telugudanam.co.in

      telugudanam.co.in

   

వంటలు (కొన్ని)క్రిస్మస్ కేకులు

బత్తాయి కమలాల జ్యూస్ (గంగా - జమున)

కావలసిన వస్తువులు:

కమలాలు - 5.
బత్తాయిలు - 5.
పంచదార - 1 కప్పు.
ఉప్పు - చిటికెడు.
బ్లాక్‌సాల్ట్ (సైంధవలవణం) - చిటికెడు.
ఐసు ముక్కలు - రెండు.

తయారు చేసే విధానం:

బత్తాయి, కమలాపండ్ల రసం తీసి ఉంచుకోవాలి. ఈ రసంలో చక్కెర, ఉప్పు, బ్లాక్‌సాల్ట్, ఐసు వేసుకుని తాగితే వేసవిలో ఎంతో హాయిగా ఉంటుంది.


[ వెనుకకు ]

మూలం: ఆదివారం, ఈనాడు ఏప్రియల్ 24, 2005.


బందర్ హల్వా

కావలసిన వస్తువులు:

గోధుమపిండి - 1 కిలో.
జీడిపప్పు - 100 గ్రా.
బెల్లం - 1 కిలో.
నెయ్యి - 700 గ్రా.
యాలుకల పొడి - 30 గ్రా.
రెడ్ కలర్ - చిటికెడు.
చాక్లెట్ కలర్ - చిటికెడు.

తయారు చేసే విధానం:

గోధుమపిండిని సరిపడినన్ని నీళ్ళతో ముద్దలా చేసి ఒక గిన్నెలో వుంచి ఆ ముద్ద మునిగేలా నీళ్ళు పోసి గంటన్నరపాటు నానబెట్టాలి. గోధుమపిండి ముద్దను బాగా కలిపి, వచ్చే గోధుమ పాలను వడగట్టి వుంచుకోవాలి. వడగట్టి వుంచిన గోధుమ పాలలో పైకి తేరుకున్న నీళ్ళు కొన్ని తీసేసి దానిలో రెడ్‌కలర్, చాక్లెట్ కలర్ కలపాలి. వేరే గిన్నెలో బెల్లం ముక్కలకు సరిపడినన్ని నీళ్ళు పోసి ముదురుపాకం వచ్చాక గోధుమపాలు కలపాలి. జీడిపప్పు వేసి కొద్దిసేపటి తరువాత సన్నటి సెగపై బెల్లం, పాలమిశ్రమంలో నెయ్యి కొద్దికొద్దిగా వేస్తూ కలుపుతూ వుండాలి. మిశ్రమాన్ని ట్రేలో వేసి చల్లారాక కావల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి.


[ వెనుకకు ]

మూలం: ఆదివారం, వార్త జనవరి 4, 2004.


మైదా కారా (మైదా చిప్స్)

కావలసిన వస్తువులు:

మైదా - 700 గ్రా.
జీలకర్ర - 20 గ్రా.
డాల్డా - 100 గ్రా.
సోడా - చిటికెడు.
ఉప్పు, మిర్చిపొడి - సరిపడినంత.
జీలకర్ర పొడి - సరిపడినంత.
కరివేపాకు - సరిపడినంత.
రిఫైండ్ ఆయిల్ - సరిపడినంత.
డాల్డా - 100 గ్రా.

తయారు చేసే విధానం:

గిన్నెలో మైదా, జీలకర్ర, ఉప్పు, సోడా, డాల్డా వరుసగా వేసి సరిపడినన్ని నీళ్లతో మిశ్రమాన్ని బాగా కలిపి పెద్ద సైజు వుండలు చేసుకోవాలి. ఒక్కో వుండను పూరీ సైజులో మందంగా వుండేలా ఒత్తి, డైమండ్ షేప్‌లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి నూనెలో దోరగా వేయించాలి. పై నుండి మిర్చిపొడి, వేయించిన కరివేపాకు, జీలకర్ర పొడి కలపాలి.


[ వెనుకకు ]

మూలం: ఆదివారం, వార్త ఆగస్టు 1, 2004


పొట్లకాయ పెరుగుపచ్చడి

కావలసిన వస్తువులు:

పొట్లకాయ (మీడియం సైజు) - 1.
పెరుగు - 100 గ్రా.
పచ్చిమిర్చి - 7.
కందిపప్పు - 1 టీ స్పూను.
మినపప్పు - 1 టీ స్పూను.
చింతపండు - కొద్దిగా.
ఉప్పు - సరిపడినంత.
పసుపు - అర టీ స్పూను.
జీలకర్ర - అర టీ స్పూను.
వెల్లుల్లి - 4 రెమ్మలు.
రిఫైండ్ ఆయిల్ - కొద్దిగా.
పోపు దినుసులు - కొద్దిగా.

తయారు చేసే విధానం:

పచ్చిమిర్చి, కందిపప్పు, మినపప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిలను కళాయిలో దోరగా వేయించి చింతపండుతో సహా మిక్సీ వేయాలి. సగం పొట్లకాయ ముక్కను కూడా మిక్సీ వేయాలి. మిగతా పొట్లకాయను సన్నని ముక్కలుగా కట్ చేసి కొద్దినూనెలో వేయించి పెట్టుకోవాలి. కళాయిలో కొద్దిగా నూనె వేడిచేసి పోపు దినుసులు, పసుపు, కొద్దిగా జీలకర్ర వేసి చల్లార్చాక పెరుగు, పొట్లకాయ పేస్ట్, పొట్లకాయ ముక్కలు వేసి కలపాలి.


[ వెనుకకు ]

మూలం: ఆదివారం, వార్త అక్టోబర్ 2, 2005.


కొర్ర బజ్జీ

కావలసిన వస్తువులు:

శనగపిండి - 250 గ్రా
కొర్ర పిండి (బియ్యపు పిండి) - 500 గ్రా.
జీలకర్ర - 10 గ్రా.
మిర్చి పొడి - 25 గ్రా.
తినే సోడా - చిటికెడు.
ఉప్పు - సరిపడినంత.
రిఫైండ్ ఆయిల్ - 500 గ్రా..
లావు మిర్చి - సరిపడినన్ని.

తయారు చేసే విధానం:

శనగపిండి, కొర్రపిండి, మిర్చిపొడి, ఉప్పు, జీలకర్ర, తినే సోడా అన్నింటిని పొడిగా కలపాలి. గిన్నెలో తగినన్ని నీళ్ళు కలిపి పిండిని మరీ పల్చగా కాకుండా జారుగా కలుపుకోవాలి. మిర్చిని పిండిలో అద్ది కాగుతున్న నూనెలో ఒక్కొక్కటిగా వేసి దోరగా వేయించాలి.


మూలం: ఆదివారం, వార్త సెప్టెంబర్ 12, 2004


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: