|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
వంటలు (కొన్ని)
కావలసిన వస్తువులు:
|
టమోటాలు |
- |
1 కేజి. |
|
కారం |
- |
1 గిద్ద. |
|
ఉప్పు |
- |
1 డబ్బా. |
|
మెంతి పిండి |
- |
కొంచెం. |
|
చింతపండు |
- |
200 గ్రా. |
తయారు చేసే విధానం :
ముందుగా టమోటాలను శుభ్రంగా కడిగి ముక్కలు కోసి ఒక డబ్బాలో ఉప్పు, టమోటా ముక్కలు వేసి మూడు రోజులు ఊరనివ్వాలి. మూడవ రోజు వాటిని పిండి ఒక కవర్ మీద వేసి రెండు రోజులు ఎండ నివ్వాలి. ముక్కలు తీసిన ఊటలో రెండో రోజు చింతపండు వేసి నానబెట్టాలి. ఆ తరువాత రోజు ముందుగా టమోటా ముక్కలు పోసి రుబ్బి తరువాత చింతపండు, కారం కూడా వేసి రుబ్బి ఝాడీలో పెట్టుకోవాలి. తరువాత తాలింపు పెట్టుకోవటమే లేక పోతే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు. తాలింపులో మెంతిపిండి వేస్తే మంచి సువాసన వస్తుంది.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
ఉసిరికాయలు |
- |
మానెడు. |
|
కారం |
- |
1 డబ్బా. |
|
ఉప్పు |
- |
1 డబ్బా. |
|
ఆవపిండి |
- |
1 డబ్బా. |
|
నూనె |
- |
సరిపడినంత. |
తయారు చేసే విధానం :
ఆవ పిండి: ఆవాలను ఎండలో పెట్టి, ఎండిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి. తరువాత ఆవపిండి, ఉప్పు, కారం కలిపి ఉంచుకోవాలి.
ముందుగా పొయ్యి మీద నూనె పెట్టి కాగిన తరువాత ఉసిరికాయలు అందులో వేసి, ఒక అర గిద్ద నీళ్ళు పోసి ముక్క ఉడికే వరకు ఉంచవలెను. ముక్క ఉడికిన తరువాత ఆ కాయలు తీసి ఒక పళ్ళెంలో పోసి, ఆ ఉప్పు, కారం కలిపిన మిశ్రమాన్ని ఆ కాయలలో వేసి, ముక్కలను ఉడకపెట్టిన నూనెను చల్లార్చి ఆ కాయలలో పొయ్య వలెను. తరువాత పులుపు కావాలనుకునే వారు ఒక నాలుగు నిమ్మకాయలు తీసుకొని వాటి రసం అందులో పిండాలి.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
పండు మిరపకాయలు |
- |
1 కిలో. |
|
ఉప్పు |
- |
డబా మీద కొంచెం. |
|
చింతపండు |
- |
1/4 కిలో. |
తయారు చేసే విధానం :
పండుమిరపకాయలు శుభ్రంగా తుడిచి ఉప్పు, చింతపండు, పండుమిరపకాయలు కలిపి గ్రైండర్ లో వేసి మెత్తగా రుబ్బవలెను, దీనిని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చు.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
చింతకాయలు |
- |
2800 గ్రా. (1 కట్టు). |
|
ఉప్పు |
- |
సోలా గిద్ద. |
|
మెంతులు |
- |
100 గ్రా. |
|
పసుపు |
- |
సరిపడినంత. |
తయారు చేసే విధానం :
ముందుగా చింతకాయలు శుభ్రంగా కడిగి, తుడిచి ఆరబెట్టాలి. తరువాత చింతకాయలు, ఉప్పు, పసుపు, మెంతులు వేసి మెత్తగా తోక్కవలెను. తొక్కిన తరువాత బేషన్‌లో వేసి విత్తనాలు, పీసులు ఉంటే తీసేసి జాడీలో పెట్టుకోవాలి.
[ వెనుకకు ]
|
మామిడికాయ ముక్కలు |
- |
మానెడు. |
|
ఉప్పు |
- |
1 డబ్బా. |
|
కారం |
- |
1 డబ్బా |
|
ఆవ పిండి |
- |
1 డబ్బా. |
|
పసుపు |
- |
కొంచెం. |
|
నూనె |
- |
1/2 కిలో. |
|
మెంతిపిండి (మెంతులు) |
- |
కొంచెం. |
తయారు చేసే విధానం:
ఆవ పిండి: ఆవాలను ఎండలో పెట్టి, ఎండిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి. తరువాత ఆవ పిండి, ఉప్పు, కారం కలిపి ఉంచుకోవాలి.
ముందుగా మామిడికాయలు కడిగి టెంకెతో సహా చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటికి కొంచెం పసుపు, నూనె రాసి ఉంచుకోవాలి. అలా ఉంచితే ముక్క కరకరలాడుతూ ఉంటుంది. అలా 10 నిమిషాలు ఉంచిన తరువాత ఉప్పు, కారం కలిపిన మిశ్రమం కొంచెం నూనె కలిపి ఆ ముక్కలను ఒక జాడీలో పెట్టి మిగిలిన నూనె ఆ పైన పొయ్యాలి. రెండు రోజుల తరువాత మళ్ళీ కలబెట్టాలి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in