www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

భాగవతులు

భగవంతునికి సంబంధించిన గాధలను ప్రచారం చేయడం వలన వీరిని భాగవతులు అన్నారు. ఆంధ్ర దేశంలో నృత్య కళను అభివృద్ధిలోకి తీసుకొచ్చిన వారిలో వీరి స్థానం ప్రత్యేకమైంది. వీరు యక్ష గానాలూ, వీధి భాగవతాలూ, భామాకలాపాల ద్వారా నృత్య కళను ప్రచారం చేశారు. వీరిది నాట్య మేళ సాంప్రదాయం. పురాణాలకు సంబంధించిన ఇతివృత్తాలను నృత్య నాటకాలుగా ప్రదర్శించే సంప్రదాయం నాట్యమేళ లేక భాగవత మేళ సంప్రదాయం. ఈ సంప్రదాయంలో స్త్రీలు పాల్గొనరు. స్త్రీ పాత్రల్ని కూడా పురుషులే ధరిస్తారు. భాగవత మేళాల ద్వారా నృత్యకళను పోషించినవారు కూచిపూదు, పొతకమూరి, కోటకొండ మరియు మేలటూరు భాగవతులు.

ప్రప్రధమంలో కూచిపూడి వారు గొల్లకలాపాన్ని ప్రదర్శించేవారు. తరువాత భామాకలాపం ప్రచారంలోకి వచ్చింది. భామాకలాపాన్ని నేటికీ వీరు ప్రదర్శిస్తూనే ఉన్నారు. గొల్లకలాపం మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు తరాలుగా సజీవంగా నిలిచి ఉంది.

గొల్లకలాపం ఇతివృత్తంలో అనేక రకాలైన కీర్తనలు, మట్లు, గమకలు ఉంటాయి. ప్రధాన నాయికకు సహాయంగా మరో సహాయ నాయిక ఉంటుంది. వీరిద్దరూ కాక విదూషక పాత్రధారి ఉంటాడు.  వీరుగాక హంగుదార్లుగా మృదంగం, ఫిడేలు, హార్మోనియం, తాళగాండ్రు ఉంటారు. మొదట్లో ఈ గొల్లకలాపాన్ని వరసగా మూడు రోజులపాటు రాత్రివేళ ప్రదర్శించేవారు. అయితే కాలమాన పరిస్థితుల దృష్ట్యా ప్రదర్శనను ఒకే రోజుకు కుదించారు.

అంధ్ర దేశంలో ప్రఖ్యాతి వహించిన వీధి భాగవతాలలో కూచిపూడి వీధి భాగవతాలు గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాయి. వీరేగాక గొల్ల భాగవతులు, యానాది భాగవతులు, మాల భాగవతులు, చిందు భాగవతులు మొదలైనవారు భాగవతాలను ప్రదర్శించారు. సిద్దేంద్ర యోగి రచించిన భామాకలాపాన్ని కూచిపూడి వీధి భాగవతులు అధిక ప్రచారంలోకి తీసుకొచ్చారు. దీనికీ, తూర్పు వారు ప్రదర్శించే భామాకలాపానికీ వ్యత్యాసముంది. కూచిపూడి వారి భామాకలాపంలో దరువులు తూర్పు భామాకలాపంకంటే ఎక్కువ


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in