|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
ఆ మూల గదిలో
పెళ్ళికూతుర్ని ముస్తాబు చేస్తున్న ఆ ఈడు అమ్మాయిలు అతన్ని చూసి అవాక్కయిపోయారు. కాళ్ళకు పారాణి పెడుతున్న పావని పెరట్లోని పెసర పుణుకులు గుర్తుకు వచ్చాయంటూ నెమ్మదిగా జారుకుంది. అక్కడి నుండి. జడలో మల్లెల్ని పేర్చి అందాల్ని అమర్చుతూన్న మానస పెళ్ళిపందిరిలో పన్నీటి బుడ్డి మరచిపోయానంటూ పరుగులు తీసింది.
సిగ్గులమొగ్గల్ని మోస్తున్న నందినికి విషయం అర్థం కాలేదు. అసలే పెళ్ళికూతురేమో అందాలు వంటిమీద ఆభరణాల్లాగే బరువెక్కి ఉన్నాయి. 'ముఖానికి సగం పూర్తి అయిన అలంకారాలు ఇక చాలులే ఓపలేకున్నాను' అంటున్నాయి. పరుచుకున్న పరువాలు పట్టు తప్పుతున్నాయి.
నందినికి అదోలా ఉంది. తడబాటుతనం తన్నుకొస్తోంది. తడారిన పెదాలు తీపిగా వణుకుతున్నాయి. పైట పట్టు తప్పి జారి స్థానభ్రంశం చెందుతోంది. ఇక ఆగు ముహూర్తానికి మూడు గంటలేగా అని సర్ది చెప్పబోతే, కదలలేని కాలం విరహగీతాన్ని ఆలపిస్తోంది. తనకు తానుగా తీపి ఊహలతో తపించిపోతోంది నందిని. స్థానభ్రంశం చెందుతోంది. ఇక ఆగు ముహూర్తానికి మూడు గంటలేగా అని సర్ది చెప్పబోతే, కదలలేని కాలం విరహగీతాన్ని ఆలపిస్తోంది.
తనకు తానుగా తీపి ఊహలతో తపించిపోతోంది నందిని. పెళ్ళికొడుకు ఎలా ఉంటాడో దాచుకున్న అందాల్ని దోచుకోడానికి వస్తున్నాడు. ఇంకెంత మూడు గంటలలో మూడు ముళ్ళు. . .ముప్పై ఆరు గంటలలో మూడు రాత్రులలో మొదటిది.
నందిని ఊహ. . .ఊపిరి ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. పైట మాటు పరువాలు ఉరకలేస్తున్నాయి. ఊరికే ఉండే ఆడతనపు అందాలు గాలి పోసుకొని ఊహల్ని సింగారిస్తున్నాయి. కట్టుకుందామనుకున్న పట్టుచీర పట్టుజారిపోతోంది.
"ఎదురు సన్నాహానికి టైము అవుతోంది. మగపెళ్ళివారిని పిలుచుకురండి. పానకం బిందెలు సిద్ధం చెయ్యండి. పెళ్ళి పెద్ద బయట పెద్దగా అంటున్నాడు.
ఈలోగా "పెళ్ళికొడుకు విడిదిలో కన్పించడం లేదర్రో!" అంటూ ఎవరో ఆకతాయి అబ్బాయి అరచిన అరుపుకి అందరి దృష్టి అటువైపు మళ్ళింది.
మీసాలు నెరిసిన మీరయ్య "పెళ్ళి కూతురు ఉందో లేదో చూడండి" అన్నాడు తనేదో పెద్ద జోక్ వేసినట్లు ఫీలవుతా! ఈ తతంగమంతా నందిని చెవిని బడుతూనే ఉంది. ఒక్కసారి ఫక్కున నవ్వు వచ్చింది ఆమెకు.
తలుపులు మూసుకున్నట్లు ఠక్కున శబ్దం అయింది.
"కనిపించడం లేదట . . .తాళి కట్టడానికి తంటాలు పడుతున్నాడనుకుంటా" తనలో అనుకుంటూనే పైకి అనేసింది.
ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అటు చూసింది.
"తంటాలు పడేది అందుకుగాదు . . .ఇందుకు!" కొంచెం దగ్గరగా వచ్చి అన్నాడు. ఆమె శరీరం రంగు పాల కడలితో పోటీ పడుతున్నట్లుంది. అందమైన ఆ శ్వాసకి క్షీర కెరటాలు ఎగిసిపడుతున్న అనుభూతి కలుగుతోంది. చిన్నగా నవ్విన చిరునవ్వు నవరత్నాల కూటమిలా అనిపిస్తోంది. ముక్కు సంధ్యా కిరణంలా మెరుస్తోంది. నక్షత్రాల లాంటి నయనాలు, పిడికిడికి సరిపోయే నడుము, వెన్న ముద్దలాంటి బుగ్గలు దానికి నల్లని చుక్కబొట్టు.
చూస్తుంటే మనసు మయూరమై ఆడుతోంది అతనిలో.
పావని పెసర పుణుకులు, మానస పన్నీటి బుడ్డి ఎందుకు కనబడలేదో అర్థమయింది నందినికి. కళ్ళలోని సిగ్గు సింగారించుకుందేమో అడ్డుపడ్డ చేతుల వెనక ఒరిగిపోయింది.
మరింత దగ్గరకు వచ్చినట్లు కాళ్ళకింద పడినలిగిన అప్పడాల చిటపటల చప్పుడు తెలియజేస్తోంది.
"పెళ్ళివారి విడిది ఆ మూల గది. ఇక్కడ పనేమిటో తమరికి" అంది సిగ్గుతో చేతివేళ్ళ మధ్య నుంచి తొంగి చూస్తూ.
"భువన విజయం . . . నందినీ అనుగ్రహం" అన్నాడు కొంటె బాణాల్ని సంధిస్తూ.
తన తొలిప్రాయపు అందాలకి కమలాప్తుని రశ్మి సోకినట్లయింది.
"దారి ఎలా తెలిసింది?"
"చీమల దండుకి తీపి దారి ఎలా తెలుస్తుంది?"
నెమ్మదిగా కళ్ళను మూసిన చేతులు పక్కకు తొలిగాయి.
"భువన్" మధురంగా అంది.
"నందినీ" ఆ మధురానికి మత్తును జోడిస్తూ అన్నాడు.
"మూడు గంటల ముందే . . ."
"ఓవలేని తీపి బాధ" తీయగా మూల్గింది.
నందిని చేతులు భువన్ చేతులతో జత కలిశాయి. ఒక్కోసారి బిగుసుకుంటున్నాయి. చూపుల తాపంతో నలిగిపోతున్నాయి. ఆ విద్యుల్లత శాఖోపశాఖలై అందాల కూడలికి విస్తరిస్తోంది.
వారిద్దామనుకున్నా వద్దుకాక వద్దు అంటోంది చిలిపి ఊహ. తేనెపట్టు లేదుగాని, తేనెటీగ కుట్టినట్లయింది. వలపు వానలో తడవబోతున్న అందాల్ని ముందే ఆరబోయాలన్న ఆలోచన ఆమెలో.
భువన్ దృష్టి సగం కుట్టి వదిలిన మల్లెల జడలో చిక్కుకుంది. నెమ్మదిగా దగ్గరకు తీసుకున్నాడు. మల్లెల మంచంపై శయనించిన అనుభూతి కలుగుతోంది.
పెళ్ళికొడుకు బుగ్గన ఉన్న నల్లచుక్క చెరిగిపోయి, తమ హద్దుల్ని కూడా చెరిపేసుకోమంటోంది. నుదుట పెట్టిన పెళ్ళిబొట్టు కరిగిపోయి తమను కరిగిపొమ్మంటోంది.
"నందూ!" రసకందాయానికి రంగం సిద్దం చేస్తూ అన్నాడు.
"ఊ" అంది మాటలు లేని మౌన భాషతో.
"ఊ ఏమిటి ఊ" కళ్ళు తమ పని కట్టిపెట్టి చేతులకి ఒప్పగించింది. ఎక్కడెక్కడో తడుముతున్నాడు. వెళ్ళిన ప్రతిచోట అపూర్వ స్వాగతం లభిస్తోంది. వలపు వీచిక వీనుల విందుగా వీస్తోంది. ప్రక్కగా ఒరిగింది. ఆ వయ్యారం ముందు అడ్డుగోడలా ఉన్న పెళ్ళిచీర చటుక్కున తప్పుకుంది. ఒంపు సొంపులు వేడి పుట్టిస్తున్నాయి. ఆ విరహ వేడిమి ముందు ఎయిర్‌కూలర్ చల్లదనం విస్తుబోతోంది. భుజాల దగ్గరాగిన చైతన్య యాత్ర, తన విజయ యాత్రకోసం తంటాలు పడుతోంది. పోటీ లేదు. ఏకగ్రీవం అని భుజాలనంటిన భుజకీర్తులు భజన ప్రారంభించాయి.
భువన్ చటుక్కున నందినిని మీదకు లాక్కున్నాడు. చిరుగాలికి కూడా నిలువలేనట్టు మల్లెచెండులా వాలిపోయింది. తపన రెంటినీ ఒకటి అంటోంది.
కాలం ప్రకృతి చేతిలో నలిగిపోతోందనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఎదురుగా ఉన్న గోడ గడియారం.
పడుచు వాళ్ళ ఉద్రేకం పరిగెత్తే కాలంతో పోటీ పడుతోంది. సెకన్ల ముల్లు నిమిషానికి అరవై అడుగులు వేస్తుంటే, అక్కడ వారి ఉద్రేకం అరవై టు ద పవర్ ఆఫ అరవైలా ఉంది.
సమ ఉజ్జీ అయిన వాలీబాల్ ప్లేయర్స్‌లా . . . బంతి ఏ కోర్టులోనూ నిలవడం లేదు. అందానికి అందం. విరహానికి విరహం . . . తాపానికి తాపం. , ఉఛ్వాసనకు నిచ్వాస . . . అనుభూతికి అనుభూతి. యాక్షన్ రియాక్షన్ . . .కాబోయే భార్యను అపురూపంగా అల్లుకుపోతున్నాడు. అల్లుకున్న కన్నెతీగ పరిమళిస్తోంది. ప్రతిసారీ పడిపోని కెరటంలా ఉవ్వెత్తున పెనవేసుకుపోతోంది. ఒడ్డును తాకి, వెనక్కితగ్గే ఏటిలోని కెరటం అతనయితే స్వేద తనపు ఘర్షణతో, తీపి వేదనలో వేడిని నింపుతోంది కన్నె మందారం.
రగిలించిన ప్రతీసారి రాణించి విజేత అనిపించుకుంటున్నాడు.
"భువూ!" మెత్తని మనసుతో పిలిచింది.
తొలిసారి పెదవి చాటు గుట్టును తెలుసుకోవాలని అలవోకగా అందుకున్నాడు.
"కొంటెతనం కోరుకుంటోంది.
వలపుతనం సాగమంటోంది" విచ్చుకున్న పెదాల నుండి వచ్చీరాని మాటలు తేనె తలపు తూటాల్లా తాకాయి.
"బడుద్దాయివనుకున్నా గడుగ్గాయివే" పోటీ పడలేక వాడిపోయిన మల్లెల్ని భరిస్తూ ఒకవైపు కుదేలైపోయిన కురుల సంపదల్ని అందుకుంటూ అన్నాడు.
"ఇప్పుడేనా! పండు తాంబూలం నాడు ఏం చేశావ్ . . . పిల్ల తాంబూలం ముందుంది."
"తాంబూలం అందుకున్నాగా!"
"తాంబూలం చిక్కినా తాయిలం చిక్కలేదుగా!" అంది చిలిపిగా చూస్తూ.
చక్కనయిన చుక్క బిగి కౌగిలి చిక్కిం తరువాత ప్రణయం పెళ్ళి . . .ఏది ముందైననా ఒకటే! . . .నుదురుపై ప్రేమగా చుంబిస్తూ అన్నాడు.
"అమృతం కురిసినట్లుంది" అంది భువన్ ముఖాన్ని చుట్టేస్తూ.
"కురిసిన ముత్యాల్ని ఏరుకుంటాను" ఎక్కడో చేయి వేయబోతూ అన్నాడు.
"చల్లకొచ్చి ఏదో అడగడం అంటే ఇదే!"
"చల్లనూ కోరలేదు. ముంతనూ అడగలేదు! అన్నీ అమ్మాయిగారే దాచుకున్నారుగా!"
చెప్పాగా బాబూ . . .ఈ బాబుకి భార్యననీ, ఈ గదిలోనే . . .ఇక్కడే . . ."
"హట్సాఫ్"
"ఎందుకో"
"రమించే నీ హృదయానికి" తటిల్లతలా అల్లుకుపోయింది నందిని.
మొదట్లో సామాన్ల గదికి తిరగలేక వంట సామాన్లన్నీ ఆ గదిలోకి చేర్చాడు. బెల్లం, పప్పుదినుసులు, కాయగూరలు తీసుకువెళదామని వచ్చింది వంట ఆమె. తీరావచ్చే సరికి తలుపులు వేసి ఉన్నాయి. చాలాసార్లు ఎవరో ఆడవాళ్ళు గుడ్డలు మార్చుకుంటున్నారేమో అనుకుంది. వంట మేస్త్రి అక్కడి సామాన్లకోసం మళ్ళీ మళ్ళీ కబురుపెడుతూనే ఉన్నాడు.
బయట పెళ్ళికొచ్చిన ఇరువైపులా వారిలోనూ గుసగుసలు ప్రారంభమయ్యాయి. ఆ గదిలో ఏమవుతోందోనన్న చర్చలు వాడిగా వేడిగా జరుగుతున్నాయి. "వీళ్ళిద్దరూ లోపల ఏం అఘాయిత్యం చేసుకుంటూన్నారో! చూడండ్రా!" ఒక ముసలావిడ గొడవచేస్తోంది.
"ఊరుకోవమ్మా! తీపి అఘాయిత్యం చేసుకుంటుంటేనూ!!" ప్రక్కన ఉన్నాయన నానుస్తూ అంటున్నాడు.
"మీరూ ఉన్నారు ఎందుకూ, ఎప్పుడైనా ఇలా చేశారా!" బట్టతల బంగారయ్య పెళ్ళాం మొగుణ్ణి పక్కకు తీసికెళ్ళి చెవి కొరుకుతుంటే ఉన్న రెండు వెంట్రుకల్ని పట్టుకు కూర్చున్నాడు.
అంతవరకు కట్నం చాలలేదు, లాంఛనాలు నప్పలేదు' అంటూ విడిది ఇంట్లో అమ్మాయి తండ్రి ఎదుట గోలచేసి భీస్మించుకు కూర్చున్న భువన్ తల్లిదండ్రులు కొడుకు నిర్వాకానికి నీరసపడిపోయారు.
ఇక ఆడపెళ్ళివారు అయితే సరేసరి. మేడమీద మూలగది మూసి ఉండేసిరికి ముసిముసిగా నవ్వుకునేవారు కొందరైతే . . ఏమవుతుందోనని టెన్షన్ ఫీలయ్యేవారు మరికొందరయ్యారు.
"మనవాడు ఏమో అనుకున్నాం. . .ఫరవాలేదు" పెళ్ళికి వచ్చిన భువన్ స్నేహితులు క్లీన్ చిట్ ఇచ్చేశారు.
ఆ వైపు వారిలోను . . .ఈ వైపు వారిలోను, వచ్చిన అందరిలోను ఒకటే అభిప్రాయం.
"జరగబోయే పెళ్ళి నామమాత్రం . . . పెళ్ళికి ముందు పడుచుదనాల వడ్డింపు జరిగిపోయిందని".
"చూస్తున్న చోద్యం చాలు . . అసలే ముహూర్తానికి ఉన్నది పావుగంట. ఎదురు సన్నాహం ఎగిరిపోయింది. గౌరీపూజ గంగలో కలిసిపోయింది. కనీసం బయటకు వచ్చి ఒకరినొకరు నెత్తిమీద చేతులు పెట్టుకుంటారా. . .లేక నా నెత్తిన చేతులు పెడతారా!"
పురోహితుడు దబాయించేసరికి అందరిలోను వేడి పుట్టింది. ముహూర్తపు ఘడియలు దగ్గరవుతున్నాయని కంగారు మొదలైంది. ఎవరు ముందుకు వచ్చి వాళ్ళను పిలవాలన్న అందరిలోనూ మొహమాటం నెలకొంది.
"పిల్లకి తల్లివి నువ్వేకదా! నచ్చ చెప్పి తీసుకురా!!" అన్నపూర్ణకు పురమాయించబోయే సరికి సిగ్గుతో నోటికి చీరకొంగు అడ్డం పెట్టుకొని జారుకుంది.
"పోనీ బాబాయ్ నువ్వు పిలువ్! భువన్ నీమాట కాదనడు!" పెళ్ళిపెద్ద అనదగిన పుల్లారావుని అడిగారు.
"చాల్లేవయ్యా! పెళ్ళికి పెద్దనేగాని దీనికి మాత్రం చిన్ననే" అంటూ మెల్లగా పక్కకు వెళ్ళిపోయాడు.
ముహూర్తం ఎనిమిదీ పదికి. గోడ గడియారం ఎనిమిది కొట్టింది. మూసి ఉన్న ఆ తలుపులు నెమ్మదిగా తెరుచుకున్నాయి.
అందరి మనసులు ఆనందంతో విచ్చుకున్నాయి.
అక్కడివారిలో ఉల్లాసం . . .భజంత్రీల ఉత్సాహం నింగినంటాయి.
నందిని చేయునందుకొని బయటకు వచ్చాడు భువన్. అసలే పెళ్ళి సామాన్లన్నీ పెట్టిన ఆగదిలో. . .ఏమయి ఉంటుందన్న టెన్షన్ అందరిలో నెలకొంది.
అంతవరకు మనోహరమైన అనుభవాల్ని అందుకున్న నందిని సిగ్గుతో కుంచించుకుపోయింది.
'బట్ షి ఎంజాయ్డ్ ద ధింగ్స్'
చెప్పాలంటే భువన్‌ని కాదంటూనే అతనితో సహకరించింది. లోపల టమోటా జ్యూస్ ఆమె చీరమీద, అతని మూతిమీద కనిపిస్తోంది. జడపూలు వాడిపోవడం. వంటి చీర నలిగిపోవడం జరిగిపోయింది. చెదిరిన జుట్టు స్థితిని చెప్పకనే చెబుతున్నాయి. అమ్మాయి చిటికెన వేలు పట్టుకొని నేరుగా వచ్చి పీటల మీద కూర్చున్నాడు భువన్.
"పంతులుగారూ! ముహూర్తానికి సమయం రెండు నిమిషాలు మాత్రమే ఉంది కానీయండి". పంతులు "మాంగల్యం తంతునా నేనా" . . అంటుంటే పెళ్ళితంతు ముగిసిపోయింది.
పెద్దగా ఆర్భాటాలు లేకుండానే భువన్ నందినిల ఫస్ట్‌నైట్ ఏర్పాట్లు జరిగిపోయాయి.
'నామమాత్రపు కార్యానికి హంగులేమిటిలే అంటూ మిన్నకుండిపోయారు నందిని తల్లి అన్నపూర్ణతో సహా అందరూ పాలరంగు రాజహంసలా తయారై పాలగ్లాసుతో వచ్చిన కొత్తపెళ్ళాన్ని కౌగిలించుకో బోయాడు.
మొన్న కనిపించిన వంట వస్తువులు, కూరగాయలు మరో ప్రక్క బంధువుల సూట్‌కేస్‌లు కనిపించడం లేదు అక్కడ. చక్కగా మల్లెల పాన్పు ఏర్పాటు చేయబడి ఉంది.
"అబ్బా! అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ ఆ గొడవేనా. ఆరోజు నన్ను సిగ్గుపడనీయలేదు. . కనీసం ఇప్పుడైనా కాసేపు పడనిస్తారా లేదా" అంది తన పరువాలతో రంగరించిన పాల గ్లాసు నందిస్తూ.
"ఇలా సరసం ఆడినియకబోతే. . .వారం రోజుల్లో సింగపూర్ పోతానే అప్పుడెలా?" అన్నాడు బ్రతిమాలుతున్న ధోరణిలో.
"నిన్న అందరి ముందు అలా అవమానం చేస్తారని అనుకోలేదు. అసలు నేను ఎలా కనబడుతున్నాను!" అంది చెదిరిన చీరను సర్దుకొని కూర్చుంటూ.
"పిచ్చిదానా! నాకుమటుకు మంచీ మర్యాద తెలియవనుకున్నావా. ఉద్యోగం నిమిత్తం గత ఏడు సంవత్సరాల నుండి సింగపూర్‌లో ఉండిపోయాను. అప్పుడు డబ్బు సంపాదనే నా లక్ష్యం. తీరా ఇండియా వచ్చేసరికి నా స్నేహితులందరూ పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కనేశారు. అప్పుడు తెలిసింది . . .నాకూ పెళ్ళీడు వచ్చేసిందని.
సంబంధాలు చూడమని అమ్మా నాన్నలకి లెటర్స్ రాశాను. వాళ్ళు డబ్బు మనుషులు. మా నాన్నకి లక్షల రూపాయలు కట్నం కావాలి. నాకుమటుకు నీలాంటి ఒక మంచి అమ్మాయిని ఆదర్శ వివాహం చేసుకోవాలని కోరిక. పెళ్ళిచేసుకొని భార్యతో సింగపూర్ వెళ్ళిపోవాలని నెల రోజులు సెలవు పెట్టుకొని వచ్చాను. నాన్న విషయం విసుగనిపించ సాగింది. 'డబ్బు. . .డబ్బు' అనేవాడు. కట్నం తీసుకోను అంటే నిలువెత్తు లేచేవాడు. ఎదురు తిరిగి చాలావరకు వాళ్ళను కంట్రోల్ చేయగలిగాను. క్రమంగా మా వాళ్ళ పద్ధతిలో విసిగిపోయాను. నాలో ఏదో నిస్సత్తువ ఆవహించసాగింది. పెళ్ళికి పెళ్ళాం దొరుకుతుందా అనిపించింది. ఒక స్టేజీలో నాకు పెళ్ళి కాదు అని తేల్చేసుకున్నాను. నిజం చెప్పాలంటే మా నాయన నాకు పెళ్ళి కానివ్వడు. నా బాధను ఫ్రెండ్ ప్రతాప్‌తో చెప్పుకునేవాడిని.
"నీ అభిరుచికి తగిన మనిషి దగ్గరకు తీసుకెళతాను, లేకపోతే నీకు పెళ్ళికాదు. . .ఆ అనుభవమూ రాదు. దారం విప్పేయ్! ముప్పైలోకి వచ్చావ్. స్టిల్ అస్కలితంగానే ఉండిపోయావ్" ప్రతాప్ మాటలు బాధను కలిగించాయి నాకు.
"మన జీవితంలోకి వచ్చిన మనిషి కన్యగా ఉండాలని కోరుకుంటాము. మరి వాళ్ళూ మనల్ని అలాగే ఉండాలని కోరుకుంటారు గదా!" అన్నాను.
ఆ క్షణంలో వాడు నన్ను పిల్లాణ్ణీ చూసినట్లు చూశాడు.
"ఓరి నా పిచ్చి భువనా! నువ్వన్నట్లే ఆలోచిద్దాము. పెళ్ళి అయిన తరువాత ఏమీ ఉండదు. మన సొంతం అయ్యేసరికి అంతా ఓపెన్ అయిపోయింది. ఎప్పుడూ దొంగ ముద్దులోనే రుచి ఎక్కువ" అంటూ రెచ్చగొట్ట సాగాడు.
ఇక కట్నం లాంఛనాల దగ్గర మా అమ్మానాన్నలు వెనక్కిపోవడం భరించలేక పోయాను. నిన్ను చూసిన తరువాత . . .ఐ డిసైడెడ్, యస్ షీ ఈజ్ ద గర్ల!
అమ్మాయి. . .లంగా. . .ఓణీ. . .జడ కుచ్చులు ప్రతాప్ భావన. . . నా ఊహల్ని కలిపితేదానికి రుపం నువ్వు అయ్యావు.
అక్కడ పెళ్ళి పందిరిలో కూడా మా నాన్న డబ్బు విషయాన్ని పట్టుకు లాగడం మొదలు పెట్టాడు. ఒక స్టేజీలో తెగిపోతుందేమో. . . పెళ్ళి ఆగిపోతుందేమోనని భయపడ్డాను.
ప్రతాప్ సలహాతో అందరి దృష్టి దానిమీద నుండి మళ్ళించడానికి ఆ క్షణంలో ఆ సాహసం చేయక తప్పలేదు.
వింటూన్న నందిని హృదయం కరిగిపోతోంది. చెప్పకుపోతున్న ఆ పెదిమలు ఎంతో అపురూపంగా అనిపించసాగాయి.
ఇక ఆగలేను అన్నట్లు తన పెదిమలతో పెనవేసుకుపోయింది. ఆ నాలుగు అధరాలు వారిలో వేడిని రగిలిస్తున్నాయి. అంతవరకూ లేని 'ఆ అనుభవం' కోసం రగులుతున్న కోర్కెల వేడి కొంగజపం చేయసాగింది.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in