www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

విరామ చిహ్నాలు

చదువుటకు, వ్రాయుటకు, విరామ చిహ్నాలు.  మనము మాట్లాడేటప్పుడు, చదివేటప్పుడు చక్కగా అర్ధం కావడానికి వాక్యాల అంతంలో విరామాన్ని పాటించడం అవసరం. సులభంగా అన్వయించుకోవడానికి వాక్యాల్లో, వాక్యాంశాల్లో విరామాన్ని పాటించే స్థానంలో వాడబడే గుర్తుల్ని విరామ చిహ్నాలంటారు. వీటిని పాటిస్తే అన్వయక్లిష్టత ఉండదు. లేకుంటే విషయం అర్ధరహితం అవుతుంది. ఈ క్రింది విరామ చిహ్నాలు పరిశీలించండి.

 

, వాక్యాంశ బిందువు (కామ)

అన్వయంలో సమీప సంబంధాన్ని కలిగి విరామాన్ని పాటించే సందర్భాల్లో ఈ గుర్తును వాడతారు.

ఉదా: వెంకటేశ్వర్లు, రామకృష్ణ, శంకర్ కలసి ఒక కంపెనీలో పని చేస్తున్నారు.

 

; అర్ధబిందువు (సెమికోలన్)

మహా వాక్యాల్లోని ముఖ్య వాక్యాల చివరలో ఈ గుర్తు ఉంటుంది. ఒక విషయాన్ని నిర్దారణ చేసే సందర్భాలలో ఈ గుర్తును వాడుతుంటారు.

ఉదా: మానవుడు జీవించటానికి తింటాడు; కాని తినటానికి జీవించడు.

 

: న్యూన బిందువు (కోలన్)

మూడు మాత్రల కాలం విరతిని తెలిపేది. దూర సంబంధం గల రెండు ప్రత్యేక వాక్యాలకు మధ్య ఈ గుర్తు వస్తుంది.

ఉదా: దేశంలో నా కంటె గొప్పవాడు లేడనుకోకు : ఒకరిని మించిన మరొకరుండనే ఉంటారు.

 

. బిందువు లేక ముగింపు చుక్క (ఫుల్ల్ స్టాప్)

భిన్న వాక్యాల చివర ఈ గుర్తు వస్తుంది.

ఉదా: రాముడు మంచి బాలుడు.

 

అర్ధాన్ని బట్టి వచ్చే గుర్తులు

? ప్రశ్నార్ధక చిహ్నాం (ఇంటరాగేషన్)

ప్రశ్నార్ధక వాక్యాల చివర ఈ గుర్తు వస్తుంది.

ఉదా: ఎవరు మీరు?

 

! రాగ చిహ్నం (ఎక్సక్లమేషన్):

ఆశ్చర్యం, సంతాపం, ప్రశంస, సంభోధన మొదలైన వాటిని తెలిపే పదాల చివర, ఈ గుర్తు వస్తుంది.

ఉదా: ఆ! అయ్యో! అలా జరిగిందా!

 

" " అనువాద చిహ్నం (ఇన్వర్టెడ్ కామాస్):

ఇతర గ్రంధాల నుండి గ్రహింపబడిన వాక్యాలు, పదాలు మొదలైనవి వాటి కిరుప్రక్కల ఈ గుర్తులు వాడతారు.

ఉదా: "దుర్బలస్య బలంరాజా" అని వినవే.

 

( ) వృత్తార్ధం [ ] వలయితం (బ్రాకెట్స్):

ఈ రెండు గుర్తులు ముఖ్యమైన పదాలకు గాని వాక్యాలకు గాని రెండు ప్రక్కల ఉంచుతారు. ఒక విషయాన్ని విపులంగా తెలియజేయడానికి ఈ కుండలీకరణాలు ఉపయోగపడును.

ఉదా: దాశరధికి (రామునకు) నమస్కారం.

 

:- కోలన్ డేష్

 అనగా చెప్పబడుచున్నది అనుటకు దీనిని ఉపయోగిస్తారు.

-  ఈ గుర్తును డేష్ అందురు.

/  ఈ గుర్తును ఆబ్లిక్క్ లేదా శ్లాష్ అందురు.

* ఈ గుర్తును తారకం అందురు.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in