telugudanam.co.in

మా అనుబంధ వెబ్‌సైట్...

telugudukanam.co.in

వంటలు (కొన్ని)

అరటికాయ పొడికూర

కావలసిన వస్తువులు:

అరటి కాయలు : 4.
ఉల్లిపాయలు : 2.
పచ్చిమిర్చి : 4.
అల్లం : చిన్న ముక్క
నూనె : 4 స్పూన్లు.
ఆవాలు : 1/2 స్పూను.
ఉప్పు, పసుపు : తగినంత.
ఎండు మిర్చి : 2.
శనగపప్పు : 1 స్పూను.
మినపప్పు : 1 స్పూను.
కొత్తిమీర : 1 కట్ట.
కరివేపాకు : 2 రెబ్బలు.
జీలకర్ర : 1 స్పూను.

తయారు చేసే విధానం:

అరటికాయలను చెక్కు తీయకుండా 3 ముక్కలుగా కోసి ఉప్పు వేసి నీళ్ళలో ఉడికించుకోవాలి. ఉడికిన తరువాత పై చెక్కు తీసి ఒక పళ్ళెంలో పొడిపొడిగా చేసి పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు, ముక్కలమీద చల్లాలి. ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, నూరి పెట్టుకోవాలి. పొయ్యిమీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తరువాత ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు ఆవాలు కరివేపాకు వేసి నూరి ఉంచుకున్న ఉల్లి, పచ్చిమిర్చి ముద్దను వేసి వేగిన తరువాత ఈ అరటికాయ పొడినివేసి బాగా కలిపి కొత్తిమీరను సన్నగా తరిగి వేసి ఉడికిన తరువాత దించాలి.


[ వెనుకకు ]


టమోటా కూర

కావలసిన వస్తువులు:

టమోటాలు : 1/2 కిలో.
ఉల్లిపాయలు : 4.
పచ్చిమిర్చి : 4.
నూనె : 8 స్పూన్లు.
ఆవాలు : 1/2 స్పూను.
ఉప్పు, కారం : తగినంత.
ఎండు మిర్చి : 2.
శనగపప్పు : 1 స్పూను.
మినపప్పు : 1 స్పూను.
కొత్తిమీర : 1 కట్ట.
కరివేపాకు : 2 రెబ్బలు.
వెల్లుల్లిపాయ : 1.
జీలకర్ర : 1 స్పూను.

తయారు చేసే విధానం:

టమోటాలు మరీ పండినవి కాకుండా దోరగా ఉన్నవి ఏరుకొని ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలను ఒలిచి సన్నగా తరిగి ఉల్లిపాయ ముక్కల్లో కలిపి ఉంచుకోవాలి. పొయ్యిమీద గిన్నె పెట్టి నూనెపోసి తాలింపు పెట్టి తరువాత ఉల్లిపాయ, వెల్లుల్లి ముక్కలు వేసి వేగిన తరువాత ఉప్పు, పసుపు, కారం, టమోటా ముక్కలు కూడా వేసి సన్నని సెగ మీద ఉంచాలి. బాగా మగ్గిన తరువాత కొత్తిమీర సన్నగా తరిగివేసి దించాలి.


[ వెనుకకు ]


చిక్కుడుకాయ టమోటా కూర

కావలసిన వస్తువులు:

చిక్కుడు కాయలు : 1/2 కిలో.
ఉల్లిపాయలు : 2.
టమోటాలు : 2.
నూనె : 6 స్పూన్లు.
ఉప్పు, కారం, పసుపు : తగినంత.
ఎండు మిర్చి : 2.
శనగపప్పు : 1 స్పూను.
మినపప్పు : 1 స్పూను.
కొత్తిమీర : 1 కట్ట.
కరివేపాకు : 2 రెబ్బలు.
ఆవాలు : 1/2 స్పూను.
పచ్చిమిర్చి : 4.
జీలకర్ర : 1 స్పూను.

తయారు చేసే విధానం:

చిక్కుడుకాయలు కడిగి ఈనలు తీసి ముక్కలు చేసి, ఉల్లి, టమోటా కూడా కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె పోసి కాగిన తరువాత ఉల్లిముక్కలు వేసి వేగాక చిక్కుడు, టమోటా ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి 1 కప్పు నీళ్ళు పోసి సన్న సెగమీద ఉంచి మగ్గిన తరువాత దించుక్కోవాలి. (అలాగే టమోటాలు బదులుగా వంకాయ కూడా చిక్కుడు కాయలతో కలిపి వండుకోవచ్చు.)


[ వెనుకకు ]


చిక్కుడుకాయ కూర

కావలసిన వస్తువులు:

చిక్కుడు కాయలు : 1/2 కిలో.
నూనె : 6 స్పూన్లు.
ఉప్పు, కారం, పసుపు : తగినంత.
ఎండు మిర్చి : 2.
శనగపప్పు : 1 స్పూను.
మినపప్పు : 1 స్పూను.
కొత్తిమీర : 1 కట్ట.
కరివేపాకు : 2 రెబ్బలు.
ఆవాలు : 1/2 స్పూను.
పచ్చిమిర్చి : 4.
జీలకర్ర : 1 స్పూను.

తయారు చేసే విధానం:

చిక్కుడుకాయలు కడిగి ఈనలు తీసి ముక్కలు చేసి, ఉల్లి, టమోటా కూడా కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె పోసి కాగిన తరువాత ఉల్లిముక్కలు వేసి వేగాక చిక్కుడు, టమోటా ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి 1 కప్పు నీళ్ళు పోసి సన్న సెగమీద ఉంచి మగ్గిన తరువాత దించుక్కోవాలి. (అలాగే టమోటాలు బదులుగా వంకాయ కూడా చిక్కుడు కాయలతో కలిపి వండుకోవచ్చు.)


[ వెనుకకు ]


చిక్కుడుకాయ కూర

కావలసిన వస్తువులు:

చిక్కుడు కాయలు : 1/2 కిలో.
నూనె : 6 స్పూన్లు.
ఉప్పు, కారం, పసుపు : తగినంత.
శనగపప్పు : స్పూను.
మినపప్పు : స్పూను.
కొత్తిమీర : 1 కట్ట.
కరివేపాకు : 2 రెబ్బలు.
ఆవాలు : 1/2 స్పూను.
పచ్చిమిర్చి : 4.
జీలకర్ర : 1 స్పూను.

తయారు చేసే విధానం:

చిక్కుడు కాయలు కడిగి ఈనలు తీసివేసి ముక్కలు చేసి పెట్టుకోవాలి, పొయ్యి మీద గిన్నె పెట్టి తాలింపు వేసి ఈ చిక్కుడు ముక్కలు వేసి, కారం, ఉప్పు వేసి కొంచం నీళ్ళు పోసి మగ్గే వరకు ఉంచి దించాలి. లేదా (ఇలా కూడా చేసుకోవచ్చు చిక్కుడు ముక్కలను పెసరపప్పు వేసి ఉడక బెట్టి అవి ఆరిన తరువాత పొయ్యి మీద మూకుడు పెట్టి తాలింపు వేసి ఆ ఉడికన ముక్కలను వడకట్టి నీరు లేకుండా అందులో వెయ్యాలి ఇలా చేస్తే కూడా మంచి రుచిగా ఉంటుంది.)


[ వెనుకకు ]


సొరకాయ పులుసు

కావలసిన పదార్థాలు :

లేత సొరకాయ : 1.
ఉల్లిపాయలు : 1.
నూనె : 12 స్పూన్లు.
ఉప్పు, కారం, పసుపు : తగినంత.
ఎండు మిర్చి : 2.
శనగపప్పు : 1 స్పూను.
మినపప్పు : 1 స్పూను.
కొత్తిమీర : 1 కట్ట.
కరివేపాకు : 2 రెబ్బలు.
ఆవాలు : 1/2 స్పూను.
పచ్చిమిర్చి : 4.
జీలకర్ర : 1 స్పూను.
చింతపండు : కొంచెం
వెల్లుల్లిపాయ : 1.
బెల్లం : చిన్న ముక్క
మెంతులు : కొంచెం

తయారుచేసే విధానం

సొరకాయ చెక్కు తీసి వెడల్పుగా సన్నగా కోసి ఉంచుకోవాలి. ఉల్లిపాయలు, జీలకర్ర, వెల్లుల్లి రేకులు కలిపి ముద్దగా నూరుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి 8 స్పూన్ల నూనె వేసి కాగిన తరువాత కోసి ఉంచిన ముక్కలు వేసి సన్నని సెగమీద ముక్క మెత్తబడే వరకు వేపాలి. బాగా వేగిన తరువాత క్రిందకు దించాలి. ఈ విధంగా సొరకాయ ముక్కలన్నింటిని వేసి తీసుకోవాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి 4 స్పూన్ల నూనె వేసి తాలింపు వేసి ఉల్లి ముద్దను వేసి కలపాలి. వేపి ఉంచిన సొరకాయ ముక్కలను వేసి ఉప్పు, పసుపు కారం వేసి చింతపండు పులుసు పిసికి వేసి బాగా కలపాలి. ఉడుకుతున్నప్పుడు చిన్న బెల్లం ముక్క వేసి దించే ముందు కొత్తిమీర వేసి దించుకోవాలి. నూనె తక్కువగా ఉండి ముక్కలు మాడి పోతాయనుకుంటే ఇంకా 2 లేక 4 స్పూన్ల నూనె వెయ్యండి.


గోరుచిక్కుడుకాయ కూర

కావలసిన పదార్థాలు :

గోరుచిక్కుడు ముక్కలు : 2 కప్పులు
తాజా పెరుగు : కప్పు (గిలకొట్టాలి)
ధనియాల పొడి : టేబుల్ స్పూను
కారం : 2 టీస్పూన్లు
సెనగపిండి : 2 టీస్పూన్లు
జీలకర్ర : టీస్పూను
ఆవాలు : అర టీస్పూను
ఇంగువ : పావు టీస్పూను
కరివేపాకు : 2 రెబ్బలు
నూనె : 2 టెబుల్ స్పూనులు
ఉప్పు : తగినంత

తయారుచేసే విధానం:

గోరుచిక్కుడు కాయలను ఈనెలుతీసి చిన్నముక్కలుగా కోయాలి. ముక్కలను కుక్కరులో రెండు వుజిల్స్ వచ్చేంతవరకు ఉడికించి నీళ్ళు వంచాలి. ఓ గిన్నెలో గిలకొట్టిన పెరుగు వేసి అందులో ధనియాలపొడి, కారం, సెనగపిండి, ఉప్పు, వేసిబాగా కలపాలి. పాన్లో వేసి బాగా కాగాక జీలకర్ర, ఆవాలు, ఇంగువ వేసి అవి చిటపటమన్నాక కరివేపాకు వేయాలి. తరవాత పెరుగు మిశ్రమం, పావుకప్పు నీళ్ళు వేసి బాగా కలుపుతూ ఐదునిముషాలు మరగనివ్వాలి. చివరగా ఉడికించిన గోరుచిక్కుడుముక్క్కలుకూడా వేసి మూడు నిముషాలు ఉంచి దించాలి. దీన్ని వేడి వేడి రోటీల్లో తింటే బాగుంటుంది.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం