www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

కవితలు

ఆ నవ్వులో

నిన్నటి దిగులు లేదు

రేపటి బాధ లేదు

ఆ నవ్వు

హిమానీనదం అంత స్వచ్ఛంగా

హిమాలయాలంత అందంగా

ఆ నవ్వు

నిన్నని మరిపిస్తూ

రేపటిని తలపకు రానీకుండా

నేడు నా ముందు నిలచింది సాకారమై

ఆ నవ్వును

ముందెన్నడూ చూడలేదు

ముందెన్నడూ అనుభవించలేదు

ఆ నవ్వు

మనసును మారుస్తూ , మాయచేస్తూ

వేసవిలో చల్ల గాలిలా హాయిగొలుపుతూ

నా ముందు నిలచింది సాకారమై.

నేను సముద్రం ఒడ్డున నిల్చోని

నేను సముద్రం ఒడ్డున నిల్చోని,

అలలు చూస్తూ, ఉప్పు గాలి పీలుస్తూ

నెమరు వేస్తుంటే ఒకడొచ్చి,

?అచ్చు నీలాటివాడిని ఆ ఒడ్డున చూశా? అన్నాడు.

వెళ్దామనిపిచ్చి పడవ వాడిని అడిగా,

?రేపు? అన్నాడు, అంతే, ఈదుతూ వెళ్ళీ చూశా -

అవును, నాలాటి వాడే!

కౌగిలించుకోని వచ్చేశా.

నే వీధి వైపు నిల్చోని,

వచ్చే వారిని పొయ్యేవారిని చూస్తుంటే,

?గులాబీ తోట విరగ కాసింది?

అన్నాడొకడు మొహమంత నవ్వుతో!

వెళ్దామనిపిచ్చి బండి వాడిని అడిగా,

?రేపు? అన్నాడు, అంతే, పరుగెత్తి వెళ్ళి చూశా -

అవును, విరగ కాసింది!

కళ్ళతో కౌగిలించుకోని వచ్చేశా.

నే ఊరి చివర నిల్చోని,

అటా, ఇటా అని ఆలోచిస్తుంటే,

?కోటలో రాణి కుందనపు బొమ్మ?

అన్నాదొకడు చేతులటూ ఇటూ తిప్పుటూ!

వెళ్దామనిపిచ్చి తోటివాడినడిగా,

?రేపు? అన్నాడు, అంతే, ఒంటిగా వెళ్ళా -

అవును, కుందనపు బొమ్మే!

కౌగిలించుకోని ఉండిపోయా!


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in