www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

పోలి స్వర్గమునకు వెళ్ళు వ్రతము

కార్తీక మాసం చివరి రోజు చీకటితో లేచి అంటే సూర్యుడు తులా రాశిలో ఉన్నప్పుడే  లేచి మిగిల రోజులు చేసినట్టుగా (నెల రోజులు చేసి నట్టుగా) స్నానం చేసి అరటి డొప్పలో ఒత్తిని వెలిగించి చెరువులో కాని ఒక బేసిన్‌లో నీళ్ళు పొసి కాని దీని వొదులుతూ ఈ కథను చదువుకోవాలి.

ఒక చాకలిముసలికి ఐదుగురు కోడుకులువున్నారు. ఆ చాకలిది ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలు కార్తీక అమావాస్య వరకు తెల్లవారుజామునలేచి, యేటిలో స్నానముచేసి దీపములు పెట్టు కొనుచుండెడిది. అట్లొక నెల చేసిన పిమ్మట నదికార్తీక బహుళ అమావాస్యనాడు చిన్నకోడలిని యింటికి కాపలాగనుంచి, పెద్దకోడండ్లను ముగ్గురును  వెంటబెట్టుకొని నదియొడ్డునకు వెళ్ళెను. ఆ చిన్న కోడలు చల్ల చేసి కవ్వమునంటియున్న వెన్న తీసి, ప్రత్తి చెట్టుకింద రాలిన ప్రత్తి గింజలతో వత్తిచేసి, ప్రమిదలో పెట్టుకొని నూతి దగ్గర స్నానము చేసి జ్యోతి వెలిగించుకొనెను. కాని అత్తగారువచ్చి తిట్టునను భయముతో ఆ దీపముమీద చాకలిబాన కప్పెను. దేవతలు దానిభక్తికి మెచ్చి విమానము బంపి, దానిని బొందెతో స్వర్గమునకు రప్పించుచుండిరి. ఆ విమానములోనున్న చాకలిదాని చిన్న కోడలును చూచి దగ్గర నున్న వారందరు "చాకలి పోలి స్వర్గమునకు వెళ్ళుచున్న" దని ఆశ్చర్య పడసాగిరి. ఆ మాటలను విని చాకలి, దాని ముగ్గురు కోడండ్లు పైకి చూచిరి. అంతలో పోలియెక్కిన విమానము వారి నెత్తి మీదనుండి పోవుచుండెను. వారు వెంటనే పోలికాళ్ళు పట్టుకొని స్వర్గమునకు పోవుచుండిరి. అదిచూచి విష్ణుదేవుడు "ఈ పోలి అధిక భక్తితో జ్యోతివెలిగించినది. కాని మీరు కల్మష హృదయముతో అశ్రద్ధగా జ్యోతులు వెలిగించిరి. కావున మీకు స్వర్గమునకువచ్చు నదృష్టము లేదు పొండు" అని త్రోసి వేసి పోలిని బొందెతో స్వర్గమునకు తీసుకొని వెళ్ళెను.

దీనికి వుద్యాపనము లేదు.

మూలం: స్త్రీలవ్రత కథలు, మారిశెట్టి నాగేశ్వరరావు, శ్రీ సీతారామా బుక్ డిపో.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in