|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్..
|
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
మామిడి పండ్లతో పసందైన పదార్ధాలు
ఋతువులో ప్రతి గృహిణి మామిడితో ఊరగాయ తయారు చేస్తుంది. మామిడి కాయలతో చేసే మరికొన్ని వంటకాలను ఇక్కడ అందిస్తున్నాము. ఇవి చల్లగా, రుచికరంగా ఉంటాయి.
మాంగో ఖీర్: తియ్య మామిడి గుజ్జు తీసి వడగట్టండి. తరువాత దీన్ని ఒక స్టైన్‌లెస్ పాత్రలో పోసి, దానితో సమానమైన నీటిని కలపండి. అతి నెమ్మదిగా ఉడక బెట్టండి. దీనికి చక్కెర పాకం కలుపుతూ బాగా కదపండి. అది గట్టిపడగానే, కొబ్బరి పాలు చేర్చి మరోసారి కాగపెట్టండి. స్టవ్ నుంచి తీసి ద్రాక్ష వంటి ఎండిన పండ్లను దీనితో కలపండి.
మాంగో ఐస్‌క్రీం: ఒక కిలో పండిన మామిడి పండ్లు, 5 చెంచాల చక్కెర, 11/2 లీటర్ల పాలు, 4 ఔన్సుల మీగడ, ఒక ఔన్స్ రోజ్ వాటర్. మామిడి పండ్లను తోలు ఒలిచి, గుజ్జును ఒక మిక్సర్లో వేసుకోండి. అరకప్పు పాలను చేర్చండి. ప్రత్యేకంగా చక్కెర వేసిన పాలను కాచండి. అది గట్టిపడగానే మామిడి రసం దీనిలో పోసి కలియబెట్టండి. దీనికి రోజ్ వాటర్ కూడా చేర్చండి. మీ ఫ్రిడ్జ్‌లోని ఐస్ ట్రేలో వీటన్నిటిని భద్రం చెయ్యండి. పేరుకు పోయిన తరువాత మీగడ చేర్చి, మళ్ళీ ఘనీభవింపచేయండి.
మామిడి హల్వా: 8 కప్పుల పండిన మామిడి పళ్ళరసం, 1 కిలోగ్రాం చక్కెర, 4 పైంట్ల పాలు, 1/2 కిలో గ్రాం నెయ్యి, 1/2 కప్పు బాదంకాయల తునకలు, ఎండిన ద్రాక్షపళ్ళు మొదలైనవి. ఒక పెద్ద బాణలిలో మామిడిరసం, చక్కెర, పాలు వేడిచేయండి. మధ్యస్థమైన వేడిలో వీటిని బాగా కలియతిప్పుతూ ఉండండి. ఈ మిశ్రమం గట్టిపడేవరకూ. ఇది లేహ్యం మాదిరిగా తయారు కాగానే నెయ్యి చేర్చి కలియబెట్టండి. పాత్ర అంచులకు అంటుకుపోకుండా ఈ మిశ్రమాన్ని కలియబెట్టండి. కొద్ది నూనెను ఒక పళ్ళేనికి పూయండి. ఈ మిశ్రమాన్ని దానిలో పోయండి. తర్వాత గింజలు మొదలైన వాటితో దీన్ని అలంకరించండి.
మామిడితో రుచికరమైన పదార్ధం: 1/2 కిలో మామిడి పండ్లు, 200 గ్రాముల పాలు, నారింజ పండ్ల పానీయం లేక ఒకటి, రెండు నిమ్మరసపు బొట్లు, 6 ఔన్సుల మీగడ మరియు చక్కెర. మామిడి పండ్ల రసాన్ని ఒక మిక్చ్సర్‌లో పోయండి. చక్కెర మరియు నారింజ, నిమ్మ రసాలను వేడినీటిలో చేర్చండి. మామిడి రసం, పాలు, మీగడలను కూడా దీనికి కలపండి. తరువత మిక్చ్సర్‌లో కాసేపు వేయండి. తయారయిన వస్తువు రుచికరంగా ఉంటుంది.
బర్ఫీ: మిక్సర్లో చూర్ణమయిన ఒక పూర్తి కప్పు కొబ్బరిని తీసుకోండి. ఒక పక్వమైన మామిడి పండు రసం తీసుకుని, ఒక చెంచాడు నెయ్యి చేర్చి వేడి చేయండి. ఇది గట్టిపడగానే స్టవ్ నుంచి తీసి ఒక కప్పు పాలు, కొబ్బరి, ఒక చెంచాడు చక్కెర కలిపి బాగా గట్టిపడి, పాత్రకు అంటుకోనంత వరకూ కలియబెట్టండి. ఏ పండ్లనైనా దీనికి కలిపి చల్లపడనివ్వండి. తరువాత నలుచదరుగా కోసి అత్యంత రుచికరమైన బర్ఫీగా తయారుచేసుకోండి.
పులావ్: బసుమతి బియ్యం 3 కప్పులు, 1కిలో పక్వమైన మామిడి పండ్ల రసం, 1 లీటర్ పాలు, 1 కప్పు జున్ను, 2 కప్పుల చక్కెర, 3 చెంచాల నెయ్యి, 2 నిండు చెంచాల రోజ్‌వాటర్, 11/2 చెంచా కుంకుమ పువ్వు, 25 బాదంకాయలు, 10 ఏలకకాయలు 6 లవంగాలు, 4 దాల్చిన చెక్కలు, చిటికెడు ఉప్పు, పాలను, మామిడి రసాన్ని కలిపి రెండు సమభాగాలుగా ఉడికించండి. మూడు సార్లు బియ్యాన్ని కడిగి శుభ్రం చేసి వడబోయాలి. ఒక స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలో మామిడిరసం, పాల మిశ్రమంతో కలిపి ఉంచాలి. దీనికి ఒక కప్పు నీరు, లవంగాలు, ఏలకకాయలు, దాల్చిన చెక్క, ఉప్పు చేర్చాలి. కొంతసేపు కాగానే రోజ్‌వాటర్ కుంకుమ పువ్వు చేర్చి, మొత్తమంతా మూత బెట్టి తేలికపాటి వేడిలో ఉడకపెట్టాలి. ఇది సిద్దం కాగానే బాదంకాయ ముక్కలను దీనిపైన గుచ్చాలి. రుచికరమైన పులావ్ మీ కోసం సిద్దమైంది.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in