Telugudanam.co.in
మా అనుబంధ వెబ్సైట్...
|
|
చిన్న పిల్లలకు నేర్పవలసిన (పిల్లలు నేర్చుకోవలసిన) కొన్ని మంచి అలవాట్లు
- వేకువ(తెల్లవారు) జామునే లేవటం.
- లేచిన వెంటనే పక్క బట్టలు తీయటం.
- శుభ్రంగా పళ్ళు తోముకోవటం
- శుభ్రంగా క్రింద పడకుండా పలహారం(టిఫిన్) తినటం.
- శుభ్రమైన బట్టలు ధరించటం.
- చక్కగా తల దువ్వు కోవటం.
- బూట్లను శుభ్రంగా ఉంచుకోవాలి.
- బడికి వెళ్ళేటప్పుడు బూట్లను శుభ్రంగా తుడుచుకొని బూట్లను వేసుకోవాలి.
- వేళకు బడికి (స్కూల్‌కి) వెళ్ళటం.
- బడికి వెళ్ళటానికి పది నిమిషాల ముందే కావలసినవన్ని సంచిలో (Bag) సర్దుకోవాలి.
- ఉపాధ్యాయులను గౌరవించటం.
- సాటి విధ్యార్ధితో స్నేహ భావంతో మెలగటం.
- ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు, మంచి మాటలు నేర్చుకోవటం.
- ఇంటిలోకి వచ్చే ముందు కాళ్ళు శుభ్రంగా తుడుచుకొని రావాలి.
- ఇంటి పని (హొం వర్క్) సరిగ్గా చేయటం.
- ఇంటి పని (హొం వర్క్) అయిన తర్వాతనే ఆడుకోవాలి.
- అమ్మకి చిన్న చిన్న పనులలో సాయంచేయటం.
- ఖాళీ సమయాల్లో బొమ్మలు గీయటం, చిన్న చిన్న కథలు చదవటం వంటివి చేయటం.
- భోజనం చేసే ముందు చేతులు కడుగుకోవటం.
- భోజనం చేసే ముందు వస్తువులను (గిన్నెలను) తీసుకురావటానికి అమ్మకు సాయం చేయటం.
- తిన్న వెంటనే పళ్ళు తోముకోవటం.
- ఆడుకున్న తరువాత ఆట వస్తువులను సర్దుకోవాలి.
- టి.వి. చూసేటప్పుడు టి. వి. కి దగ్గరగా కూర్చోవద్దు.
- నీళ్ళు వృధా చేయవద్దు.
- నీళ్ళు పట్టు కోవటం అయిన వెంటనే పంపు కట్టేయాలి.
- రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.
- పెద్ద వారు ఎదురైనప్పుడు నమస్కారం చేయటం.
- ఇంటికి వచ్చిన వారిని గౌరవించటం.
- పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు లేచి నిలబడటం.
- నిప్పుతో లేక అగ్గిపుల్లలతో ఆడకూడదు.
- గ్యాస్ పొయ్యితో (బర్నర్‌తో) ఆడకూడదు.
- కరెంటు వైర్లతో, స్విచ్చులతో, ప్లగ్గులతో ఆడకూడదు.
- ఏదైన తిన్న తరువాత కాగితాలను, తొక్కలను చెత్తకుండీలో (Dust Bin) వేయాలి.
- పుస్తకాలను చక్కగా సర్దుకోవాలి.
- పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం.
- అసత్యం ఆడకూడదు.
- ఆకలిగొన్న వానికి అన్నము పెట్టుము.
- ఒకరి మీద చాడీలు చెప్పరాదు.
- తనను తాను పొగడు కొనరాదు.
- తల్లిదండ్రులను కష్ట పెట్టరాదు
- విద్య చెప్పిన వారిని మరువరాదు.
- పెద్దల మాటలు వినవలెను.
- పేదల మీద దయ ఉంచవెలెను.
- స్వామి యందు భక్తి నుంచుము.
- సజ్జనులతో స్నేహము చేయవలెను.
- ఎల్లప్పుడూ దైవచింతన చేయుము.
- నమ్మిన వారిని మోసం చేయరాదు.
- మనిషికి మాటే అలంకారం.
- మాట వెండి, మౌనం బంగారం.
- గురువుల మాట వినాలి.
- పరనింద పనికిరాదు.
- తొందరపడి ఏ పనీ చేయరాదు.
- ఆటలాడుచోట, అలుక పూనరాదు.
- మంచిని మించిన గుణం లేదు.
- ఆడిన మాట తప్పరాదు.
- పెద్దలను గౌరవించాలి.
- చెడువారి చెలిమి చేయరాదు.
- చేసిన మేలు మరువరాదు.
- జీవహింస చేయరాదు.
- బీదలను చూసి హేళన చేయవద్దు.
- నోరు మంచిదయితే, ఊరు మంచిదవుతుంది.
- మంచి అలవాట్లకు మించిన ధనం లేదు.
Telugudanam.co.in
| | | | |