www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

కోలాటం

పిల్లల్నీ, పెద్దల్నీ అందర్నీ అలరించే కళారూపమిది. సాధారణంగా వీటిని తిరుణాళ్ళ సమయంలోనూ, ఉత్సవాలలోనూ ప్రదర్శిస్తుంటారు. కోల మరియు ఆట అనే రెండు పదాల కలయిక వల్ల ఈ పదం ఏర్పడిందంటారు. కోల అంటే కర్రపుల్ల అని అర్ధమనీ, ఆట అంటే క్రీడ, నాట్యం అనే అర్ధాలుండడంతో కోలాటం అంటే కర్రతో ఆడే ఆట అనే అర్ధంగా భావించవచ్చు. విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ కోలాటల ప్రదర్శన ప్రసిద్ధంగా జరిగినట్లు అబ్దుల్ రజాక్ అనే చరిత్రకారుడు వర్ణించాడు. విజయనగర శిధిలాలపై కోలాటం ఆడుతున్న నర్తకీమణుల శిల్పాలను నేటికీ మనం చూడవచ్చు.

ఈ కోలాటం పట్ల ఆసక్తి ఉన్న కొందరు ఒక బృందంగా  ఏర్పడి, ఈ నృత్యాన్ని చేస్తారు. కళాకారులందరూ వర్తులాకారంగా నిలబడి ఇష్ట దేవతా ప్రార్ధన చేసిన అనంతరం ఆట ప్రారంభిస్తారు. బృందం నాయకుణ్ణి కోలన్న పంతులనీ, అయ్యగారనీ పిలుస్తారు. ఆత ప్రారంభం, ముగించడం అనేది ఇతని సంజ్ఞల మీదే ఆధారపడి ఉంటుంది. ఇరవై నుంచి నలభై మంది ఆటగాళ్ళ వరకు ఇందులో ఉంటారు. సంఖ మాత్రం ఎప్పుడూ సరి సంఖ్యలోనే ఉంటుంది. అందరూ ఒకే విధమైన దుస్తులతో, కళ్ళకు గజ్జెలతో చూడముచ్చటగా ఉంటారు. కోలాటంలో అనేకమైన గతిభేదాలుంటాయి. వాటిని కోపులు అంటారు. కోపు అంటే నాట్య గతి విభేదం. ప్రాంతాలనుబట్టి కోపుల పేర్లు మారుతూ ఉంటాయి. రాత్రీ, పగలూ ఈ ప్రదర్శనలుంటాయి. కేవలం ఒక ప్రదర్శనగా మాత్రమే గాక కోలాటంలో జడకోపు కోలాటం అనే ప్రత్యేకమైన అంశం ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ఆటగాళ్ళందరూ సమ సంఖ్యలో తాళ్ళు పట్టుకుని గుండ్రంగా నిలిచి రెండు పక్షాలుగా చీలుతారు. లయ ప్రకారం రెండు భాగాలుగా నిలబడిన కేంద్రం నుంచి మరో కేంద్రానికి ఒకరి తర్వాత మరొకరు వరస క్రమంలో తిరగడంతో ఈ తాళ్ళన్నీ అల్లబడిన జడలాగా ఎంతో సుందరంగా కనబడుతుంది. జడను ఎలా అల్లారో అలాగే మరలా ఎదురు తిరిగి విడదీస్తారు. ఈ జడకోపు కోలాటం ఓ అద్భుతమైన నాట్య విశేషం.

పసిపిల్లలనుంచి పెద్దల వరకు ఎంతో ఉత్సాహంగా పాల్గొనే ఈ కోలాట ప్రదర్శన నేటికీ తన ఉనికిని కాపాడుకుంటూనే ఉంది. గ్రామాల్లో దీనికి లభిస్తున్న ప్రోత్సాహాలే అందుకు కారణం.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in