www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

సౌందర్య పోషణ

జుట్టుకు, తలకు

శిరోజాలకు తిండి పెడుతున్నారా!

కేశ సౌదర్యం ద్విగిణీకృతం కావాలంటే పౌష్టికాహారం తీసుకోవాలని తెలుసు. అయితే ఎటువంటి ఆహారం తీసుకోవాలన్నదే చాలామందిలో తలెత్తే సందేహం. మీదీ ఇదే అభిప్రాయమైతే ఇది చదవండి. ఒక్కమాట... ఈ అహార ప్రణాళిక రూపొందించుకునే ముందు మీకు రక్తహీనత, ధైరాయిడ్‌, చుండ్రు సమస్యలు ఉన్నయేమో పరీక్ష చేయించుకోవడం మేలు.

శిరోజాల విషయంలో ఇవే అసలు నిజాలు

శిరోజాల విషయంలో కొందరికి కొన్ని అపోహలుంటాయి. మచ్చుకు కొన్ని అపోహలు, అసలు నిజాలు చూద్దాం.

తరచూ వెంట్రుకల్ని ట్రిమ్‌ చేస్తే బాగా పెరుగుతాయి.

ఇది తప్పు. ఆరోగ్యంగా ఉండే వ్యక్తుల్లో నెలకు అరంగుళం చొప్పున శిరోజాలు పెరుగుతాయి. హార్మోన్లు తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా పెరుగుదల తీరు ఉంటుంది. తరచూ ట్రిమ్‌ చేస్తుండటం వల్ల చిట్లిన వెంట్రుక కొసలు ఉండవు. అందంగా కనిపిస్తాయి అంతే.

తెల్లవెంట్రుక ఒక్కటి తీసేస్తే అక్కడ రెండు పెరుగుతాయి.

వెంట్రుక మూలాలు ఎన్ని ఉంటే అన్నే వెంట్రుకలు వస్తాయి. అంతే కానీ ఒక్క తెల్ల వెంట్రుక తీసేస్తే ఆ స్ధానంలో రెండు తెల్ల వెంట్రుకలు పెరుగుతాయనుకోవడం అపోహ మాత్రమే.  శిరోజాన్ని బలంగా లాగడం వల్ల మూలాలు బలహీనంగా తయారవుతాయి. దాంతో తలకట్టు పలుచగా అవుతుంది.

మందుల వాడకతోం చిట్లిన శిరోజాల చివర్లను బాగు చేయవచ్చు.

చిట్లిపోయిన జుట్టు చివర్లను కలపడం ఏ మందుల వల్లా సాధ్యం కాదు. ఆ మేరకు కత్తిరిమడం మినహా మరే మార్గం లేదు.

బద్దకించకండి!

శిరోజాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ దువ్వెనల విషయంలో మాత్రం ఎక్కడలేని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తాం. జిడ్డు, మురికి చేరి శిరోజాలను బలహీనం చేస్తాయవి. అందుకే తల దువ్వుకునే బ్రష్‌లు దువ్వెనలు శుభ్రపరచడంలో బద్ధకించకండి.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in