telugudanam.co.in

మా అనుబంధ వెబ్‌సైట్...

telugudukanam.co.in

మామిడి పండ్లతో పసందైన పదార్ధాలు

ఋతువులో ప్రతి గృహిణి మామిడితో ఊరగాయ తయారు చేస్తుంది. మామిడి కాయలతో చేసే మరికొన్ని వంటకాలను ఇక్కడ అందిస్తున్నాము. ఇవి చల్లగా, రుచికరంగా ఉంటాయి.


మాంగో ఖీర్:

కావలసినవి:

తియ్య మామిడి గుజ్జు
చక్కెర పాకం
కొబ్బరి పాలు
ఎండు ద్రాక్ష - తగినన్ని

చేసే విధానం:

తియ్య మామిడి గుజ్జు తీసి వడగట్టండి. తరువాత దీన్ని ఒక స్టైన్‌లెస్ పాత్రలో పోసి, దానితో సమానమైన నీటిని కలపండి. అతి నెమ్మదిగా ఉడక బెట్టండి. దీనికి చక్కెర పాకం కలుపుతూ బాగా కదపండి. అది గట్టిపడగానే, కొబ్బరి పాలు చేర్చి మరోసారి కాగపెట్టండి. స్టవ్ నుంచి తీసి ద్రాక్ష వంటి ఎండిన పండ్లను దీనితో కలపండి.


[ వెనుకకు ]

మాంగో ఐస్‌క్రీం:

కావలసినవి:

మామిడి పండ్లు - 1 కిలో
చక్కెర - 5 చెంచాలు
పాలు - 11/2 లీటర్లు
మీగడ - 4 ఔన్సులు
రోజ్ వాటర్ - ఒక ఔన్స్

చేసే విధానం:

మామిడి పండ్లను తోలు ఒలిచి, గుజ్జును ఒక మిక్సర్లో వేసుకోండి. అరకప్పు పాలను చేర్చండి. ప్రత్యేకంగా చక్కెర వేసిన పాలను కాచండి. అది గట్టిపడగానే మామిడి రసం దీనిలో పోసి కలియబెట్టండి. దీనికి రోజ్ వాటర్ కూడా చేర్చండి. మీ ఫ్రిడ్జ్‌లోని ఐస్ ట్రేలో వీటన్నిటిని భద్రం చెయ్యండి. పేరుకు పోయిన తరువాత మీగడ చేర్చి, మళ్ళీ ఘనీభవింపచేయండి.


[ వెనుకకు ]

మామిడి హల్వా:

కావలసినవి:

మామిడి పళ్ళరసం - 8 కప్పులు
చక్కెర - 1 కిలో
పాలు - 4 పైంట్ల
నెయ్యి - 1 కిలో
బాదంకాయల తునకలు - 1/2 కప్పు
ఎండు ద్రాక్ష - తగినన్ని

చేసే విధానం:

ఒక పెద్ద బాణలిలో మామిడిరసం, చక్కెర, పాలు వేడిచేయండి. మధ్యస్థమైన వేడిలో వీటిని బాగా కలియతిప్పుతూ ఉండండి. ఈ మిశ్రమం గట్టిపడేవరకూ. ఇది లేహ్యం మాదిరిగా తయారు కాగానే నెయ్యి చేర్చి కలియబెట్టండి. పాత్ర అంచులకు అంటుకుపోకుండా ఈ మిశ్రమాన్ని కలియబెట్టండి. కొద్ది నూనెను ఒక పళ్ళేనికి పూయండి. ఈ మిశ్రమాన్ని దానిలో పోయండి. తర్వాత గింజలు మొదలైన వాటితో దీన్ని అలంకరించండి.


[ వెనుకకు ]

మామిడితో రుచికరమైన పదార్ధం:

కావలసినవి:

మామిడి పండ్లు - 1/2 కిలో
పాలు - 200 గ్రాములు
నారింజ పండ్ల పానీయం లేక నిమ్మరసపు బొట్లు - 2
మీగడ మరియు చక్కెర - 6 ఔన్సులు

చేసే విధానం:

మామిడి పండ్ల రసాన్ని ఒక మిక్చ్సర్‌లో పోయండి. చక్కెర మరియు నారింజ, నిమ్మ రసాలను వేడినీటిలో చేర్చండి. మామిడి రసం, పాలు, మీగడలను కూడా దీనికి కలపండి. తరువాత మిక్చ్సర్‌లో కాసేపు వేయండి. తయారయిన వస్తువు రుచికరంగా ఉంటుంది.


[ వెనుకకు ]

బర్ఫీ:

కావలసినవి:

కొబ్బరి - ఒక కప్పు
మామిడి పండు రసం - ఒక కప్పు
నెయ్యి - ఒక చెంచాడు
పాలు - ఒక కప్పు
చక్కెర - ఒక చెంచాడు

చేసే విధానం:

మిక్సర్లో చూర్ణమయిన ఒక పూర్తి కప్పు కొబ్బరిని తీసుకోండి. ఒక పక్వమైన మామిడి పండు రసం తీసుకుని, ఒక చెంచాడు నెయ్యి చేర్చి వేడి చేయండి. ఇది గట్టిపడగానే స్టవ్ నుంచి తీసి ఒక కప్పు పాలు, కొబ్బరి, ఒక చెంచాడు చక్కెర కలిపి బాగా గట్టిపడి, పాత్రకు అంటుకోనంత వరకూ కలియబెట్టండి. ఏ పండ్లనైనా దీనికి కలిపి చల్లపడనివ్వండి. తరువాత నలుచదరుగా కోసి అత్యంత రుచికరమైన బర్ఫీగా తయారుచేసుకోండి.


[ వెనుకకు ]

పులావ్:

కావలసినవి:

బసుమతి బియ్యం - 3 కప్పులు
మామిడి పండ్ల రసం - 1కిలో
పాలు - 1 లీటర్
జున్ను - 1 కప్పు
చక్కెర - 2 కప్పులు
నెయ్యి - 3 చెంచాలు
రోజ్‌వాటర్ - 2 నిండు చెంచాలు
కుంకుమ పువ్వు - 11/2 చెంచా
బాదంకాయలు - 25
ఏలకకాయలు - 10
లవంగాలు - 6
దాల్చిన చెక్కలు - 4
ఉప్పు - చిటికెడు

చేసే విధానం:

పాలను, మామిడి రసాన్ని కలిపి రెండు సమభాగాలుగా ఉడికించండి. మూడు సార్లు బియ్యాన్ని కడిగి శుభ్రం చేసి వడబోయాలి. ఒక స్టెయిన్‌లెస్ స్టీల్ పాత్రలో మామిడిరసం, పాల మిశ్రమంతో కలిపి ఉంచాలి. దీనికి ఒక కప్పు నీరు, లవంగాలు, ఏలకకాయలు, దాల్చిన చెక్క, ఉప్పు చేర్చాలి. కొంతసేపు కాగానే రోజ్‌వాటర్ కుంకుమ పువ్వు చేర్చి, మొత్తమంతా మూత బెట్టి తేలికపాటి వేడిలో ఉడకపెట్టాలి. ఇది సిద్దం కాగానే బాదంకాయ ముక్కలను దీనిపైన గుచ్చాలి. రుచికరమైన పులావ్ మీ కోసం సిద్దమైంది.


[ వెనుకకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం