telugudanam.co.in

మా అనుబంధ వెబ్‌సైట్...

telugudukanam.co.in

కవితలు

మీరంతా కొండలు తొలచి శిల్పాలు చెక్కుతుంటే

మీరంతా కొండలు తొలచి శిల్పాలు చెక్కుతుంటే

నేనేమిటో ఇలా నీళ్ళలో గులకరాళ్ళు విసిరేస్తున్నాను



మీరేమిటో అద్భుతాలు సాధిస్తుంటే

నేనేమిటో ఇలా నీళ్ళలో మునుగుతూ, తేలుతూ మిమ్మళ్ని చూస్తున్నాను



మీరంతా కొండలు తొలచి శిల్పాలు చెక్కుతుంటే

నేనేమిటో ఇలా గాలీ, నేలా చూస్తున్నాను.



మీరంతా కొండలు తొలచి శిల్పాలు చెక్కుతుంటే

నేనేమిటో ఇలా పాడుతూ దరువేస్తున్నాను.



మీరంతా కొండలు తొలచి శిల్పాలు చెక్కుతుంటే

నేనేమిటో ఇలా పిల్లోడిలా కేరింతలు కొడుతున్నాను.


గాంధీ - కవిత్వం

ఒకరోజు ఒక బక్క పద్యం

గాంధీని చూద్దామని

గాంధీ ఆశ్రమానికి వచ్చింది.

గాంధీ రామ నామం స్మరిస్తూ



నూలు వడకుతూనే ఉన్నాడు

వాకిలి దగ్గర వేచి ఉన్న పద్యాన్ని చూడనేలేదు.

తాను భజన అయినా కానందుకు సిగ్గుపడుతూ

పద్యం గొంతు సవరించుకొంది.



గాంధీ కనుకొలకుల్లోంచి చూశాడు

నరకాన్నే చూసిన కళ్ళద్దాలలోంచి చూశాడు

"ఎప్పుడైనా నూలు వడికావా?" అని అడిగాడు.

"పాకీవాడి బండిలాగావా?



పొద్దున్నే పొగతో ఉక్కిరిబిక్కిరి అయే

వంటింటి పొయ్యి దగ్గర ఉన్నావా?

ఏనాడైనా ఆకలికి అలమటించావా?"

పద్యం జవాబిచ్చింది:



నేను అడవుల్లో ఉన్నాను

వేటగాడి నోట్లో పుట్టాను

చేపలు పట్టేవాడు

తన గుడిసెలో నన్ను పెంచాడు



అయినా నాకు ఏ పనీ రాదు

బాగా పాడగలను

మొదట రాజసభలలో పాడేదాన్ని

ఆ రోజుల్లో బొద్దుగా, ముద్దుగా ఉండేదాన్ని



కాని ఇప్పుడు వీధినపడ్డాను

అర్ధాకలితో ఉన్నాను."

"అదే మేలు" అన్నాడు గాంధి

చాటుగా నవ్వుతూ.



అప్పుడప్పుడూ సంస్కృతంలో మాట్లాడే

అలవాటు నువ్వు మాలాలి.

పొలాల్లోకి పో.

అక్కడ రైతుల మాట్లు విను."



పద్యం ధాన్యపు గింజగా మారింది

పొలం దున్నేవాడు వస్తాడని

తొలకరి వానకు తడిసిన

మట్టిని పెల్లగిస్తాడని

పొలాల్లో ఎదురుచూస్తూ పడి ఉంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం