|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
సి.పి.బ్రౌన్
తెలుగు
సాహిత్యానికి పునప్రతిష్ఠ చేసిన మహోన్నత వ్యక్తిగా సి.పి.బ్రౌన్ చిరస్మరణీయుడు.
1825 ప్రాంతాల్లో దాదాపు అంధకారం కప్పివేయబడివున్న తెలుగుకు వెలుగులు నింపి నేటి
వైభవానికి కారణభూతుడైన బ్రౌన్‌ను అభిమానించని తెలుగువాడు ఉండడు. దేశం నలుమూలలా
చెల్లాచెదురుగా పడివున్న సాహిత్య గ్రంధాలన్నింటినీ సేకరించి, విభిన్న తాళపత్రాలలో
నిక్షిప్తమైయున్న కావ్యాలను కాగితాల మీదకు ఎక్కించి, పండితుల చేత సవరింపజేసి తెలుగు
జాతికి తెలుగు సాహితీ సంపదను దానం చేసిన సాహితీ కర్ణుడు బ్రౌన్.డేవిడ్ బ్రౌన్,
ఫ్రాన్సిస్ కాలేల ద్వితీయ కుమారుడైన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (సి.పి.బ్రౌన్) 1817లో
చెన్నపట్నంలోని సెంట్ జార్జ్ కోట కాలేజిలో సివిల్ సెర్వంట్ విద్యార్ధిగా చేరాడు.
తెలుగు మరియు మరాఠీ ప్రాంతీయ భాషలను ఎంచుకొని విద్యాభాసం చేశాడు. వెలగపూడి
కోదండరామయ్య గారు బ్రౌన్‌కు తెలుగులో అక్షరాభ్యాసం చేయించి, తెలుగు రాయడం, చదవడం
నేర్పించారు. బ్రౌన్ మరాఠీ కంటే తెలుగుపట్లే ఎక్కువ మక్కువ చూపేవాడు. 1823లో ఆబే
దుబాయ్ రచించిన "హిందువుల ఆచారాలు" అనే గ్రంధాన్ని బ్రౌన్ చదివి అనేక విజ్ఞానం
సంపాదించాడు. 1824లో ఆబే దుబాయ్ రచించిన ఒక పుస్తకాన్ని చదువుతూ ఆ పుస్తకం ద్వారా
కడప జిల్లాలో ఓ గొప్ప కవి ఉన్నాడని తెలుసుకున్నాడు. ఆ కవే ప్రజాకవి వేమన.
మచిలీపట్నం జిల్లాకు రిజిస్ట్రార్‌గా పనిచేస్తున్న కాలంలో మచిలీపట్నం కోర్ట్‌లో అమీనుగా ఉంటున్న తిప్పాభట్ల వెంకట శివ శాస్త్రి ద్వారా ద్వారా వేమన ప్రతిని పొంది ఆ తాళపత్ర ప్రతిలోని పద్యాలను కాగితాల మీదకు ఎక్కించాడు. 1825 ఏప్రిల్ 25 నాటికి ఆ పద్యాల చిత్తు పరిష్కరణ, ఆంగ్లీకరణ ముగించాడు. 1825లో ఆయన "విష్ణు పురాణం" చదివాడు. విష్ణు పురాణంలోని అహల్య చరిత్ర ఆయనను అమితంగా ఆకట్టుకుంది. వెంటనే మడికి సింగన ఆ ఘట్టాన్ని ఇంగ్లీషులోకి అనువదించాడు. వ్రాతప్రతులు పుట్టించడానికి, తీర్పు ప్రతులు సిద్ధపరచడానికి పద సూచికలు వ్రాయడానికి ఆయన కొలువులో ఎప్పుడూ 10 నుంచి 20 దాకా బ్రాహ్మణులు, శూద్రులు ఉండేవారు. ఇంతమంది విద్యావంతులు కృషిచేయబట్టే బ్రౌన్ ఆంధ్ర సాహిత్య సౌధాన్ని రూపొందించగలిగాడు.1837 లో " The Grammar of Telugu Language " అనే వ్యాకరణ గ్రంధాన్ని రచించాడు. 1839లో ఈయన దృష్టి ద్విపద కావ్యాలపై పడింది. తెలుగు గ్రంధాలను సామాన్య కావ్యాలు, మహా కావ్యాలు అని రెండు వర్గాలుగా విభజించవచ్చన్నాడు. రామరాజు భూషణుడు రచించిన "వసుచరిత్ర"ను ఈయన అచ్చువేయించాడు. 1849లో తన స్వంత ఖర్చులతో "ఆముక్త మాల్యద" కు శబ్ద సూచిని తయారుచేయించాడు.
1849లో గుర్రపు స్వారీ చేస్తుండగా గుర్రం మీద నుంచి క్రిందపడి కుడి చేయి బ్రొటన వ్రేలు విరగడంతో బ్రౌన్ ఎడమ చేత్తో రాయడం సాధనచేసి నిఘంటువు ప్రూఫులను ఎడమచేత్తోనే దిద్ది అచ్చెరువొరచాడు. ఈయన మొత్తం 34 సంవత్సరాలపాటు కంపెనీ సర్వీసులో భారతదేశంలో ఉండి 3 దశాబ్దాలపాటు తెసుగు భాషా సరస్వతాలకే తన జీవితాన్ని అంకితం చేశాడు. తెలుగు ప్రజలంతా తనకు చదువు చెప్పిన గురువులే అని ఎంతో వినమ్రంగా చాటిన బ్రౌన్ తెలుగు సాహిత్యం ఉన్నంతవరకూ చిరంజీవిగా వెలుగొందుతాడు.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in