|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
వంటలు (కొన్ని)
కావలసిన వస్తువులు:
|
నల్ల మినుములు |
- |
500 గ్రా. |
|
జీలకర్ర |
- |
10 గ్రా. |
|
మిరియాలు |
- |
5 గ్రా. |
|
పచ్చిమిర్చి |
- |
ఆరు. |
|
కొత్తిమీర |
- |
2 కట్టలు. |
|
ఉల్లిపాయలు |
- |
రెండు. |
|
ఉప్పు |
- |
తగినంత. |
|
రిఫైన్డ్ ఆయిల్ |
- |
వేయించడానికి సరిపడినంత. |
తయారు చేసే విధానం :
మినుముల్ని నానబెట్టండి. తరువాత జల్లెడలో వడగట్టి గంటసేపు ఆరబెట్టండి. కాస్త తడిగా ఉన్న మినుముల్లో మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి గట్టిగా రుబ్బండి. ఈ పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలు, ఉప్పు కలపండి. మినప్పిండిని ముద్దలుగా చేసి నూనె పూసిన ప్లాస్టిక్ కాగితం మీద పలుచగా అద్దండి. ఈ పచ్చి వడలపైన తురిమిన కొత్తిమీర అద్దండి. కాగుతున్న నూనెలో వేయించండి. వడలు వేయించేటప్పుడు మంట సన్నగా ఉండాలి. కరకరలాడేలా తయారైన మినప చెక్క వడల్ని చల్లారిన తరవాత మూత గట్టిగా ఉన్న డబ్బాల్లో వేసుకోండి.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
సేమ్యా |
- |
100 గ్రా. |
|
జీడిపప్పు |
- |
2 టేబుల్ స్పూన్లు. |
|
ఎండుద్రాక్ష |
- |
1 టేబుల్ స్పూను |
|
పంచదార |
- |
1 కప్పు. |
|
నెయ్యి |
- |
4 టేబుల్ స్పూన్లు. |
|
కుంకుమపువ్వు |
- |
12 రేకలు. |
|
నీళ్లు |
- |
ముప్పావు లీటరు. |
తయారు చేసే విధానం :
బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి వేడి చేయాలి. జీడిపప్పు, ఎండుద్రాక్ష వేయించి తీయాలి. అదే నెయ్యిలోనే తరవాత సేమ్యాను కూడా వేయించి తీయాలి. సేమ్యా పక్కకు తీసి అదే బాణలిలో నీళ్లు పోసి మరిగించాలి. తరవాత సేమ్యా వేసి ఉడికించాలి. (రంగు బాగా ఉండాలనుకుంటే కొద్దిగా మిఠాయి రంగు కలిపితే సరి) బాగా ఉడికిందనుకున్న తరవాత పంచదార వేసి తిప్పాలి. తరవాత మిగిలిన నెయ్యి వేసి పది నిమిషాలు సిమ్‌లో ఉంచి దించాలి. చివరగా వేయించిన జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి వడ్డిస్తే రుచికరమైన సేమ్యా కేసరి రెడీ.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
ఉడికించిన అన్నం |
- |
మూడు కప్పులు (కాస్త ముద్దయ్యేలా ఉడికించినది). |
|
పచ్చిమిర్చి |
- |
రెండు (సన్నగా తరగాలి). |
|
ఉల్లిపాయ |
- |
ఒకటి (పెద్దది). |
|
టేస్టింగ్ సాల్ట్ |
- |
తగినంత. |
|
గుడ్డు |
- |
రెండు (బాగా గిలకొట్టాలి). |
|
కొత్తిమీర |
- |
కొద్దిగా (తరిగి ఉంచాలి). |
|
నూనె |
- |
వేయించడానికి సరిపడా. |
తయారు చేసే విధానం :
స్టవ్‌మీద బాణలి పెట్టి అందులో ఉడికించిన అన్నంతోపాటు మిగిలిన దినుసులన్నీ వేసి ముద్దగా చేయాలి. ఓ వెడల్పాటి ప్లేటు తీసుకుని నెయ్యి రాసి అన్నం ముద్దని అందులో వేసి అంగుళమున్నర ఎత్తులో అట్లకాడతో సమంగా సర్ధాలి. ఆరిన తరవాత వీటిని కావలసిన ఆకారంలో కొయ్యాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనెపోసి కాగాక కోసిన కేకుల్ని వేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకూ వేయించి తీయాలి. కరకరలాడుతూ ఉండే ఈ రైస్ కేకుల్ని పిల్లలు స్నాక్స్‌లా తినొచ్చు.
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
సోయా గ్రాన్యూల్ |
- |
70 గ్రా. |
|
ఉల్లిపాయలు |
- |
75 గ్రా. |
|
అల్లంవెల్లుల్లి |
- |
అర టీ స్పూన్. |
|
పచ్చిమిర్చి |
- |
ఆరు. |
|
కొత్తిమీర |
- |
1 కట్ట. |
|
నిమ్మరసం |
- |
3 టీ స్పూన్లు. |
|
కారం |
- |
అర టీ స్పూన్. |
|
పసుపు |
- |
పావు టీ స్పూన్. |
|
ధనియాలపొడి |
- |
అర టీ స్పూన్. |
|
చాట్ మసాలా |
- |
అర టీ స్పూన్. |
|
మైదా |
- |
350 గ్రా. |
|
ఉప్పు |
- |
తగినంత. |
|
వనస్పతి |
- |
50 గ్రా. |
|
రిపైన్డ్ ఆయిల్ |
- |
వేయించడానికి సరిపడా. |
తయారు చేసే విధానం :
ముందుగా కూరను సిద్ధం చేసుకోవాలి. సోయా గ్రాన్యూల్స్‌ను నీటిలో పది నిమిషాలు నానబెట్టి పిండి వేయాలి. ఓ గిన్నెలో 30 గ్రాముల నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు వేయించండి. ఆపైన అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కారం, పసుపు, ధనియాల పోడి కలిపి రెండు నిమిషాలపాటు వేయించండి. ఇందులో నానబెట్టిన గ్రాన్యూల్స్ వేసి పొడిపొడిలాడేలా వేయించండి. దించే ముందు కొత్తిమీర, నిమ్మరసం, చాట్ మసాలా కలపండి. ఇప్పుడు కూర సిద్ధంగా ఉన్నట్లే.
మైదాలో వనస్పతి, ఉప్పు కలపండి. బాగా కలియబెట్టండి. ఇందులో కొద్దిగా నీళ్లు జల్లి ముద్దలా చేయండి. దీనిపై తడి వస్త్రాన్ని పది నిమిషాలు కప్పి ఉంచండి. ఈ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేయండి. వీటిని చపాతీల్లా వత్తండి. ఒక్కో చపాతీని సగానికి కోయండి.
సగం కోసిన ముక్కను రెండు చివర్లా జత చేసి శంఖు ఆకృతిలో చేయండి. (జత చేసిన చోట కాస్తంత తడి చేస్తే విడిపోదు). ఇందులో సిద్దంగా ఉన్న సోయా గ్రాన్యూల్స్ కూరను కూరండి. ఇప్పుడు ఖాళీగా ఉన్న వైపు జాగ్రత్తగా మడిచి, చివర్లను గట్టిగా అతికించండి. ఈ సమోసాలను వేడి చేసిన నూనెలో వేయించండి. బంగారు రంగు వచ్చాక తీయండి. సోయా సమోసా సిద్ధం. (ఇదే విధంగా సోయా లేకుండా వట్టి ఉల్లిపాయలు, పచ్చి బఠాణీళ్ళు, చిన్న క్యారెట్ వేసి కూడా సమోసా కూరను తయారు చెసుకోవచ్చు.)
[ వెనుకకు ]
కావలసిన వస్తువులు:
|
బొంబాయి రవ్వ |
- |
అరకప్పు. |
|
మైదా |
- |
అరకప్పు. |
|
నెయ్యి |
- |
4 స్పూన్లు. |
|
సోడా ఉప్పు |
- |
చిటికెడు. |
|
ఉప్పు |
- |
తగినంత. |
తయారు చేసే విధానం :
ముందుగా మైదా పిండి, బొంబాయి రవ్వ జల్లించి ఒకగిన్నెలో పోసి, నెయ్యి, తగినంత ఉప్పు వేసి సరిపడా నీళ్ళతో చపాతీ పిండిలా కలపాలి. ఆ పిండిపైన తడి బట్ట వేసి పది నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తరవాత దాన్ని సమానమైన ఉండలు చేసి అంగుళంన్నర సైజులో పూరీల్లా వత్తాలి. ఒక బాణలిలో నూనె పోసి బాగా కాగిన తరువాత ఒక్కో పూరీని వేయాలి. కాస్త కాలగానే చిన్న స్పూన్‌తో దాన్ని మెల్లగా వత్తితే అది ఉబ్బుతుంది. దాన్ని రెండు వైపులా బంగారు వర్ణం వచ్చే వరకూ వేయించి తీయాలి. దీన్ని బాగా నూనెను పీల్చుకునే టిష్యూ పేపర్ మీద వేయాలి. ఇలా అన్నీ పూరీలను వేయించాలి.
పానీకోసం
కావలసిన వస్తువులు:
|
చింతపండు |
- |
50 గ్రా. |
|
నీళ్ళు |
- |
1 కప్పు. |
|
పిదీనా, కొత్తిమీర |
- |
1 కట్ట. |
|
పచ్చి మిరపకాయలు |
- |
5 లేక 6. |
|
ఉప్పు |
- |
తగినంత. |
|
చెక్కెర (పంచదార) |
- |
2 లేదా 3 టేబుల్ స్పూన్లు. |
|
జీలకర్ర పొడి |
- |
3 టేబుల్ స్పూన్లు. |
|
నిమ్మకాయ రసం |
|
3 టేబుల్ స్పూన్లు. |
ఇక మన అభిరుచిని బట్టి తీపి, కారం రెండు రకాల నీళ్ళనూ తయారు చేసుకోవచ్చు. చింతపండును తీసుకుని కప్పు గోరు వెచ్చని నీళ్ళలో నానబెట్టాలి. ఓ కట్ట పుదీనా, కొత్తిమీర ఆకులకు 5 లేక 6 పచ్చి మిరపకాయలు చేర్చి రుబ్బాలి. దీనికి చింతపండు గుజ్జు, సరిపడా ఉప్పు, ఒకటిన్నర స్పూన్ పానీ పూరి మసాలా (బజారులో దొరుకుతుంది) వేసి రెండు కప్పుల నీళ్లు కలిపితే "కట్టా పానీ" తయారవుతుంది.
2 కప్పుల నీళ్ళలో 2 లేదా 3 టేబుల్‌స్పూన్ల చెక్కెర, 2 టేబుల్‌స్పూన్ల జీలకర్ర పొడి, మూడు స్పూన్ల నిమ్మకాయ రసం వేసి బాగా కలిపితే "మీఠా పానీ" తయార్.
పానీపూరీ కూర కోసం
కావలసిన వస్తువులు:
|
ఆలుగడ్డ |
- |
1. |
|
పచ్చి బఠాణీలు |
- |
25 గ్రా. |
|
పెద్ద సెనగలు |
- |
25 గ్రా. |
|
కార్న్ ఫ్లోర్‌ను |
- |
రెండు స్పూన్లు. |
పానీపూరీలో పెట్టే కూర కోసం ఒక ఆలుగడ్డ, 25 గ్రా. పచ్చి బఠాణీలు, 25 గ్రా. పెద్ద సెనగలు ముందుగా ఉడికించాలి. ఆలుగడ్డను మెత్తగా చేయాలి. ఈ మిశ్రమంలో కాస్త పసుపు, తగినంత కారం పొడి వేసి సన్నని సెగ మీద కాసేపు ఉడికించాలి. రెండు స్పూన్ల కార్న్ ఫ్లోర్‌ను పావు కప్పు నీళ్లలో కలిపి కూరలో పోయాలి. కాస్త ఉడికిన తరువాత పుదీనా, కరివేపాకు ఆకుల్ని వేసి స్టౌ కట్టేయాలి. దానిపైన ఒక క్యారెట్ తురుము, టమోటా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర ఆకుల్ని వేస్తే ఆరోగ్యానికీ మంచిది.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in