www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

వంటలు(కొన్ని)

సోయా పన్నీర్ పఫ్

కావలసిన వస్తువులు:

సోయా పన్నీర్ - 100 గ్రా.

పుదీనా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర - సరిపడినంత.

కర్న్ ఫ్లోర్ - 10 గ్రా.

ఉప్పు - సరిపడినంత.

రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.

తయారు చేసే విధానం:

ముందుగా పుదీనా, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు మిశ్రమాన్ని రుబ్బుకోవాలి. సోయా పన్నీర్ సన్నగా నిలువుగా కట్ చేసుకోవాలి. ఒక్కో పన్నీర్  స్లైస్ పై అల్లం, పుదీన మిశ్రమాన్ని పరిచి ఆపై పన్నీర్ తో మూసివేసి దాన్ని కార్న్ ఫ్లోర్ లిక్విడ్ లో అద్ది నూనెలో దోరగా వేయించాలి. వేడిగా ఉన్నప్పుడే సోయా సాస్ తో కలిపి అతిథులకు అందించండి.

మసాల బీన్స్

కావలసిన వస్తువులు:

సోయా చిక్కుళ్ళు - 150 గ్రా.

ఉల్లిపాయలు - 80 గ్రా.

టమాట - 40 గ్రా.

వెల్లుల్లి - 20 గ్రా.

అల్లం - 10 గ్రా.

పచ్చి మిర్చి - 5 గ్రా.

పసుపు - 5 గ్రా.

ఛాట్ మసాలా - 5 గ్రా.

రిఫైండ్ ఆయిల్ - 5 మి.లీ.

ఉప్పు - సరిపడినంత.

తయారు చేసే విధానం:

సోయా చిక్కుళ్ళను శుభ్రంగా కడిగి ఒక రాత్రంతా నానబెట్టి ఆపై కుక్కర్ లో పది నిమిషాలు ఉడికించాలి. అల్లం, వెల్లుల్లి, టమాట, ఉల్లిపాయలు, పచ్చి మిర్చిలను సన్నగా తరిగిపెట్టుకోవాలి.

కడాయిలో నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి వేసి దోరగా వేగాకా ఉల్లిపాయలు, టమాట ముక్కలు వేసి సన్నని సెగపై ఉడికించాలి. పచ్చి మిర్చి, ఉప్పు, పసుపు, మిర్చిపొడి, చిక్కుళ్ళు వేసి రెండు నిమిషాలు ఉడికించాక రెండు కప్పుల నీళ్ళు పోసి మరో పది నిమిషాలు సన్నని సెగపై ఉడికించాలి. పైన ఛాట్ మసాలా చల్లాలి. వేడిగా ఉన్నప్పుడే అతిథులకు అందించండి.

జై పురి ఛాట్

కావలసిన వస్తువులు:

ఆలు - 250 గ్రా.

చాట్ మసాల - 2 టీ స్పూన్లు.

కొత్తిమీర - సరిపడినంత.

మిర్చిపొడి - సరిపడినంత.

ఉప్పు - సరిపడినంత.

చింతపండు చట్ని - సరిపడినంత.

పెరుగు - 2 టీ స్పూన్లు.

ఉల్లిపాయ - 1

టమోట - 1

పచ్చి మిర్చి - 2.

సన్నటి కారంపూస -సరిపడినంత.

సెనగలు (ఉడికించినవి) - 50 గ్రా.

తయారు చేసే విధానం:

ఆలును మెత్తగా ఉడికించి చిన్న సైజు ముక్కలుగా కట్ చేయాలి. గిన్నెలో ఆలు ముక్కలకి చింతపండు చట్నీ, ఛాట్ మసాల, తరిగిన కొత్తిమీర, మిర్చి పొడి, పెరుగు, ఉప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోట, కారంపూస, సెనగలు వేసి మిశ్రమాన్ని చక్కగా కలిపి చిన్న కప్పుల్లో సర్ది పైన కొంత పెరుగు వేసి ఆపై అతిథులకు అందించండి.

స్టఫ్‌డ్ రోల్స్

కావలసిన వస్తువులు:

 ప్రెంచ్‌రోల్ - 1.

 ఉడికించిన బఠాణీ - 2 కప్పులు.

ఉడికించిన పెసర మొలకలు - 1 కప్పు.

 సన్నగా తరిగిన అల్లం - 1 చెంచా.

సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు - 2 చెంచాలు.

చాట్ మసాలా - 2 చెంచాలు.

తరిగిన కొత్తిమీర - 2 గరిటెలు.

తరిగిన ఉల్లిగడ్డ - 1.

ఉప్పు  - సరిపడినంత.

వెన్న - వేయించడానికి సరిపడినంత.

తయారు చేసే విధానం:

ప్రెంచ్‌రోల్‌ను ఐదు ముక్కలుగా కట్‌చేసుకోవాలి. ఒక్కో భాగం ఓ కప్పులా ఉంటుంది. నింపడానికి వీలుగా అడుగు భాగం ఉండేలా చేసుకోవాలి. ఉడికించిన బఠాణీలు కాస్త అటు ఇటుగా చితపాలి. అందులో అల్లం, మొలకగింజలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఉప్పు, చాట్ మసాలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కప్పుల్లాంటి ఒక్కో ప్రెంచ్‌రోల్‌లో నింపుకోవాలి. పైన కాస్త వెన్నను రాయాలి. వీటిని ఓవెన్‌లో పెట్టి 5-10 నిమిషాలు బేక్ చేసుకోవాలి. తరిగిన ఉల్లిముక్కలతో వేడి వేడిగా అందించండి.

కారంచెక్కలు

కావలసిన వస్తువులు:

బియ్యపు పిండి -1 కిలో

పెసరపప్పు - 1/4 కిలో (పొట్టు లేనివి)

డాల్డా లేదా వెన్న - 200 గ్రాములు

అల్లం - 50 గ్రాములు

పచ్చి మిరపకాయలు - 6.

జీలకర్ర - 1 టేబుల్ స్పూన్

ఉప్పు - తగినంత

నూనె - 3/4 కిలో

తయారు చేసే విధానం:

బియ్యపు పిండిని ముందుగా జల్లించుకోవాలి. పెసర పప్పును ఒక గంట నానబెట్టాలి. అల్లం, మిరపకాయలను మెత్తని పేస్టులా చేసుకోవాలి. బియ్యపు పిండిలో నానిన పెసర పప్పును, అల్లం పచ్చిమిరపకాయల మిశ్రమాన్ని, డాల్డాను, జీలకర్రను (జీలకర్రను చేతిలో వేసుకుని నలిపెతే మంచి సువాసన వస్తుంది). తగినంత ఉప్పును వేసి బాగా కలపాలి. ఇప్పుడు పిండిని నాలుగు సమాన భాగాలుగా చెసుకుని ఒక్కో భాగం చొప్పున నీళ్ళతో కలుపుకుంటూ చెక్కలను తయారుచేసి బంగారు రంగు వచ్చేలా నూనెలో కాల్చాలి. పిండిని ఎప్పటికప్పుడు కలుపుతుంటే చెక్కలు బాగా గుల్లగా వస్తాయి. వీటిని పూరీ ప్రెస్ మీద పాలితిన్ పేపర్ వేసి ఎప్పటికప్పుడు ఆ కాగితానికి కొంచెం నూనె రాసుకుంటూ చేసుకుంటే చాలా త్వరగా అయిపోతాయి.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in