www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

వ్యాకరణం క్విజ్

1

ఆంధ్రభాషకి వర్ణములెన్ని?    

-

యాభైఆరు.

2

స్వరములు అనగా...?     

-

అచ్చులు.

3

ఎ,ఏ,ఒ,ఓ లను ఏమంటారు?  

-

వక్రములు.

4

వక్రతమములు అని వేటిని అంటారు?   

-

ఐ,ఔ.

5

వ్యంజనములు అనగా..?  

-

హల్లులు.

6

పరుపాక్షరాలంటే...?  

-

కచటతపలు.

7

గజడదబలను ఏమంటారు?    

-

సరళములు.

8

పరుషసరళాలు కాక మిగిలిన వాటిని ఏమంటారు?   

-

స్థిరములు.

9

క వర్గమనగా....?   

-

క ఖ గ ఘ జ్ఞ.

10

చ వర్గమనగ....?         

-

చ ఛ జ ఝ ఞ.

11

ట వర్గమనగా....?                

-

ట ఠ డ ఢ ణ.

12

త వర్గమనగా....?        

-

త థ ద ధ న.

13

ప వర్గమనగా....?      

-

ప ఫ బ భ మ.

14

వర్గయుక్కులు అని వేటికి పేరు?       

-

వర్గాలలోని ద్వితీయ, చతుర్ధ అక్షరాలు.(ఖ ఘ ఛ ఢ థ....)

15

ఊష్మాక్షరాలేవి?   

-

శ ష స హ లు.

16

అంతస్థములని వేటికి పేరు?

-

య ర ల ళ వ.

17

ఉభయాక్షరములనగా...?  

-

సున్న, అరసున్న, విసర్గ.

18

పూర్ణబిందువు, పూర్ణానుస్వారం అని దేనికి పేరు? 

-

నిండు సున్నకి.

19

అరసున్నకి గల పేర్లేవి?       

-

ఖండబిందువు, అర్ధబిందువు, అర్ధానుస్పారము.

20

సిద్ధబిందువు అనగా...?     

-

శబ్ధంలో సహజంగా ఉన్న సున్న (గంప, దొంగ).

21

సాధ్యబిందువు అనగా...? - వ్యాకరణంచే సాధించబడింది

-

పూచెంగలువలు.

22

కంఠ్యములు అని వేటికి పేరు?    

-

క ఖ గ ఘ జ్ఞ.

23

తాలవ్యాలు అంటే...? - దౌడలవలన పుట్టినవి   

-

చ ఛ జ ఝ ఇ ఈ య.

24

మూర్ధన్యాలు అని వేటికి పేరు? - దంతములనుండి పుట్టినవి

-

త థ ద ధ.

25

ప ఫ బ భ, ఉ ఊలను ఏమంటారు?  

-

ఓష్యములు.

26

అనునాసికములంటే...?   

-

నాసికను అనుసరించి పలకబడేవి - జ్ఞ, ఞ, ణ, న, మ.

27

పదం అంటే...?    

-

సుప్‌తిగంతములు కలది పదం. విభక్తి ప్రత్యయములు చేరిన శబ్ధం.

28

ప్రకృతి అంటే...?      

-

ప్రత్యయం చేరటానికి యోగ్యమైన శబ్ధం.

29

ప్రాతిపదిక అనగా   

-

నామ విభక్తి ప్రత్యయాలు చేరటానికి తగిన ప్రకృతి.

30

"చదువును" లో ధాతువు ఏది?

-

చదువు.

31

తెలుగులోని పదాలు ఎన్ని రకాలు?   

-

తత్యమం, తద్భవం, దేశ్యం, అన్యదేశ్యం, గ్రామ్యం.

32

తత్యమములు అంటే...?  

-

సంస్కృత ప్రాకృత సమములు. తెలుగు ప్రత్యయాలు చేరి పెద్దగా మార్పులు లేని సంస్కృత, ప్రాకృత పదాలు. ఉదా: విద్యా-విద్య (తత్యమం. సంస్కృతసమం) సింగారో-సింగారం (తత్సమం, ప్రాకృతసమం)

33

తద్భవాలు అంటే....?  

-

సంస్కృత ప్రాకృత భావాలు. సంస్కృత, ప్రాకృత భాషలనుండి వివిధ మార్పులు చెంది పుట్టినవి. ఉదా: ఆకాశః - ఆకసము (తద్భవం - సంస్కృతభవం) లక్ష్మీ - లచ్చీ - లచ్చి (తద్భవం - ప్రాకృతసమం)

34

దేశ్యములనగా....?                

-

తెలుగుదేశములో వ్యవహారములో కలవి. సంస్కృత ప్రాకృతాలతో సంబంధం లేనివి. ఉదా: ఊరు, ఇల్లు, చెట్టు, కోట, దూడ.

35

గ్రామ్యము అనగా....? 

-

లక్షణ విరుద్ధమైన భాష, వ్యాకరణ నియమంలేని భాష. ఉదా: వస్తాడు, వచ్చేడు, లెగు, కూకో.

36

అన్య దేశ్యములని వేటిని అంటారు?     

-

ఇతర భాషలనుండి తెలుగులోకి చేరిన పదాలు. ఉదా: అసలు, ఖరీదు, రోడ్డు, బాల్చీ, రోజు.

37

ప్రకృతి వికృతులంటే....?  

-

సంస్కృత పదాలతో సమానమైనవి ప్రకృతులు. సంస్కృత ప్రాకృత పదాలనుండి పుట్టినవి వికృతులు.

ఉదా:

 ప్రకృతి - వికృతి

అక్షరం - అక్కరం

అన్యాయం - అన్నెము

గృహం - గీము

పూర్ణిమ - పున్నమి

యాత్ర - జాతర

38

ద్రుతము అనగా...?

-

నకారాపు పొల్లు. జారిపోవు (లోపించు) స్వభావంగలది.

39

ద్రుతప్రకృతికములు అంటే...?

-

ద్రుతము చివరగల పదాలు. ఉదా: చేతన్, పూచెను.

40

కళలు అనగా...?

-

నకారం చివరలేని పదాలు. ఉదా: వస్తువు, రాముడు.

41

క్రియానామవాచకాలు ఏవి?

-

కోరిక, కోత, తిండి.

42

'ప్రధమ పురుష ' అనగా...?

-

మూడవవ్యక్తిని ఇతరములైన వానిని తెలుపునది - వాడు, అవి, వారు.

43

'మధ్యమ పురుషా అనగా...?

-

తనను గురించి తెలుపుట - నీవు, మీరు

44

'ఉత్తమ పురుష ' అనగా...?

-

తనను గురించి తెలుపుట - నేను, మేము.

45

క్రియాజన్య విశేషణములు....అనగా?

-

క్రియల నుండి పుట్టిన విశేషణాలు (ధాతుజ విశేషణాలు) ఉదా: చదివిన, చదువగల, తినుచున్న మొ||నవి.

46

'స కర్మక క్రియ ' గల వాక్యమేది?

-

రాముడు రావణుని చంపెను.

47

'అ కర్మకక్రియ ' గల వాక్యమేది?

-

గోపాలుడు చదివెను (రాముడు చంపెను)

48

సముచ్చయములు అని వేటిని అంటారు?

-

యున్, నున్ ఉదా: రాముడును, లక్ష్మణుడును అయోధ్యకు వచ్చిరి.

49

లింగ, వచన, విభక్తి శూన్యములైన వానిని ఏమంటారు?

-

అవ్యయములు.

50

అవ్యయములకు ఉదాహరణ?

-

చూచి, తిని (లాక్షణికములు) అయ్యో, ఓహొ, కాని (ప్రతిపదోక్తములు)

51

నిత్యైకవచనాలు ఏవి?

-

వరి, పెసర, బంగారం, వెండి, నూనె మొ||నవి.

52

నిత్య బహువచనాలు ఏవి?

-

పెసలు, బియ్యం, పాలు మొ||నవి.

53

శబ్ధపల్లవం అంటే...?

-

ధాతువుపైగాని, నామముపైగాని వేరొక ధాతువు చేరి-  వేరొక అర్ధము ఇచ్చునది. ఉదా:మేలు + కొను = మేల్కొను;అందు + ఇచ్చు = అందిచ్చు

54

తద్దితములు అనగా....?

-

నామవాచకములకు చివర చేరు ప్రత్యయములు - ఉదా:తన-గొప్పతనం;ఱిక-పెద్దఱికం ఇక -నడవడిక; కార - నుడికారము కలది,కలవాడు అర్ధాలలో 'మతుప్' చేరును.కా,కత్తియ - ఆటకాడు,ఆటకత్తియ (ఆటకలవాడు-కలది)అరి-జాలరి,పూజారి.

55

కౄదంతములనగా....?

-

కౄత్ ప్రత్యయాలు చేరగా ఏఅర్పడిన నామవాచకాలు. ఉదా:ఇమి-కలుగు+ఇమి=కలిమి త-చేయ +త = చేతపు - మేయు +పు = మేపు వలి - కాచు + వరి = కావలి.

56

విభక్తులేవి?

-

వేర్వేరు పదాల మధ్య సంబంధమును కలిగించు ప్రత్యయాలను విభక్తులు అంటారు.

ఉదా:

 ప్రధమా విభక్తి - డు, ము, వు, లు

ద్వితీయా విభక్తి - నిన్, నున్, లన్, కూర్చి, గురించి

తృతియ విభక్తి - చేతన్, చేన్, తోడన్, తోన్

చతుర్ధీ విభక్తి - కొఱకున్, కై

పంచమీ విభక్తి - వలనన్, కంటెన్, పట్టి

షష్ఠీ విభక్తి - కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్.

సప్తమీ విభక్తి - అందున్, నన్

సంబోధన ప్రధమా విభక్తి - ఓ, ఓయి, ఓరి, ఓసి

57

'సంధి ' అనగా?

-

పూర్వ పరస్వరములకు పరస్వరము ఏఏకాదేశమగుట

ఉదా: రాముడు+అతడు=రాముడతడు.

58

గుణములు అనగా?

-

ఏ, ఓ, ఆర్‌లు

59

వృధ్ధులు అని వేటిని అంటారు?

-

య, వ, ర, లను

60

వృద్ధి సంధికి ఉదాహరణలు?

-

పరమైక, దివ్యౌషధం, లోకైక.

61

బహుళము అంటే?

-

సంధికార్యం ప్రవృత్తి, అప్రవృత్తి, విభాష, అన్యకార్యంగా రావటం.

62

విభాష అంటే?

-

సంధికార్యం జరగ్టం, జరగపోవటం.

63

"సంధినిత్యం" అంటే?

-

సంధికార్యం తప్పకుండా రావటం

64

ఆగమము అనగా?

-

వ్ర్ణాధిక్యము. ఏ వర్ణమును తీసివేయకుండ అదనముగా వచ్చు అక్షరము.

65

ఆదేశము అనగా?

-

ఒక వర్ణము స్థానములో వేరొక వర్ణము వచ్చుట.

66

ఆమ్రేడితం అనగా?

-

ఒకే పదం రెండు సార్లు వచ్చినప్పుడు రెండవపదం.

67

సిద్ధమాసము అనగా?

-

సంస్కృతపదాలతో ఏర్పడినది - రాజాజ్ఞ.

68

అచ్చికసమాసము?

-

అచ్చ తెలుగు పదాలతో ఏర్పడినది-ఱేనియానతి.

69

మిశ్ర సమాసమనగా?

-

తత్సమపదాలు, అచ్చికపదాలు కలిసినది-రాజుముదల(చెరువునుదకము)

70

విశేషణ విశేష్యాలతో కూడిన సమాసం ఏమిటి?

-

కర్మధారయ సమాసం.

71

షష్ఠీ తత్పురుషలో ఏ విభక్తులుంటాయి?

-

యొక్క, లో, కు, కి.

72

సమాసంలోని రెండవపదాన్ని ఏమంటారు?

-

ఉత్తరపదం లేదా పరపదం.

73

పూర్వపదం అంటే?

-

సమాసంలోని మొదటి పదం.

74

విగ్రహవాక్యం అంటే?

-

సమాసంలోని పదాలతో భావాన్ని చెప్పేవాక్యం.

75

బింబ ప్రతిబింబభావము గల అలంకారమేది?

-

దృష్టాంతము.

76

"ఓరాజా! నీవే కీర్తిమంతుడవు. చంద్రుడే కాంతిమంతుడు" - ఏ అలంకారం?

-

దృష్టాంతము.

77

నిందారూపంగా సుత్తిని, సుత్తిరూపంగా నిందను చెప్తే ఏ అలంకారం?

-

వ్యాజస్తుతి.

78

సమసోక్తి అలంకారం అంటే?

-

ప్రస్తుతం వర్ణిస్తూంటే అప్రస్తుతం స్పురించుట.

79

"ఒక తలను నిరికిని శివుననవలెనుగాని బ్రహ్మనని ఏమి ప్రయోజనము?" - ఏ అలంకారం?

-

వ్యాజనింద.

80

"సమర్ధింపవలసిన అర్ధమునకు హేతువు నిరూపించిన ఏ అలంకారం?

-

కావ్య లింగం.

81

ప్రకృతాప్రకృతములకు క్రియతో ధర్శైక్యం చెప్తే ఏ అలంకారం?

-

దీపకము.

82

"ఏనుగు మదముచేతను, రాజు ప్రతాముచేతను ప్రకాశించును" - ఏ అలంకారం?

-

దీపకము.

83

ఉల్లేఖాలంకారమనగా?

-

ఒకే వస్తువును అనేక విధములుగా వర్ణించుట

84

శబ్ధాలంకారాలేవి?

-

వృత్యనుప్రాస, అంత్యానుప్రాస, యమకం మొ||లైనవి.

85

అర్ధాలంకారాలు అని వేనిని అంటారు?

-

ఉపమ, రూపక, ఉత్ర్పేక్ష మొ||నవి.

86

ఒకే హల్లు అనేక మార్లు వస్తే ఏ అలంకారం?

-

వృత్యనుప్రాస.

87

చేకానుప్రాస అంటే?

-

రెండు లేదా అంతకన్న ఎక్కువ అక్షరముల సమూహము అర్ధభేదముతో వెంటవెంటనే వచ్చుట.

88

అర్ధభేదంలేకుండా తాత్పర్యభేదం గల అలంకారమేది?

-

లాటానుప్రాస.

89

అంత్యానుప్రాస అనగా?

-

పదముల చివరగాని, పాదముల చివరగాని వచ్చిన అక్షరములే మరల మరల వచ్చుట.

90

'ముక్తపదగ్రస్తము ' అనగా?

-

విడిచిన పదమును వెంటనే మరల గ్రహించుట.

91

ముక్తపద గ్రస్తమునకు ఉదాహరణ?

-

 "సుదతీ నూతన మదనా మదనాగతురంగ"

92

'అనుప్రాస ' అనగా?

-

 ప్రాసాక్షరం పలుమార్లు వచ్చుట.

93

"ఇంతితై వటుడింతయై మఱియు దానంతై" ఏ అలంకారం?

-

 అనుప్రాస.

94

"అదిప్రాస"కి ఉదాహరణ?

-

ఉన్నాడు లెస్సరాఘువుదున్నాడు...యున్నాడు..."

95

ఉపమాలంకారంలో గల భాగాలు ఏవి?

-

ఉపమేయం = వర్ణించే వస్తువు

ఉపమానం = పోల్చే వస్తువు

సమాన ధర్మం = సమానమైన గుణం

ఉపమావాచకం = పోలికను తెలిపే పదం (వలె, పోలె)

96

'లుప్తోపమ ' అంటే?

-

ఉపమేయ, ఉపమాన, సమానధర్మ, ఉపమావాచకాలలో ఒకటి లోపించినచో లుప్తోపము అగును.

97

'మాలోపమ ' అంటే?

-

ఉపమానాలు ఎక్కువవుంటే మాలోపమాలంకారం అంటారు.

98

ఉపమాలంకారం వాడటంలో సుప్రసిద్ధుడెవరు?

-

కాళిదాసు.

99

ఉపమేయ ఉపమానాలకు అభేదం వర్ణిస్తే ఏ అలంకారం?

-

రూపకము.

100

ఊహగల అలంకారమేది?

-

ఉత్ప్రేక్ష

101

సామాన్య, విశేష వాక్యాలు గల అలంకారమేది?

-

అర్ధాంతరన్యాసం

102

అనేకార్ధలనిచ్చు పదాలను ప్రయోగిస్తే ఏ అలంకారం?

-

శ్లేషాలంకారం.

103

అతిశయోక్తి అలంకారమంటే?

-

సహజస్థితిని లేదా గుణాన్ని ఎక్కువ చేసి వర్ణించుట.

104

స్వభావోక్తి అలంకారమంటే?

-

సహజస్థితిని లేదా గుణాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనోహరంగా వర్ణించుట.

105

కారణం కాని దానిని కారణంగా ఊహిస్తే ఏ అలంకారం?

-

హేతూత్రేక్ష.

106

'వస్తూత్ప్రేక్ష ' అంటే?

-

వస్తువు కాని దానిని వస్తువుగా ఊహించుట.

107

'ఫలము కాని దానిని ఫలంగా ఊహిస్తే ఏ అలంకారం?

-

ఫలోత్ప్రేక్ష.

 

 

   

వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in