|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
వంటలు (కొన్ని)
కావలసిన వస్తువులు:
|
సగ్గుబియ్యం |
: |
1 గ్లాసు |
|
బియ్యం |
: |
4 గ్లాసులు |
|
నువ్వులు |
: |
1/2 కప్పు |
|
నెయ్యి |
: |
4 టీ స్పూన్లు |
|
వాము |
: |
2 టీ స్పూన్లు |
|
నూనె |
: |
1/2 కిలో |
|
ఉప్పు, కారం |
: |
సరిపడినంత |
తయారుచేసే విధానం
బియ్యం, సగ్గుబియ్యం కలిపి మెత్తగా పిండి చేసుకుని, జల్లించి పెట్టుకోవాలి. వాము చేతిలో వేసుకొని నలిపి పిండిలో వేసి, నువ్వులు, ఉప్పు, నెయ్యి వేసి బాగా కలిపి నీళ్ళు పోసి గట్టిగా కలిపి ఉంచుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి, నూనె పోసి జంతికల గొట్టంలో లేదా చక్రాల గిద్దలో మనకు ఏ రకం జంతికలు కావాలో ఆ రకం తీసుకొని దానితో జంతికలు మాదిరిగా నూనెలో వత్తాలి. అవి వేగిన తరువాత తియ్యాలి. ఇవి చాలా కాలం నిలువ ఉంచాలి.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
పుల్లమామిడి కాయలు |
: |
8. |
|
పెసరపప్పు |
: |
1/4 కిలో. |
|
నువ్వుల నూనె |
: |
1/2 కిలో. |
|
కారం |
: |
1/4 కిలో. |
|
ఉప్పు |
: |
1/4 కిలో. |
|
మెంతులు |
: |
1 టీ స్పూను. |
|
ఆవాలు |
: |
1 టీ స్పూను.. |
|
ఇంగువ |
: |
చిటికెడు. |
|
పసుపు |
: |
చిటికెడు. |
తయారుచేసే విధానం
మామిడి కాయలను శుభ్రంగా కడిగి టెంకతో సహా ముక్కలుగా కోసి పొడిగుడ్డతో తుడిచి ఉంచుకోవాలి. పెసరపప్పుని ఓ బాణలిలో వేయించి మెత్తగా పొడి చేయాలి. పొడిగా ఉన్న పాత్ర తీసుకొని అందులో ముక్కలు, పొడి, ఉప్పు, కారం, పసుపు, పావుకిలో నూనె వేసి బాగా కలపాలి.
స్టౌ మీద బాణలి పెట్టి అందులో ఓ టేబుల్ స్పూను నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, మెంతులు వేయాలి. అవి చిటపటమన్నాక ఇంగువ వేసి దించాలి. ఇప్పుడు పెసరపిండి కలిపిన మామిడి ముక్కలు వేసి బాగా కలపాలి. చల్లారిన తరువాత పచ్చడిని తడిలేని జాడీలో పెట్టి మూడు రోజుల పాటు కదపకుండా ఉంచాలి. తరువాత మిగిలిన నూనె కూడా పోసి మరో సారి తిప్పాలి. ఇప్పుడు పెసర ఆవకాయ రెడీ.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
శనగ పిండి |
: |
4 గ్లాసులు. |
|
వాము |
: |
2 టీ స్పూన్లు. |
|
నూనె |
: |
1/2 కిలో. |
|
బియ్యం పిండి |
: |
1 గ్లాసు. |
|
నెయ్యి |
: |
4 టీ స్పూన్లు. |
|
ఉప్పు, కారం |
: |
సరిపడినంత. |
తయారుచేసే విధానం
ఒక గిన్నెలో శనగ పిండిని, బియ్యం పిండిని జల్లించి, వాము కూడా దంచి జల్లించి వేసి ఉప్పు, కారం, నెయ్యి వేసి కొంచెం నీళ్ళు పోసి గట్టిగా కలిపి ఉంచుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి కాగిన తరువాత జంతికల గొట్టంలో లేక చక్రాల గిద్దలో సన్నని చిల్లుల రేకు ఉంటుంది. దానిని గొట్టంలో బిగించి పిండిని అందులో వేసి నూనెలో వత్తాలి. బాగా వేగిన తరువాత తీసి డబ్బాలో వేసుకోవాలి.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
చిక్కుడుగింజలు |
: |
రెండుకప్పులు |
బియ్యం పిండి |
: |
మూడు కప్పులు |
ఉప్మారవ్వ |
: |
ఒక కప్పు |
పచ్చిమిరపకాయలు |
: |
10 |
జీలకర్ర |
: |
ఒక టీ స్పూన్ |
ఉల్లి ఆకు |
: |
ఒకకప్పు |
కొత్తిమీర |
: |
అర కప్పు |
చాట్ మసాలా |
: |
అర టీ స్పూన్ |
ఉప్పు |
: |
తగినంత |
నూనె |
: |
కొద్దిగా |
తయారు చేసే విధానం:
ముందుగా చిక్కుడు గింజలను ఉడికించుకోవాలి. అందులో నుంచి ఒక కప్పు గింజలు తీసుకుని మెత్తగా దంచుకోవాలి. తర్వాత బియ్యంపిండిలో కొద్దిగా వేడి చేసిన నీరు పోసి అందులో చిక్కుడు గింజలు, దంచిన చిక్కుడుగింజల ముద్ద, ఉప్మారవ్వ, నూరిన పచ్చిమిరపకాయ ముద్ద, వేగించిన జీలకర్ర, చిన్నగా తరిగిన ఉల్లి ఆకు. సన్నగా తరిగిన కొత్తిమీర, చాట్‌మసాలా, ఉప్పు అన్నీ వేసి బాగా కలపాలి. దానిని ఇడ్లీపాత్ర గుంటల్లో నూనె రాసి పెట్టి కుక్కర్లో పదిహేను నిమిషాలు స్టీంపై ఉడికించాలి. కేలరీలతో కూడిన ఈ కుడుములు ఎంతో రుచిగా ఉంటాయి. వీటిని టమాటొసాస్, చిక్కటి పెరుగుతో తింటే రుచిగా ఉంటుంది.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
క్యారెట్ |
- |
అరకిలో |
|
నువ్వులనూనె |
- |
అర కప్పు |
|
ఆవపిండి |
- |
అర టీ స్పూను |
|
మెంతిపిండి |
- |
అర టీ స్పూను |
|
జీలకర్ర పొడి |
- |
పావు టీ స్పూను |
|
కొత్తిమీర పొడి |
- |
టీ స్పూను |
|
ఉప్పు |
- |
తగినంత |
|
బెల్లం |
- |
చిన్నముక్క |
|
నిమ్మరసం |
- |
2 టీ స్పూన్లు |
|
పోపుకోసం |
|
|
|
నూనె |
- |
2 టేబుల్‌స్పూన్లు |
|
ఆవాలు |
- |
పావుటీస్పూను |
|
ఎండుమిర్చి |
- |
ఒకటి (చిన్న చిన్న ముక్కలుగా కోయాలి) |
|
జీలకర్ర |
- |
పావుటీస్పూను |
|
మెంతులు |
- |
పావుటీస్పూను |
|
ఇంగువ |
- |
చిటికెడు |
|
పసుపు |
- |
చిటికెడు |
|
కరివేపాకు |
- |
నాలుగు రెమ్మలు |
తయారు చేసే విధానం :
క్యారెట్‌లను కడిగి తుడవాలి. పీలర్‌తో తొక్క తీసేసి సన్నగా తరగాలి.
పెద్ద బాణలిలో రెండు టేబుల్‌స్పూన్లు నూనె పోసి ఆవగింజలు వేయాలి. అవి చిపటమన్నాక ఎండుమిర్చి ముక్కలు, జీలకర్ర, మెంతులు, ఇంగువ, పసుపు వేసి బాగా వేయించాలి. చివరగా కరివేపాకు వేసి స్టవ్ మీద నుంచి దించాలి.
అందులో కోసి పెట్టిన క్యారెట్ ముక్కలు వేసి ఉప్పు, కారంతో పాటుగా పొడులన్నీ వేసి బాగా కలపాలి. పచ్చడి చల్లారిన తరవాత నిమ్మరసం పోసి, బెల్లం వేసి కలపాలి. మరోసారి పచ్చడిని బాగా కలిపి గాలి చొరని జాడీలో పెడితే నెలరోజుల వరకూ నిల్వ ఉంటుంది.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in