www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

ఇంధ్రధనస్సులాంటి ఇంటికోసం

పూర్వం ఇంటికి ముదురు రంగులు వేయించుకోవడానికి ఇష్టపడే వాళ్లు కాదు. లేత రంగులని మాత్రమే వాడేవాళ్లు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారి ముదురు రంగులను వాడటం ఫ్యాషన్ అయ్యింది. పెయింట్ వేయించడం వల్ల ఇంటికి కొత్త అందం వస్తుంది. పెయింటింగ్‌లో షేడ్లు, రంగులు, టోన్‌లు ఇలా ప్రతీ ఒక్క విషయానికి ప్రాధాన్యత ఉంటుంది. పెయింట్ వేయడం వల్ల ఇంటికి అందంతో పాటు వాతావరణ ప్రభావాల నుంచి రక్షణ కూడా లభిస్తుంది. ఒక్కో రంగుకి ఒక్కో ప్రత్యేకత ఉన్నా వేరే రంగుతో కలిసినప్పుడు భిన్నంగా కనిపిస్తాయి. ఏ రంగు ఎలా ఉంటుందో ఆ వివరాలే ఇవి...

* పసుపు, ఎరుపు రంగులు కంటికి నిండుగా కనిపిస్తాయి. కొట్టొచ్చినట్టు ఉండే ఈ రంగులు ఉత్సాహాన్నిస్తాయి. వీటిని ఎంపిక చేసుకునే ముందు కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎలాగంటే అలా తీసుకుంటే మరీ గాడిగా కనిపిస్తాయి.

* పోస్టల రంగులైన పౌడర్ పింక్, బేబి బ్లూ, సాఫ్ట్ గ్రీన్‌లు చూడగానే హాయిగా అనిపిస్తాయి. ఎంత ఒత్తిడితో ఉన్నప్పటికీ ఈ రంగుల వల్ల మనసుకు కాస్త ప్రశాంతత లభిస్తుంది.

* ముదురు రంగులు గదిని తేజోవంతంగా ఉంచుతాయి. పెద్ద గదులకు ఈ రంగులే బాగా నప్పుతాయి. పోస్టల్ రంగులు డల్‌గా అనిపిస్తాయి. అందులోనూ సూర్యకాంతి పడకుండా కరెంట్ ద్వారానే వెలుగు వచ్చే గదుల్లో ఈ రంగులు వాడితే వాతావరణం మరింత డల్‌గా తయారవుతుంది.

* కొన్ని రంగులని వేరే రంగు పక్కన వేస్తే భిన్నంగా ఉంటాయి. పసుపు రంగును బ్రౌన్ రంగు పక్కన వేస్తే పసుపు రంగు కంటికి హాయిగా ఉంటుంది. ఆకుపచ్చ రంగు పక్కన పసుపు రంగు వేస్తే మాత్రం కొట్టొచ్చినట్టు ఉంటుంది.

* పోస్టల్ లేదా లేత రంగులు వేస్తే గది పెద్దగా కనిపిస్తుంది. ముదురు రంగులు కొట్టొచ్చినట్టు కనిపించినప్పటికీ గది చిన్నదిగా అనిపిస్తుంది.

* గదికి రెండు మూడు రంగుల కాంబినేషన్‌లు కూడా వాడొచ్చు. ఇలాంటప్పుడు వేసిన రంగుల్లో ఒక షేడ్ మిగతా రంగులను మించి కనిపించేలా ముదురుగా ఉండాలి.

గదికో రంగు

లివింగ్ రూం/హాల్

హాల్‌కి తెలుపు లేదా పోస్టల్ రంగులేవైనా వాడొచ్చు. ఇవి ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. అతిధులకు స్వాగతం పలుకుతున్నట్టు ఉంటాయి. ఈ రంగులని ఆతిధ్యానికి నిదర్శనం అని చెప్పొచ్చు.

తలుపులు, కిటికీలు లేని గదికి ముదురు షేడ్లు వాడితే ఆకర్షణీయంగా ఉంటుంది.

ముదురు, లేత రంగులు ఏవైనా కూడా సరైన రంగులు ఎంపిక చేసుకోవడమనేది ముఖ్యం. అలా ఎన్నుకుంటేనే గదికి మీరు కోరుకున్న లుక్ వస్తుంది.

శారీరకంగా, మానసికంగా విశ్రాంతి తీసుకునే గది ఇది. అందుకే దీన్ని సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి. అందుకని ఈ గదికి ఆకుపచ్చ, నీలం, గులాబి వంటి పోస్టల్ రంగులు లేదా న్యాట్రల్ షేడ్లు వాడాలి.

పిల్లల ప్రపంచానికి

పిల్లలు తమ గదిలో ఆడతారు, చదువుతారు, నిద్రపోతారు. అదే వాళ్ల ప్రపంచం. పిల్లల్ని ఆకట్టుకునేలా ఈ గదిలో ఎన్నో ప్రయోగాలు చేయొచ్చు. ముదురు రంగులు వేయడం, గోడల మీద రకరకాల డిజైన్లు వేయడం, ఒకే గోడ మీద రెండు రంగులు వాడటం వంటివి ఎన్నో చేయొచ్చు. పిల్లలకి నచ్చినట్టుగా ఆ గదిని తీర్చిదిద్దొచ్చు.

రంగులతో పాటు ఖర్చు గురించి కూడా తెలుసుకుంటే పెయింట్‌లు వేయించుకునే ముందు స్పష్టమైన అవగాహన ఉంటుంది. ఎంత ప్రదేశంలో పెయింట్ వేస్తున్నారు. ఎలాంటి పెయింట్, డిస్టెంపర్ లేదా ఎమల్షన్ వాడాలనుకుంటున్నారు అనే అంశాల మీద ఖర్చు ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఒక చదరపు అడుగుకి ఆరు నుంచి పధ్నాలుగు రూపాయల వరకు ఖర్చవుతుంది.

మూలం - ఆంధ్రజోతి దినపత్రిక 6 ఏప్రిల్, 2006.

 


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in