|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
కావలసిన వస్తువులు:
|
మైదా |
- |
500 గ్రా. |
|
డాల్డా |
- |
200 గ్రా. |
|
తినేసోడా |
- |
అర టీ స్పూను. |
|
రిఫైండ్ ఆయిల్ |
- |
సరిపడినంత. |
|
చక్కెర |
- |
750 గ్రా. |
|
యాలుకల పొడి |
- |
1 టీ స్పూను. |
|
నెయ్యి |
- |
10 గ్రా. |
|
నీళ్లు |
- |
అర లీటరు. |
తయారు చేసే విధానం:
గిన్నెలో మైదా, సోడా, డాల్డా, తగినన్ని నీళ్లు వరుసగా కలిపి మిశ్రమాన్ని ముద్దలా చేసుకోవాలి. ఆ ముద్దను చిన్న చిన్న ఉండలు చేయాలి. ఒక్కో ఉండ తీసుకుని దాన్ని గుండ్రంగా చేసి మధ్యలోకి నొక్కి బాండీలోని నూనెలో దోరగా వేయించి పెట్టుకోవాలి. పంచదార, నీళ్ల మిశ్రమాన్ని తీసుకుని సన్నని సెగపై తీగపాకం వచ్చేవరకు మరిగించి, ఆపై యాలుకల పొడి, నెయ్యి వేసి కలిపి, వేయించి పెట్టుకున్న బాదుషాలు వేయాలి. పాకంలో పది నిమిషాల పాటు నానబెట్టి తీసేయాలి.
కావలసిన వస్తువులు:
|
చక్కెర |
- |
1 కిలో. |
|
నెయ్యి |
- |
1 కిలో. |
|
మిల్క్‌పౌడర్ (అమూల్) |
- |
250 గ్రా. |
|
మైదా |
- |
250 గ్రా. |
|
యాలుకల పొడి |
- |
1 టీ స్పూను. |
|
నీళ్లు |
- |
అర లీటరు. |
తయారు చేసే విధానం:
మిల్క్ పౌడర్‌లో 150 గ్రాముల నెయ్యి వేసి మిశ్రమాన్ని కలిపి ఉంచుకోవాలి. వేరొక గిన్నెలో పంచదార, నీళ్లు కలిపి తీసుకుని సన్నని సెగపై తీగపాకం పట్టి మిల్క్ పౌడర్ ముద్ద, మైదా వరుసగా వేసి కలపాలి. వేరొక గిన్నెలో మిగిలిన నెయ్యి వేడి చేసి పంచదార, మిల్క్ పౌడర్ మిశ్రమంలో వేసి బాగా కలిపి ట్రేలో వేసి ఆరు గంటల పాటు ఆరబెట్టి కావలసిన సైజులో ముక్కలు చేసుకోవాలి.
కావలసిన వస్తువులు:
|
మైదా |
- |
500 గ్రా. |
|
డాల్డా |
- |
200 గ్రా. |
|
తినేసోడా |
- |
1 టీ స్పూను. |
|
రిఫైండ్ ఆయిల్ |
- |
సరిపడినంత. |
|
బెల్లం |
- |
300 గ్రా. |
|
యాలుకల పొడి |
- |
1 టీ స్పూను |
|
నెయ్యి |
- |
50 గ్రా. |
తయారు చేసే విధానం:
మైదా, సోడా, డాల్డాలను సరిపడినన్ని నీళ్లలో చక్కగా కలిపి ముద్దగా చేసుకోవాలి. ముద్దను బల్లమీద మందంగా పరిచి సన్నగా, నిలువు ముక్కలుగా కట్ చేసి నూనెలో దోరగా వేయించి పెట్టుకోవాలి. బెల్లాన్ని సరిపడినన్ని నీళ్లతో కలిపి సన్నని సెగపై తీగపాకం పట్టి యాలుకల పొడి, నెయ్యి, కాజా ముక్కలు వేసి విడివిడిగా అయ్యేంతవరకు కలపాలి. (అలానే బెల్లం నచ్చని వారు పంచదారతో కూడా చేసుకోవచ్చు.)
మూలం: ఆదివారం వార్త వార పత్రిక, 8, ఆగస్టు, 2004.
కావలసిన వస్తువులు:
|
కాజూ |
- |
1 కిలో. |
|
చక్కెర |
- |
900 గ్రా. |
|
నెయ్యి |
- |
100 గ్రా. |
|
రెడ్ కలర్ |
- |
3 చుక్కలు. |
తయారు చేసే విధానం:
కాజూను అరగంట పాటు నీటిలో నానబెట్టి, గ్రైండర్‌తో రుబ్బి చక్కెర వేసి కలిపి సన్నని సెగపై ఉడికించాలి. చక్కెర కరిగిన తర్వాత నెయ్యి, రెడ్ కలర్ చుక్కలు వేసి కలిపి క్యారెట్ షేపులో ముద్దలు చేసుకోవాలి.
కావలసిన వస్తువులు:
|
బటర్ |
- |
3 కిలోలు. |
|
చక్కెర |
- |
2 కిలోలు. |
|
అమూల్ మిల్క్ పౌడర్ |
- |
1 కిలో. |
|
గ్లూకోజ్ పౌడర్ |
- |
100 గ్రా. |
|
ఐస్‌క్రీం పౌడర్ |
- |
1 టీ స్పూను. |
|
మైదా |
- |
100 గ్రా. |
తయారు చేసే విధానం:
బటర్, మిల్క్ పౌడర్, మైదాలను మిశ్రమం చేసుకోవాలి. గిన్నెలో చక్కెరకు తగినన్ని నీళ్ళుపోసి సన్నని సెగపై తీగపాకం పట్టి బటర్, మైదా మిశ్రమాన్ని, ఐస్‌క్రీం పౌడర్, గ్లూకోజ్ పౌడర్ వరుసగా వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. ట్రే అడుగున నెయ్యి పూత పూసి మైదా మిశ్రమాన్ని ట్రేలో వేసి ఆరబెట్టాలి. ఆరిన తర్వాత కావలసిన సైజులో కట్ చేసుకోవాలి.
మూలం: ఆదివారం వార్త వార పత్రిక 6, మార్చి, 2005.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in