడ్డలు
దోసెడు నీటిలో దొరసాని జలకాడమాడింది?
వెన్న
ధనము గాని ధనము ఏమి ధనము?
ఇంధనము, బంధనము
ధరణిలో పన్నెండు మంది భార్యలు నాకు! ఒక్కో భార్యకు నలుగురు కొడుకులు! మూడువందల అరువది ఐదుమంది మనుమలు!
సంవత్సరము= నెలలు, వారములు, రోజులు
నట్టింట్లో నలుగురు దొంగలు?
చనుకట్ట
నడిచిపోయే తెల్లరాతికి నాలుగు కాళ్ళు?
ఆవు
నడుము సన్నపు నాగ లింగము! పోటు, పోటుకు బొబ్బలింగము!
కందురీగ
నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది. దాని పీక మీదకు కత్తిని తెస్తేగానీ నడువదు. ఏమిటది?
పెన్సిల్
నన్ను చూస్తే నిన్ను పట్టిస్తా?
అద్దం
నరుడు కాని నరుడు?
వానరుడు
నలుగురు దొంగలపై ఒకటే రాయి
ఉసిరికాయ
నల్లటి నీటిలో, తెల్లనీటిని పోసి, వెండి పలుకు లేస్తే అంతా త్రాగే వారే! ఏమిటవి?
కాఫీ, టీ
నల్లపడవలో తెల్లటిదారి?
పాపిడి
నా చుట్టూ అద్దములు వుంటాయి గానీ, అద్దముల మేడను కాను. వేగముగా పరుగెడుతుంటాను గానీ, జింకను కాను. నాతో అందరికీ పని వుంటుంది గానీ, ప్రభుత్వపు కార్యాలయమును కాను.
బస్
నాకు మీ చేయి తగిలితే నేను ఊరుకోను. ఎలుగెత్తి అరుస్తాను, దైవమును పిలుస్తాను. నేనెవరిని?
గుడిగంట
నాకు (మగ వారికి) ఉండేది! నీకు (ఆడవారికి) ఉండేది! అవేమిటో చెప్పు?
అప్పు, కొప్పు
నాలుగు కాళ్ళున్నాయి గానీ, జంతువును కాను. నా శరీరమంతా రంధ్రములున్నాయి గానీ, వలను కాను.
మంచము
నాలో నదులున్నాయి గానీ, మ్యాప్‌ను కాను. గుండ్రంగా వుంటాను గానీ, బంతిని కాను. నాలోనే సర్వము ఉన్నది గానీ, దేవుడ్ని కాను.
గ్లోబ్
నిద్రపోయినా కళ్ళు మూయనిది?
నాలుక
నిన్న ఏమిటో, నేడు ఏమిటో, రేపు ఏమిటో చెప్పవే చక్కని బొమ్మ! మాసమున కొకసారి మారిపోయే బొమ్మ ఎల్లప్పుడూ గోడ నంటియుండు బొమ్మ!
వాల్ క్యాలెండర్
నీచేతి దెబ్బలు తిన్నాను నిలువునా ఎండిపోయాను. నిప్పుల గుండమును తొక్కాను. గుప్పెడు బూడిదనయ్యాను.
పిడక
నీడొక్కలో నా కాలు!
మగ్గము
నీటి పైన కలకలా కొమ్మమీద కిచకిచ
కప్పలు-కోతులు
నున్నటి బండమీద నూగులను ఎండబోస్తే, నాలుక లేని భీముడొచ్చి, నాకి పోయాడు.
జుట్టు కత్తిరించే కత్తి
నున్నగా చెక్కించి, నూనె మెరుగెట్టించి; ఏడాది కొకసారి గంట కొట్టి; కదిలిస్తారు కోలాహలంబుగా!
రథము
నేనెన్నో మంచి విషయములను నేర్పుతాను గానీ, నాకు మాటలు రావు. నేను మీకు ప్రపంచమును చూపగలను గానీ, నేను చూడలేను. మరి నేనెవరిని?
పుస్తకము
సమాధానముల కొరకు ప్రశ్నలపై క్లిక్ చేయండి.
[అ నుంచి అః వరకు] [క నుంచి ఘ వరకు] [చ నుంచి జ వరకు] [ట నుంచి డ వరకు] [త నుంచి న వరకు] [ప నుంచి మ వరకు] [య నుంచి ఱ వరకు]
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in