www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

ద్రాక్షారామం

రాజమహేంద్రవరం నుండి బస్సులున్నాయి. కాకినాడ నుండి కూడా బస్సులున్నాయి. ఈ క్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఆఖరిది. చాలా పురాతనమైన ఆలయం. ఇక్కడి స్వామి భీమేశ్వరస్వామి. ఈ వాటిక యందు దక్ష ప్రజాపతి అనేక యజ్ఞాలు చేసిన పవిత్ర స్థలమయినందున ద్రాక్షారామమని పేరు వచ్చిందట.

క్షేత్ర వైభవం

భీమేశ్వర స్వామి లింగము స్ఫటిక లింగము. సుమారు 15 అడుగుల పైగా ఎత్తుంటుంది. అభిషేకాదులు చేయటానికి పైన రెండవ అంతస్తునుంచి చేయవలసిందే. పంచారామాల్లో ఒకటిగాను, జ్యోతిర్లింగాల్లో ఆఖరిదిగాను చెప్పబడే ఈ శైవక్షేత్రం చాల మహిమమాన్వితమైనదని చెప్పకోవచ్చు. 12వ శతాబ్దం చివరన వేములవాడ భీమకవి స్వామి నారాధించి వాక్శుద్ధి కలిగిన వాడయ్యాడని ప్రతీతి. 15వ శతాబ్దంలోని ప్రౌఢ కవి మల్లన, రుక్మాంగద చరిత్రమును, కవిసార్వభౌముడు, ఆంధ్ర నైషధకర్త శ్రీ నాధుడు తన భీమేశ్వర పురాణమును, మరి యింకా మల్లి ఖార్జున పండితుడు, సూరన కవి మొదలగు ప్రాచీన కవులెందరో స్వామి మహత్యమును వేనోళ్ళ ప్రశంసించటం జరిగింది.

ఆలయ ప్రాకారాలు, గోపురాలు చాళుక్య భీముడు నిర్మించినవనీ, అందుచేత ఈ స్వామి భీమేశ్వరస్వామి అని పేరు సార్ధకమయిందని మరో కథ.

 


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in